STOCKS

News


మెటల్‌ షేర్లలో అమ్మకాలు

Monday 11th February 2019
Markets_main1549873337.png-24134

ప్రపంచమార్కెట్లో పతనమవుతున్న మెటల్‌ షేర్ల పతనానికి అనుగుణంగా దేశీయ మార్కెట్లో మెటల్‌ షేర్లు నష్టాల బాటపట్టాయి. మెటల్‌ షేర్లలో అధిక పరిమాణం గల నాల్కో, వేదాంత, వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌, జిందాల్‌ స్టీల్‌, మెయిల్‌ షేర్ల క్షీణతతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌లో 2శాతం నష్టపోయింది. అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి మందగమనం, చైనా-అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం, అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ ఆందోళన కొనసాగుతుండం తదితర అంశాలు మెటల్‌ షేర్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి. యూరోజోన్‌, అమెరికా, చైనాలు ఇటీవల విడుదల చేసిన గణాంకాలు పరిశీలించినట్లైతే మెటల్‌ ధరలకు డిమాండ్‌ తగ్గిన అంశాన్ని గమనించవచ్చని విశ్లేషకులంటున్నారు. నేటి ట్రేడింగ్‌లో అత్యధికంగా నాల్కో 9శాతం నష్టపోగా, వేదాంత, హిందాల్కో, వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌ షేర్లు 4శాతం నష్టపోయాయియ. జిందాల్‌ స్టీల్‌ 3శాతం నష్టపోగా, మెయిల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీ్ల్‌, హిందూస్థాన్‌ కాపర్‌ 2శాతం క్షీణించగా, సెయిల్‌, టాటాస్టీల్‌ షేర్లు 1శాతం పతనమయ్యాయి. ఫలితంగా ఇంట్రాడే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయి 2,675.50ల కనిష్టానికి పతనమైంది. అయితే ఈ కనిష్టస్థాయి(2,675.50) వద్ద కొనుగోళ్లు జరగడంతో మెటల్‌ షేర్లు కొంత రికవరీ అయ్యాయి. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(2,740.50)తో పోలిస్తే -0.65శాతం నష్టపోయి 2,722.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా జేఎస్‌ఎల్‌హిస్సార్‌ 5శాతం లాభపడగా, టాటా స్టీల్‌ 1.50శాతం, హిందూస్థాన్‌ కాపర్‌ షేరు అరశాతం లాభపడ్డాయి.



You may be interested

పట్టు నిలుపుకోలేకపోతున్న బుల్స్‌!

Monday 11th February 2019

నిఫ్టీలో ఫాల్స్‌ బ్రేకవుట్‌ జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు కొన్ని వారాలుగా కన్సాలిడేట్‌ అవుతున్న నిఫ్టీ గతవారం 11వేల పాయింట్లను దాటి బ్రేకవుట్‌ ఇచ్చినట్లు కనిపించింది. కానీ వెనువెంటనే వెనుకంజ వేసి ప్రస్తుతం 10900 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో గతవారం బ్రేకవుట్‌ తప్పుదోవ పట్టించే సూచనా? అని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. నిఫ్టీ 11వేల పాయింట్ల పైన నిలదొక్కుకోనంత వరకు బుల్స్‌కు పట్టు చిక్కదని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.  నిఫ్టీపై వివిధ అనలిస్టుల అంచనాలు 1. సెంట్రమ్‌

షార్ట్‌టర్మ్‌కు టాప్‌ స్టాక్స్‌

Monday 11th February 2019

వచ్చే 2-3 వారాల్లో మంచి రాబడినిచ్చే సత్తా ఉన్న స్టాకులను ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. చార్ట్‌వ్యూ ఇండియా రికమండేషన్లు 1. లుపిన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 890. స్టాప్‌లాస్‌ రూ. 797. మూడు సెషన్లుగా లాంగ్‌లోయర్‌ షాడోలను ఏర్పరుస్తూ రూ. 800 వద్ద కొనుగోళ్లను ఆకర్షిస్తోంది. ఇటీవలి కాలంలో రూ. 800-900 మధ్య కదలాడుతోంది. అందువల్ల ఈ శ్రేణికి దిగువ అవధి వద్ద కొనుగోళ్లు చేయవచ్చు. 2. సుప్రీం ఇండస్ట్రీస్‌: కొనొచ్చు.

Most from this category