STOCKS

News


ఇకపై మిడ్‌, స్మాల్‌క్యాప్‌ల ర్యాలీ: ఐసీఐసీఐ డైరెక్ట్‌

Sunday 11th November 2018
Markets_main1541960277.png-21875

నిఫ్టీ 10,760 వరకు ప్రస్తుత అప్‌మూవ్‌లో ర్యాలీ చేస్తుందన్న అంచనాను ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలిపింది. నిఫ్టీ తక్షణ మద్దతు స్థాయి 10,200ను బ్రేక్‌ చేస్తుందని తాము భావించడం లేదని పేర్కొంది. ఈ మద్దతు స్థాయి వరకూ మార్కెట్‌ దిద్దుబాటుకు గురైతే కనుక నాణ్యమైన స్టాక్స్ కొనుగోలుకు అవకాశంగా వినియోగించుకోవచ్చని సూచించింది. వారం వారీ స్కేల్‌ను గమనిస్తే నిఫ్టీ బలమైన బుల్‌ క్యాండిల్‌ ఏర్పాటు చేసిందని, గరిష్టంలో గరిష్టం, గరిష్ట కనిష్ట స్థాయిల నమోదు అన్నవి ఎనిమిది వారాల క్షీణత తర్వాత బలమైన రివర్సల్‌ ట్రెండ్‌ను సూచిస్తున్నట్టు తెలిపింది. అంచనాలకు అనుగుణంగా ఎనిమిది వారాల కంటే ఎక్కువ దిద్దుబాటుకు గురికాని రిథమ్‌ను కొనసాగించినట్టు పేర్కొంది. ఇక ముందు నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు ఇతర సూచీలతో పోలిస్తే మంచి పనీతీరు ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ స్థాయిల నుంచి ఏ మాత్రం తగ్గినా నాణ్యమైన స్టాక్స్‌ కొనుగోలుకు అవకాశంగా వినియోగించుకోవాలని సూచించింది. ఆరు నెలల కాల వ్యవధి కోసం కొనుగోలుకు అవకాశం ఉన్న రెండు స్టాక్స్‌ను సాంకేతిక అంశాల ఆధారంగా తెలియజేసింది.

 

సన్‌ఫార్మా
లక్ష్యం రూ.659, స్టాప్‌లాప్‌ రూ.538. ఇటీవలి పతనంలో ఫార్మా రంగం మంచి పనితీరు చూపించింది. సెప్టెంబర్‌లో అధిక కొనుగోళ్ల స్థాయి తర్వాత సన్‌ఫార్మా రెండో దశ కన్సాలిడేషన్‌లో ఉంది. 200 రోజుల ఎస్‌ఎంఏ రూ.558 వద్ద మద్దతుతో తిరిగి పైకి వచ్చింది. ఈ స్టాక్‌ తదుపరి అప్‌మూవ్‌ కోసం అధిక బేస్‌ నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం. కనుక ఈ స్టాక్‌లో ప్రవేశానికి ఇది అవకాశం. రూ.580-540 శ్రేణిలో బేస్‌ ఏర్పాటు చేస్తుందని అంచనా. 
ఏబీబీ
లక్ష్యం రూ.1,550, స్టాప్‌లాస్‌ రూ.1,190. ఈ స్టాక్‌ చివరి అప్‌మూవ్‌ (రూ1,129-1,517లో 80 శాతాన్ని కోల్పోయింది. దీంతో అధిక కనిష్టాన్ని నమోదు చేసింది. ప్రస్తుత కరెక్షన్‌ దశకు ఇది ముగింపు. ఇక ముందు ఈ స్టాక్‌ రూ.1,200 స్థాయిలో నిలదొక్కుకుంటుందని అంచనా వేస్తున్నాం. ఈ స్థాయిలోనే స్టాక్‌ బలమైన బేస్‌ను నమోదు చేసింది. రూ1,550 దిశగా మధ్య కాలానికి ర్యాలీకి ఇది బేస్‌గా సాయపడుతుంది. You may be interested

రతన్‌టాటా పెట్టుబడి సక్సెస్‌!

Sunday 11th November 2018

స్టార్టప్‌ కంపెనీల్లో టాటా గ్రూపు గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా పెట్టుబడులు పెడుతుంటారు. పదుల సంఖ్యలో ఇలా ఇప్పటి వరకు ఆయన పెట్టుబడులు పెట్టడం గమనార్హం. అయితే, ఇందులో ఓ టెక్నాలజీ స్టార్టప్‌ ఆయనకు భారీ రాబడులను తెచ్చిపెట్టిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. సిలికాన్‌ వ్యాలీనే కాదు... భారతీయ పట్టణాలు సైతం టెక్నాలజీ కంపెనీల అద్భుతాలకు కేంద్రంగా మారాయంటోంది డెలాయిట్‌ సంస్థ. బెంగళూరు, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్‌లు అత్యంత వేగంగా

ఈ దశలో ఇన్వెస్టర్ల ముందున్న మార్గాలు?

Sunday 11th November 2018

రెండు వరుస నెలల పతనం తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం విరామం తీసుకుని తదుపరి డైరెక్షన్‌ కోసం ఎదురు చూస్తున్నాయి. మరి మార్కెట్ల పతనం ముగిసిందా? లేక మరికొంత కాలం ఆగిపోవాలా..? ఈ విషయాలు కొత్త ఇన్వెస్టర్లకు తెలియడం కొంచెం కష్టమైన పనే. ఈ విషయంలో ఇన్వెస్టర్లు అనుసరించతగిన వ్యూహాలను కోటక్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ తెలియజేశారు.    తాజా మార్కెట్‌ ర్యాలీలో బలహీనమైన దీర్ఘకాలిక

Most from this category