STOCKS

News


కళతప్పిన మెటల్‌ షేర్లు

Thursday 11th October 2018
Markets_main1539239829.png-21046

మార్కెట్‌ భారీ పతనంలో భాగంగా గురువారం మెటల్‌ షేర్లు కళతప్పాయి. అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లలో నెలకొన్న అ‍మ్మకాల్లో భాగంగా నేటి ట్రేడింగ్‌లో మెటల్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎన్‌ఎస్‌ఈలోని మెటల్‌ ఇండెక్స్‌ అత్యధికంగా దాదాపు 5శాతం నష్టపోయింది. ఉదయం గం.11:30ని.లకు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3.76శాతం నష్టపోయి 3,309.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఇండెక్స్‌లోని జిందాల్‌ స్టీల్‌ అత్యధికంగా 6శాతం నష్టపోయింది. టాటాస్టీల్‌ 5శాతం నష్టపోయి నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 లూజర్‌లో చోటు దక్కించుకుంది. వాటితో పాటు హిందాల్కో, వెల్‌స్పాన్‌ కార్ప్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీ్‌ల్‌, జేఎస్‌ఎల్‌ హిస్సార్‌ హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 4నుంచి 3శాతం నష్టపోయాయి. మెయిల్‌, సెయిల్‌, వేదాంత, ఏపిల్‌ అపోలో, ఎన్‌ఎండీసీ, కోల్‌ ఇండియా షేర్లు 2శాతం పతనమైంది. హిందూస్థాన్‌ జింక్‌ 1.50శాతం క్షీణించింది. నాల్కో మాత్రం 1శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

లాభాల్లో యస్‌ బ్యాంక్‌

Thursday 11th October 2018

మార్కెట్‌ ట్రెండ్‌కు వ్యతిరేకంగా యస్‌ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., గురువారం యస్‌ బ్యాంకు షేర్లు దాదాపు 15శాతం వరకు లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో రూ.225.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. యస్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ పదవి నియామక కమిటి నేడు తొలిసారిగా సమావేశకానుంది. ఈ నేపథ్యంలో షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఇంట్రాడేలో 14.69శాతం లాభపడి రూ.268.45లకు చేరుకుంది. ఈ

మార్కెట్లలో మహా పతనం

Thursday 11th October 2018

ప్రపంచవ్యాప్తంగా ఢమాల్‌మంటున్న ఈక్విటీలు ట్రేడ్‌ వార్‌ టెన్షన్స్‌, ఫెడ్‌ రేట్లు కారణాలంటున్న నిపుణులు బుధవారం అమెరికా మార్కెట్లలో ఆరంభమైన మార్కెట్‌ మంటలు ప్రపంచ మార్కెట్లన్నింటికీ వ్యాపించాయి. ఆస్ట్రేలియా నుంచి ఇండియా వరకు ఆసియా మార్కెట్లన్నీ గురువారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 200 సూచీ 2 శాతం, జపాన్‌ నికాయ్‌ 4.4 శాతం, హాంకాంగ్‌ హ్యాంగ్‌సాంగ్‌ 3.7 శాతం, చైనా షాంఘై 4.4 శాతం, తైవాన్‌ టీఎస్‌ఈసీ సూచీ 6.3 శాతం

Most from this category