STOCKS

News


మెటల్‌ షేర్ల మెరుపులు

Monday 17th December 2018
Markets_main1545039375.png-23005

అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ సంధి కుదరవచ్చని ఆశాహనంతో సోమవారం మెటల్‌ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం లాభపడింది. గతంలో చైనాకు దిగుమతయ్యే అమెరికా వాహనాలు, వాహన విడిభాగాల దిగుమతులపై అదనంగా విధించిన 25శాతం అదనపు పన్నును జనవరి 1, 2019 నాటికి నుంచి రద్దు చేస్తున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు అమెరికా కూడా చైనా దేశపు ఉత్పత్తులపై టారీఫ్‌లను రెట్టింపు చేసే ప్రక్రియను మార్చి 1 దాకా వాయిదా వేయడం కూడా ఇన్వెస్టర్లలో వాణిజ్య యుద్ధ సంధి పట్ల విశ్వాసం కుదురుతుంది. మధ్యాహ్నం గం.2:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(రూ.3,112.35)తో పోలిస్తే 1.50శాతం లాభంతో 3,166.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. హిందూస్థాన్‌కాపర్‌, మెయిల్‌ షేర్లు వరుసగా 6శాతం నుంచి 3శాతం ర్యాలీ చేసి నిప్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో చోటు దక్కించుకున్నాయి. తుత్తికోడి స్టెరిలైట్‌ యూనిట్‌ రీ-ఓపెనింగ్‌తో 6శాతం లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన వేదాంత ప్రస్తుతం 3శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. సెయిల్‌, జిందాల్‌స్టీల్‌, టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ షేర్లు 2శాతం లాభపడ్డాయి.



You may be interested

30% రాబడిని అందించే 3 స్టాక్స్

Monday 17th December 2018

అజ్‌కాన్ గ్లోబల్ ఈక్విటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ఆకాశ్ జైన్ తాజాగా 10-30 శాతం రాబడిని అందించే మూడు స్టాక్స్ సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం.. సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్  1974లో ఏర్పాటైన ఈ కంపెనీ న్యూఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తోంది. భారత్‌, అస్ట్రేలియాలోని అతిపెద్ద ప్రైవేట్‌ మ్యాన్‌పవర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ ప్రొవైడర్స్‌లో ఇది ఒకటి. ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ సర్‌వియలెన్స్‌, సెక్యూరిటీ కన్సల్టింగ్‌, ప్రి-ఎంప్లాయ్‌మెంట్‌ వెరిఫికేషన్‌, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌, క్యాష్‌/బులియన్‌ లాజిస్టిక్స్‌

ఆపరేషన్‌ క్లీన్‌ మనీ కేసులు.. విచారణ తీరు ఇదీ

Monday 17th December 2018

పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్‌ చేసిన వారి సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరం నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 30 వరకు వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌ చేసినవారి సమాచారాన్ని ఆరా తీస్తోన్న ఆదాయపన్ను శాఖ.. రిటర్నులు వేసినవారందని పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతోంది. 31-3-2017 నాటికి పేర్కొన్న ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీల వివరాలు, రిటర్నులు

Most from this category