STOCKS

News


కళ తప్పిన లోహ షేర్లు..!

Wednesday 18th July 2018
Markets_main1531898445.png-18435

ముంబై:- క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో ర్యాలీ చేసిన లోహ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో పాటు, ప్రపంచమార్కెట్లో లోహా ధరల పతనంతో బుధవారం లోహ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో లోహ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ సూచి మంగళవారం 3.30 శాతం పైగా క్షీణించింది. మధ్యాహ్నం గం.12:30లకు నిఫ్టీ మెటల్‌ గత ముగింపు 3223 పాయింట్లతో పోలిస్తే 2.63శాతం నష్టంతో 3,138 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ - 50 సూచీలో టాప్‌ - 5 లూజర్లలో టాటా స్టీల్‌(5శాతం నష్టం) మొదటి స్థానంలో ట్రేడ్‌ అవుతుండగా,  హిందాల్కో(3.50 శాతం నష్టం), వేదాంత(3శాతం నష్టం) షేర్లు 3, 4స్థానాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌లోని మొత్తం 15 షేర్లూ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ సూచిలోని ప్రధాన షేర్లైన టాటాస్టీ్‌ల్‌ అత్యధికంగా 5శాతం నష్టపోగా, జిందాల్‌ స్టీల్‌, హిందూస్తాన్‌ కాపర్‌, నాల్కో,  హిందాల్కో షేర్లు 3శాతం పతనమయ్యాయి. అదేవిధంగా సెయిల్‌, వేదాంత, ఎన్‌ఎండీసీ, జేఎస్‌డబ్ల్యూ షేర్లు 2శాతం క్షీణించాయి. అదేబాటలో మెయిల్‌ , కోల్‌ ఇండియా, ఏపిఎల్‌ అపోలో, జేఎస్‌ఎల్‌ హిస్సార్‌, వెల్‌స్పన్‌కార్పోరేషన్‌ స్టీల్‌, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు 1నుంచి అరశాతం వరకు నష్టపోయాయి.



You may be interested

ఓఎన్‌జీసీ షేరు 5శాతం అప్‌

Wednesday 18th July 2018

పవన్‌హన్స్‌లో వాటా విక్రయానికి ఓఎన్‌జీసీ ఓకే..! ముంబై:- పవన్‌హన్స్‌లో వాటా విక్రయానికి ఓఎన్‌జీసీ బోర్డు ఆమోదం తెలపడంతో ఓఎన్‌జీసీ షేర్లు బుధవారం బీఎస్‌ఈలో 5శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఓఎన్‌జీసీ షేర్లు రూ.157.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. పవన్‌హన్స్‌లో తనకున్న 49శాతం వాటా విక్రయించేందుకు ఓఎన్‌జీసీ బోర్డు ఆమోదం తెలిపినట్లు ఓఎన్‌జీసీ స్టాక్‌ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈ వార్తల నేపథ్యంలో ఓఎన్‌జీసీ షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో 5శాతానికి పైగా

అక్టోబర్‌ నుంచి ఆకాశ వీధిలో డ్రోన్స్‌ సందడి!

Wednesday 18th July 2018

పౌర అవసరాల నిమిత్తం వాడే డ్రోన్స్‌(మానవ రహిత సూక్ష్మతర విమానాలు) వచ్చే అక్టోబర్‌ నుంచి భారత గగనతలంలో సందడికి సిద్ధమవుతున్నాయి. వీటి విహారానికి కావలిసిన నియమనిబంధనలను, నియంత్రణా విధానాలను పౌరవిమానయాన శాఖ త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిసింది. పౌరఅవసరాల కోసం వాడే డ్రోన్స్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునే వ్యవస్థను రూపొందిస్తున్నామని పౌర విమానయాన కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే చెప్పారు. అక్టోబర్‌ నుంచి ఈ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, ఎగిరే అనుమతులు ఆరంభం

Most from this category