STOCKS

News


మెరుస్తున్న మెటల్‌ షేర్లు

Friday 2nd November 2018
Markets_main1541151708.png-21668

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా శుక్రవారం మెటల్‌ షేర్లు మెరుస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ నేడు 3శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.2:45ని.లకు నిఫ్టీ ఇండెక్స్‌ 3శాతం లాభపడి 3,469.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ ఈ ఇండెక్స్‌లో మొత్తం 15 షేర్లలో 13 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అ‍త్యధికంగా జేఎస్‌ఎల్‌హిస్సార్‌ స్టీల్‌, వేదాంత 6శాతం ర్యాలీ చేశాయి. జిందాల్‌స్టీల్‌ 5శాతం, సెయిల్‌ 3.50శాతం, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటాస్టీల్‌ షేర్లు 3శాతం లాభపడ్డాయి. ఎన్‌ఎండీసీ షేరు 2శాతం పెరిగింది. హిందూస్థాన్‌ కాపర్‌ 1శాతం, కోల్‌ ఇండియా, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌, ఏపిల్‌ అపోల్‌ షేర్లు 1శాతం నష్టపోగా, అదే బాటలో నాల్కో, మెయిల్‌ అరశాతం క్షీణించాయి. ఇదే సమయానికి వేదాంత లిమిటెడ్‌ షేరు 6శాతం లాభంతో నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో మూడోస్థానాన్ని దక్కించుకుంది. జిందాల్‌ స్టీల్‌&పవర్‌ వరుసగా ఐదో రోజూ లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

అదరగొట్టిన అటో షేర్లు

Friday 2nd November 2018

అక్టోబర్‌లో వాహన విక్రయాలు ఆశించినస్థాయిలో లేనప్పటికీ.., శుక్రవారం ఆటోరంగ షేర్లు అదరగొట్టాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో 4.50శాతం ర్యాలీ చేసింది. గత కొంతకాలంగా స్తబ్ధుగా సాగుతున్న అటోరంగ షేర్లలో నేడు కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఇండెక్స్‌ ర్యాలీకి కారణమైందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. చివరకు 4.15 శాతం లాభంతో 9,180.20 వద్ద ముగిసింది. సూచిలో భాగమైన మొత్తం 16 షేర్లలో ఒక్క ఎక్సైడ్‌ ఇండియా లిమిటెడ్‌(1శాతం నష్టం)

85 పైసలు బలపడిన రూపాయి

Friday 2nd November 2018

72 స్థాయి దిశగా రూపాయి కదలికలు ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఒక్కసారిగా పుంజుకుంది. ఇంట్రాడేలో 85 పైసలు బలపడింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో మధ్యాహ్నం 2 గంటల సమయానికి 72.60 వద్దకు చేరుకుంది. గురువారం నాటి మార్కెట్‌ ముగింపు సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ 50 పైసలు బలపడి 73.45 వద్ద ముగిసిన రూపాయి విలువ.. డాలరు విలువ బలహీనపడడం, ముడిచమురు

Most from this category