STOCKS

News


నష్టాల్లో మెటల్‌ షేర్లు

Thursday 17th January 2019
Markets_main1547713574.png-23638

ఒడిదుడుకుల మార్కెట్‌లో అత్యధిక శాతం మెటల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపుతో పోలిస్తే 0.45శాతం నష్టపోయి 2,952.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లోని మొత్తం 15 షేర్లలో 10 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా 5 షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ షేరు 3.50శాతం నష్టపోయింది. అలాగే ఎన్‌ఎండీసీ షేరు 1.50శాతం, సెయిల్‌, హిందాల్కో, అపోలో ఏపిల్‌, జేఎస్‌ఎల్‌ఆర్‌ హిస్సార్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. అలాగే జిందాల్‌ స్టీల్‌, మెయిల్‌, హిందూస్తాన్‌ కాపర్‌, టాటా స్టీల్‌ కాపర్‌ షేర్లు అరశాతం పతనమయ్యాయి. మరోవైపు కోల్‌ ఇండియా, నాల్కో, వేదాంత, హిందూస్థాన్‌ జింక్‌, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌ షేరు అరశాతం లాభపడ్డాయి. 



You may be interested

ముందుంది మాంద్యం!

Thursday 17th January 2019

శంకిస్తున్న యూఎస్‌ దిగ్గజ కంపెనీలు ఒక సంవత్సరంలోపు మరోమారు ఆర్థిక మాంద్యం తప్పకపోవచ్చని ప్రముఖ అమెరికన్‌ కంపెనీలు అనుమానిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే ఈ కంపెనీలు తమ ఎర్నింగ్స్‌ అంచనాలను తగ్గిస్తున్నాయి. దీనికితోడు ఈల్డ్స్‌ గ్రాఫ్‌లో ట్రెండ్‌ కూడా మాంద్యానికి సంకేతాలిస్తోంది. దీంతో అంతర్జాతీయ ఈక్విటీ ఇన్వెస్టర్లు మాంద్యం తప్పదని భావిస్తున్నారు. గత మూడు నెలల్లో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అనూహ్యంగా కిందకు దిగజారింది. ప్రపంచ జీడీపీ 2.5 శాతానికి పరిమితమయింది. దీంతో

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ డౌన్‌

Thursday 17th January 2019

క్రితం రోజు ర్యాలీ చేసిన పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ గురువారం నష్టాల బాట పట్టింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు ధరతో పోలిస్తే 1.50శాతం నష్టంతో 3,120.40ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లోని మొత్తం 12 షేర్లకు గానూ 10 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఇండియన్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం స్వల్ప లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని ప్రధాన సూచీలోకెల్లా అధికంగా నష్టపోయిన

Most from this category