STOCKS

News


ఇండియా ఈక్విటీలు ఖరీదెక్కువ!

Tuesday 9th April 2019
Markets_main1554801844.png-25034

ఇకపై అప్‌సైడ్‌ పరిమితమేనంటున్న నిపుణులు 
గతేడాది భారీ కరెక‌్షన్‌, కన్సాలిడేషన్‌ జరిపినా కూడా ఇప్పటికీ ఇండియా మార్కెట్‌ వాల్యూషన్లు చాలా ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. వర్ధమాన దేశాల మార్కెట్లలో కానీ, టాప్‌ 20 అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో కానీ భారత మార్కెట్‌ ఖరీదైనదని వివరించారు. ఈ నేపథ్యంలో భారత సూచీల్లో అప్‌ట్రెండ్‌ పరిమితం కావచ్చని భావిస్తున్నారు. ఫెడ్‌ నిర్ణయానంతరం వర్ధమాన మార్కెట్లలోకి నిధుల ప్రవాహం మొదలైంది. ఇలా ఎఫ్‌ఐఐలు భారీగా నిధులు కుమ్మరించిన మార్కెట్లలో భారత్‌ కూడా ఉంది. ఈ ర్యాలీతో ప్రస్తుతం ఎంఎస్‌సీఐ వర్ధమాన సూచీ కన్నా నిఫ్టీ 47 శాతం అధిక ప్రీమియంతో ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ ప్రీమియం 70 శాతముంది. అనంతర పతనంలో చాలావరకు దిగివచ్చినా, ప్రస్తుతం దీర్ఘకాలిక సరాసరి ప్రీమియం 33 శాతం కన్నా ఎక్కువే ఉందని బ్లూమ్‌బర్గ్‌ డేటా చెబుతోంది.

నిఫ్టీ ప్రస్తుత 12 నెలల ముందస్తు పీఈ 18.7 వద్ద ఉంది. తన లాంగ్‌టర్మ్‌ సరాసరి పీఈ కన్నా నిఫ్టీ ప్రస్తుతం 17.7 శాతం ప్రీమియంలో ఉంది. దీంతో టాప్‌ 20 మార్కెట్లలో ఇండియానే అత్యంత ఖరీదైన మార్కెట్‌గా మారింది. నిఫ్టీ 50లో 15 కంపెనీలు భారీ ప్రీమియంలతో ట్రేడవుతున్నాయి. ఇలా భారీ ప్రీమియంలున్న స్టాకుల్లో టైటాన్‌, ఏసియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ తదితరాలున్నాయి. ప్రైస్‌ టు బుక్‌ వాల్యూలెక్కల్లో నిఫ్టీ తన పదేళ్ల సరాసరి కన్నా 2.66 శాతం అధిక ప్రీమియంతో ఉంది. ఎబిటా లెక్కన చూస్తే సరాసరి కన్నా 7.3 శాతం ప్రీమియంతో ఉంది. మార్కెట్‌ క్యాప్‌ టు జీడీపీ నిష్పత్తిని దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు పరిశీలిస్తుంటారు. ఈ నిష్పత్తి పదేళ్ల సరాసరి 79 శాతం కాగా, ప్రస్తుతం 83 శాతం ఉంది. ఈ విధంగా అన్ని రకాల లెక్కల్లో నిఫ్టీ తన సరాసరి కన్నా ఎక్కువ ప్రీమియంతో ఉంది. అందువల్ల దేశీ సూచీలు ఖరీదైనవిగా మారాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు వీలయినంతవరకు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ మరో కొత్త రికార్డు

Tuesday 9th April 2019

నాన్‌ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌(హెచ్‌డీఎఫ్‌సీ) లిమిటెడ్‌ షేర్లు మంగళవారం కొత్త రికార్డు గరిష్టానికి చేరుకున్నాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ షేరు రూ.2054.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో దాదాపు 1శాతం పెరిగి రూ.2072.90ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం గం.2:45ని.లకు షేరు గత ముగింపు(రూ.2053.09)తో పోలిస్తే అరశాతం లాభంతో రూ.2065ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా

అరశాతం పెరిగిన ఐటీ ఇండెక్స్‌

Tuesday 9th April 2019

మార్కెట్‌ ఒడిదుడుకుల ర్యాలీలో భాగంగా ఐటీ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభపడింది. టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్‌ ర్యాలీ ఇండెక్స్‌ను లాభపడేందుకు దోహదపడ్డాయి. మధ్యాహ్నం గం.2:00లకు నిఫ్టీ ఇండెక్స్‌ 0.75శాతం లాభపడి 16,152.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా విప్రో 3.50శాతం లాభపడింది. హెచ్‌సీఎల్‌ 2శాతం, టీసీఎస్‌, ఇన్ఫీభీమ్‌, టెక్‌ మహీంద్రా, మైండ్‌ ట్రీ షేర్లు 1శాతం లాభపడ్డాయి.

Most from this category