STOCKS

News


నష్టాల బాటలో మెటల్‌ షేర్ల పయనం

Monday 26th November 2018
Markets_main1543219020.png-22389

మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు ప్రారంభ లాభాల్ని కోల్పోయి పరిమితి శ్రేణిలో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ ‍క్రమంలో మెటల్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ ధరలు పెరుగుతున్ననేపథ్యంలో రానున్న రోజుల్లో కంపెనీల మార్జిన్లు తగ్గవచ్చనే అంచనాలతో మెటల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 3శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(3,214)తో పోలిస్తే 2.50శాతం నష్టపోయి 3,138 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన మొత్తం 15 షేర్లలో 12 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 3 షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సూచీలో అత్యధికంగా జిందాల్‌స్టీల్‌&పవర్‌ 7.5శాతం నష్టపోయింది. వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌, సెయిల్‌ 5శాతం, వేదాంత స్టీల్‌ 4శాతం, టాటాస్టీల్‌ 3శాతం, కోల్‌ ఇండియా, జేఎస్‌ఎల్‌హిస్సార్‌ 2.50శాతం క్షీణించాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీ్‌ల్‌, హిందూస్థాన్‌ కాపర్‌ 2శాతం నష్టపోయాయి. అలాగే హిందాల్కో, నాల్కో 1శాతం పతనమయ్యాయి. హిందూస్థాన్‌ జింక్, ఏపిల్‌ అపోలో షేర్లు అరశాతం వరకు నష్టపోయాయి. మరోవైపు ఇదే సూచీలో ఎన్‌ఎండీసీ, మెయిల్‌ షేర్లు షేర్లు అరశాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. వేదాంత, కోల్‌ ఇండియా షేర్లు 3శాతం నష్టపోయి నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 లూజర్లలో చోటు దక్కించుకున్నాయి.



You may be interested

52-వారాల కనిష్టానికి 60 షేర్లు

Monday 26th November 2018

సూచీలు మిడ్‌సెషన్‌ సమయానికి లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఎన్‌ఎస్‌ఈలో 60 షేర్లు మాత్రం 52-వారాల కనిష్టానికి పతనమయ్యాయి. కోల్‌ ఇండియా, వేదాంత, బీఎఎస్‌ఎఫ్‌ ఇండియా, ఆంధ్రా సిమెంట్స్‌, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌, ఎన్‌టీపీసీ, పీజీ ఎలక్ట్రోపాస్ట్‌ షేర్లు తమ ఏడాది కనిష్ట స్థాయికి క్షీణించాయి. వాటితో పాటు ఆమ్టెక్‌ అటో, ఆధునిక్‌ మెటాలిక్స్‌, గణేష్‌ హౌసింగ్ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌, క్యాపిటల్‌ ట్రస్ట్‌, నెట్‌వర్క్‌ 18 మీడియా&ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఇండియా గ్లైకోల్స్‌, సింటెక్స్‌ ప్లాస్టిక్‌

ఎన్‌టీపీసీ టార్గెట్‌ ధరను తగ్గించిన సిటీ

Monday 26th November 2018

ముంబై: ప్రభుత్వ రంగ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్‌టీపీసీ షేరు ధర సోమవారం ట్రేడింగ్‌లో 52 వారాల కనిష్టస్థాయిని తాకింది. ఇంట్రాడేలో రూ.141.70 వద్దకు పడిపోయింది. ఉదయం 12 గంటల సమయానికి ఎన్‌ఎస్‌ఈలో రూ.3.55 (2.43 శాతం) నష్టపోయి రూ.142 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరుకు పలు దిగ్గజ బ్రోకింగ్‌ సంస్థలు టార్గెట్‌ ధరలను వరుసగా తగ్గిస్తున్న నేపథ్యంలో షేరు ధరలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత

Most from this category