STOCKS

News


11600- 12000పాయింట్ల రేంజ్‌లో నిఫ్టీ!

Friday 19th April 2019
Markets_main1555657564.png-25227

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అంచనా
వచ్చే మూడు నాలుగు వారాల పాటు నిఫ్టీ 11600- 12000 పాయింట్ల రేంజ్‌లో కదలాడవచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ రాజేష్‌ పాల్వియా అంచనా వేస్తున్నారు. గత రెండు వారాల శ్రేణిని ఈ వారం నిఫ్టీ దాటి మరో ఆల్‌టైమ్‌హైని చూసింది. దీంతో మిడ్‌టర్మ్‌కు బుల్లిష్‌ సెంటిమెంట్‌ పుంజుకుందని తెలిపారు. చార్టుల్లో హయ్యర్‌టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తోందన్నారు. నిఫ్టీ 11760 పాయింట్లకు పైన ఉన్నంత వరకు బుల్లిష్‌గానే ఉంటుందని, క్రమంగా 12వేల పాయింట్ల వరకు చేరుతుందని చెప్పారు. దిగువన 11700- 11630 పాయింట్ల వద్ద కీలక మద్దతు జోన్‌ ఉందన్నారు. దీన్ని కాపాడుకోలేకుంటే 11550- 11500 పాయింట్ల వద్ద మరో బలమైన మద్దతు ఉందన్నారు. నిఫ్టీ 11562 పాయింట్లను కాపాడుకున్నంతవరకు బుల్స్‌కు పెద్దగా ఇబ్బంది ఉండదన్నారు. ఈ స్థాయికి పైన ఉన్నంత వరకు పడినప్పుడు కొను వ్యూహాన్ని అమలు చేయవచ్చన్నారు. చార్టుల్లో ఆర్‌ఎస్‌ఐ, స్టోకాస్టిక్‌ తదితర ఇండికేటర్లన్నీ బుల్లిష్‌ మూడ్‌లోనే ఉన్నాయని చెప్పారు. 
బ్యాంకు నిఫ్టీ సైతం మరోమారు పాజిటివ్‌గా మారిందని రాజేష్‌ చెప్పారు. ఎనిమిది రోజుల పాటు 29700-30200 పాయింట్ల మధ్య కన్సాలిడేట్‌ జరిపిన అనంతరం బ్యాంకు నిఫ్టీ బుల్లిష్‌ ట్రెండ్‌లోకి వచ్చిందన్నారు. 30500 పాయింట్ల పైన సూచీ కదలాడినంతవరకు ఇబ్బందిలేదని, క్రమంగా 31000 పాయింట్ల వరకు చేరవచ్చని అంచనా వేశారు. దిగువన 30200 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తుందని, దీన్ని కోల్పోతే 29800 పాయింట్ల వరకు పతనం ఉండొచ్చని చెప్పారు. మిడ్‌క్యాప్‌ సూచీ 16000- 16500 పాయింట్ల రేంజ్‌లో, స్మాల్‌క్యాప్‌ సూచీ 15700- 16200 పాయింట్ల రేంజ్‌లో కదలాడవచ్చని అంచనా వేశారు. మిడ్‌టర్మ్‌కు చిన్న స్టాకులు మంచి ప్రదర్శన చూపవచ్చన్నారు. 



You may be interested

విప్రో ఏడీఆర్‌ 3.50శాతం అప్‌

Friday 19th April 2019

అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే మన దేశపు అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌) గురువారం రాత్రి మిశ్రమంగా ముగిశాయి. అత్యధికంగా విప్రో అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌) 3.50శాతం లాభపడింది. టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 2.50శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 1.50శాతం, హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ అరశాతం చొప్పున పెరిగాయి. మరోవైపు ఐసీఐసీఐ ఏడీఆర్‌ 1శాతం నష్టపోగా, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ అరశాతం క్షీణించింది. డోజోన్స్‌ జూమ్‌... మెరుగైన ఆర్థిక గణాంకాల ప్రకటనతో పాటు కంపెనీల మొదటి త్రైమాసిక ఫలితాలు ఆశించిన

అప్పులున్న కంపెనీలకు ‘జెట్‌’ భయాలు

Friday 19th April 2019

భారీగా పతనమైతున్న షేర్ల ధరలు భారీగా రుణభారమున్న కంపెనీలకు జెట్‌ సెగలు తగులుతున్నాయి. రుణాలు తీర్చలేక కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు గురువారం భారీగా పతనమైన సంగతి తెలిసిందే. ఈ సెగలు అప్పులు ఎక్కువున్న ఇతర కంపెనీలకు కూడా తాకాయి. దీంతో సదరు కంపెనీల షేర్లు సైతం క్రాష్‌ అయ్యాయి. ముఖ్యంగా అనీల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన కంపెనీలపై జెట్‌ ప్రభావం ఎక్కువగా కనిపించింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీలో

Most from this category