STOCKS

News


4నెలల కనిష్టానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌

Tuesday 27th November 2018
Markets_main1543307897.png-22417

  • 52-వారాల కనిష్టానికి  జేఎస్‌పీఎల్‌, వేదాంత స్టీల్‌ షేర్లు

మెటల్‌ షేర్ల పతనం మంగళవారం ట్రేడింగ్‌ సెషన్స్‌లోనూ కొనసాగుతుంది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌ మరో 2.50శాతం నష్టపోయింది. నేడు నిఫ్టీ ఇండెక్స్‌ 3,157ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 2.50శాతం క్షీణించి 3,092శాతానికి పతనమైంది. ఇది నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌కు 4నెలల కనిష్టస్థాయి. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపుతో పోలిస్తే 0.50శాతం నష్టంతో 3,162.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వరుసగా ఐదు ట్రేడింగ్‌ సెషన్స్‌లోనూ నష్టపోయి నిఫ్టీ మెటల్స్‌ ఇండెక్స్‌ మొత్తం 8శాతం క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కంపెనీల మార్జిన్లు తగ్గవచ్చనే అంచనాలతో మెటల్‌ షేర్లు నష్టాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రతికూలాంశానికి తోడు చైనాపై టారీఫ్‌ల సడలింపు ప్రస్తకే లేదని ట్రంప్‌ పేర్కోనడంతో ప్రపంచమార్కెట్లో మెటల్‌ మరింత పైకి ఎగిశాయి. ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో డాలర్‌ బలపడనుడంతో ప్రపంచ మార్కెట్లో మెటల్‌ ర్యాలీ చేస్తున్నాయని మరికొందరి వాదన. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌లోనూ మెటల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి.  ఇదే సమాయనికి సూచీలో భాగమైన మొత్తం 15 షేర్లకు గానూ 11 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యదికంగా జిందాల్‌ స్టీల్‌ 2.50శాతం నష్టపోయి నిఫ్టీ - 50 సూచీలో టాప్‌-5 లూజర్‌గా కొనసాగుతోంది. అలాగే సెయిల్‌, ఎన్‌ఎండీసీ, జేఎస్‌డబ్ల్యూ షేర్లు 2శాతం వరకు నష్టపోయాయి. జేఎస్‌పీఎల్‌, వేదాంత స్టీల్‌ షేర్లు 52- వారాల కనిష్టాన్ని తాకాయి.



You may be interested

మెటల్‌ షేర్ల టార్గెట్‌ ధరల్లో కోత విధించిన మోర్గాన్ స్టాన్లీ

Tuesday 27th November 2018

ముంబై: దేశీ దిగ్గజ మెటల్‌ కంపెనీల లాభదాయకత దశాబ్దకాల గరిష్టానికి చేరుకోగా.. ఇదే సమయంలో వాల్యూయేషన్స్‌ కూడా ఇదే విధంగా పెరిగిపోయాయని మోర్గాన్ స్టాన్లీ వివరించింది. డిమాండ్‌ పరంగా ఉన్నటువంటి రిస్క్‌, అధిక లివరేజ్‌ అంశాలను బేరీజువేసుకుని అనేక స్టీల్‌ రంగ షేర్ల టార్గెట్‌ ధరలను తగ్గించింది. ఎర్నింగ్స్‌, బ్యాలెన్స్‌ షీట్‌ పరంగా బలంగా ఉన్నటువంటి కంపెనీల షేర్లను కొనుగోలు చేయవచ్చని సూచిస్తూనే.. ఇంతకుముందు ప్రకటించిన టార్గెట్‌లను తాజాగా సవరించింది.

మూలధన సాయం ప్రకటనతో ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల ర్యాలీ

Tuesday 27th November 2018

అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి నష్టాల బాట పట్టింది. అయితే ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ మాత్రం 1శాతం ర్యాలీ చేసింది. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.42వేల కోట్ల మూలధన సాయం అందిస్తామని కేంద్ర శాఖ ప్రకటన ఇందుకు కారణమైంది. మధ్యాహ్నం గం.12:20ని.లకు ఇండెక్స్‌ అరశాతం లాభంతో 2,954.70వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే

Most from this category