News


మెటల్‌ షేర్ల పతనం

Monday 4th February 2019
Markets_main1549273343.png-24008

మిడ్‌సెషన్‌ సమయానికి లాభాల్లోకి మళ్లిన మార్కెట్లో మెటల్‌ ఇంకా నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. మెటల్‌ షేర్ల ప్రధాన షేర్లైఏన హిందాల్కో ఇండస్ట్రీస్‌, హిందూస్థాన్‌ కాపర్‌, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌, టాటా స్టీల్, సెయిల్‌ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌లో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ సోమవారం దాదాపు 2శాతం నష్టపోయింది. స్వల్ప లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలకు మెటల్‌ షేర్ల పతనంతో మరింత నష్టాలను కలిగించింది. మధ్యాహ్నం గం.3:00లకు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1శాతం నష్టంతో 2,775.70 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మెటల్‌ ఇండెక్స్‌లో అత్యధికంగా హిందాల్కో 4శాతం నష్టపోయింది. హిందూస్థాన్‌ కాపర్‌, జేఎస్‌ఎల్‌హిస్సార్‌ 3శాతం క్షీణించగా, వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌, సెయిల్‌, కోల్‌ ఇండియా, నాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వేదాంత లిమిటెడ్‌ షేర్లు 1శాతం వరకు క్షీణించాయి. ఇక ఎన్‌ఎండీసీ, హిందూస్థాన్‌ జింక్‌, టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌ మెయిల్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి.



You may be interested

గురువారం ఉదయమే ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం

Monday 4th February 2019

 ఈ నెల 5 నుంచి 7 వరకూ జరగనున్న రిజర్వుబ్యాంక్‌ పరపతి విధాన సమీక్షకు సంబంధించిన నిర్ణయం గురువారం ఉదయం 11.45 గంటలకు వెలువడుతుందని కేంద్ర బ్యాంక్‌ తన వెబ్‌సైట్‌లో సమాచారం ఇచ్చింది. గత కొద్ది సమీక్షా సమావేశాల నిర్ణయాల్ని మధ్యాహ్నం 2.30 గంటలకు వెలువరిస్తూ వచ్చిన ఆర్‌బీఐ... ఈ దఫా నిర్ణయాన్ని మధ్యాహ్నం లోపుగానే ప్రకటించనుంది. వేళల మార్పునకు కారణాలు తెలియరాలేదు.

జీవితకాల గరిష్టానికి టైటాన్‌

Monday 4th February 2019

బ్రాండెడ్‌ బంగారు ఆభరణాలను విక్రయించే టైటాన్‌ కంపెనీ షేర్‌ ధర సోమవారం జీవితాల గరిష్టాన్ని చేరింది. తృతీయ త్రైమాసికం(క్యూ 3)లో కంపెనీ ఆర్జించిన ఫలితాలు మార్కెట్‌ ఆశించిన స్థాయిలో నమోదు కావడం, షేరుకు ప్రముఖ బ్రేకరేజ్‌ సంస్థలు రేటింగ్‌ పెంచడటం తదితర అంశాలు షేరు ర్యాలీ చేయడానికి దోహదపడ్డాయి. నేడు టైటాన్‌ షేరు బీఎస్‌ఈలో రూ.1024.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు షేరు కొనుగోళ్ల మొగ్గుచూపడంతో షేరు 6శాతం ర్యాలీ

Most from this category