STOCKS

News


నిఫ్టీ మిడ్‌క్యాప్‌... ర్యాలీకి ఛాన్స్‌..!

Monday 3rd December 2018
Markets_main1543831999.png-22596

ముంబై: వచ్చే కొన్ని వారాల్లోనే మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 8-10 శాతం వరకు అవకాశం ఉందని కొటక్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్ చౌహాన్ విశ్లేషించారు. ప్రస్తుతం 4,780 పాయింట్ల స్థాయిలో ఉన్నటువంటి నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 50 త్వరలోనే 5,200 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని చార్టుల ఆధారంగా స్పష్టమవుతోందని వివరించారు. ఈ సూచీలోని షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆకర్షణీయ రాబడిని పొందవచ్చన్నారు. ఈ సూచీలోని షేర్లతో పాటు ఇతర ఎంపిక చేసిన మిడ్‌క్యాప్స్‌ను కూడా పరిశీలించవచ్చని విశ్లేషించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఈ షేర్లలో బుల్లిష్‌ సెంటిమెంట్‌ బలపడుతుందన్నారు. నేరుగా షేర్లలో ఇన్వెస్ట్‌ చేయలేని వారు మిడ్‌క్యాప్స్‌లో ఎక్స్‌పోజర్‌ కలిగిన ఈటీఎఫ్‌లను కొనుగోలుచేయవచ్చని చెప్పారు. మిడ్‌క్యాప్స్‌లో పెట్టుబడి పెట్టడం అనేది వడ్డీ రేట్ల పెరుగుదల సమయంలో విలువైన సాధనాల్లో ఇన్వెస్ట్‌చేయడం వంటిదని వివరించారు. ఈ తరహా కంపెనీలు అధిక మొత్తం రుణాలపైనే ఆధారపడాయి. ద్రవ్యలభ్యత సమయంలో ముందస్తు బోటమ్‌ను నమోదుచేస్తాయి. అయితే, మార్కెట్‌ అనిశ్చితిగా ఉన్నప్పుడు తొలుత నెమ్మదిగా కొనసాగినప్పటికీ ఆ తరవాత మాత్రం ఏకంగా అవుట్‌పెర్ఫార్మ్‌ చేస్తాయని వివరించారు. ఈ ఏడాదిలో నిఫ్టీ నూతన గరిష్టస్థాయిని నమోదుచేసినప్పటికీ.. మిడ్‌క్యాప్స్‌ సూచీ ఈ తరహా న్యూహైని నమోదుచేయలేదు. ఈ అంశాల ఆధారంగా తరువాత ర్యాలీ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 50లో ఉండనుందని భావిస్తున్నట్లు వివరించారు.



You may be interested

ఆరంభలాభాలు ఆవిరి

Monday 3rd December 2018

10900 స్థాయిని నిలుపుకోలేకపోయిన నిఫ్టీ మెరిసిన మెటల్‌ షేర్లు ఫార్మాకు సన్‌ఫార్మాకు జ్వరం ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు... చివరి అరగంటలో హెచ్‌యూఎల్‌ షేర్ల ర్యాలీ అండతో స్వల్పలాభంతో గట్టెక్కాయి. అమెరికా-చైనా దేశాల మధ్య కుదరిన వాణిజ్య యుద్ధ సంధితో ట్రేడింగ్‌ ప్రారంభంలో ఆర్జించిన లాభాల్ని నిలుపుకోవడంతో సూచీలు విఫలయ్యాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభంలో నిఫ్టీ సూచి అందుకున్న 10900 మార్కును, సెన్సెక్స్‌ ఆర్జించిన 250 పాయింట్ల లాభాల్ని సూచీలు కోల్పోయాయి. చివరకు

అశోక్‌ లేలాండ్‌, ఎం అండ్‌ ఎం డౌన్‌...మారుతి, టాటా మోటార్స్‌ అప్‌

Monday 3rd December 2018

దేశీయ పాసింజర్‌ వాహన విక్రయాలు నవంబర్‌లో అంతంత మాత్రంగానే నమోదుకావడంతో ఆయాకంపెనీల షేర్లు సోమవారం మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి.   ఈ నెలలో మారుతి, అశోక్‌ లేలాండ్‌, టాటామోటర్స్‌ వాహన విక్రయాలు క్షీణించగా, ఎండ్‌అండ్‌ఎం అమ్మకాలు పెరిగాయి. పరిశ్రమలో ద్రవ్యత్వలోటు, రిటైల్‌ ఫైనాన్స్‌ తగ్గుముఖం పట్టడం, స్థూల ఆర్థిఖ వ్యవస్థ అంతంత మాత్రంగా నమోదుకావడం తదితర కారణాలు వాహన విక్రయాలపై ప్రభావాన్ని చూపాయని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు

Most from this category