STOCKS

News


2019 చివరికల్లా 14,000 పాయింట్లకు నిఫ్టీ..!

Friday 30th November 2018
Markets_main1543554729.png-22509

ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెట్స్‌ అండ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌) సంజీవ్‌ భాసిన్‌ అంచనా.

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కంపెనీలు ప్రకటించనున్న కార్పొరేట్‌ ఫలితాలు దేశీ స్టాక్‌ మార్కెట్లను పరుగులు పెట్టించనున్నాయని సంజీవ్‌ భాసిన్‌ విశ్లేషించారు. కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ వృద్ధి 18 శాతం ఉండనుందని అంచనావేసిన ఈయన.. వచ్చే ఏడాదిలో నిఫ్టీ 10,000 నుంచి 12,000 పాయింట్ల మధ్యకు చేరుకుంటుందన్నారు. దీపావళి సమయానికి 14,000 పాయింట్లను తాకుతుందని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్నికలు పూర్తికావడం, ఎర్నింగ్స్‌ పెరగడం లాంటి సానుకూల అంశాల కారణంగా దేశీ మార్కెట్లు అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లను అవుట్‌పెర్ఫార్మ్‌ చేస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ముడివస్తువుల ధరలు తగ్గడం, స్థూల ఆర్థిక అంశాలలో రూపాయి విలువ స్థిరత్వం పొందడం, ముడిచమురు ధరలు 25-30 శాతం దిద్దుబాటుకు లోనుకావడం వంటివి మార్కెట్‌ను నడిపిస్తాయన్నారు. ఇంతేకాకుండా ప్రభుత్వ రంగ మూలధనం పెరుగుతున్న కారణంగా ప్రైవేట్‌ రంగంలో పోటీ మరింత పెరుగుతుందని విశ్లేషించారు. అనేక రంగాలు రికవరీ సాధించడం వల్ల జీడీపీ 8 శాతానికి మించి ఉండనుందన్నారు. స్వల్పకాలానికి ఫైనాన్షియల్స్‌, ఆటో, కన్జ్యూమర్‌ డిస్క్రీషనరీ అండ్‌ స్టెపుల్స్‌, పవర్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, పీఎస్‌యూ రంగాల షేర్లను చూడవచ్చన్నారు. ఏడాదికి మించి అట్టుపెట్టుకోగలిగిన షేర్లలో ఐటీసీ, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్, మారుతి, రిలయన్స్‌లను సూచించారు.

ఇక క్యూ2 ఫలితాల అనంతరం మెటల్‌, ప్రైవేట్‌ బ్యాంక్స్‌, ఎన్‌బీఎఫ్‌సీ, ఎనర్జీ, క్యాపిటల్‌ గూడ్స్‌, వినిమయ రంగాల షేర్లు అవుట్‌పెర్ఫార్మ్‌ చేయగా.. ఫార్మా, ఆటో, పీఎస్‌ఈ బ్యాంక్‌, రియల్టీ రంగాలు నిరాశపరిచాయన్నారు.You may be interested

నియంత్రణలు పెరిగిపోతున్నాయ్‌..

Friday 30th November 2018

ముంబై: వ్యాపార సంస్థలపై నియంత్రణలు పెరిగిపోతుండటంపై కార్పొరేట్ దిగ్గజాలు ఆనంద్ మహీంద్రా, ఉదయ్‌ కొటక్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నియంత్రణల వెనుక భావానికన్నా... భాషకే ప్రాధాన్యముంటోందని, నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేయడానికే ప్రాధాన్యమివ్వాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. "నిబంధనలో స్పష్టత లేనప్పుడు భావాన్ని అనుసరించి ముందుకెడదామనుకుంటే.. వెంటనే లాగిపెట్టి ఒకటి కొడుతున్నారు. ఈ నిబంధనను తు.చ. తప్పకుండా పాటించావా లేదా అని ప్రశ్నిస్తున్నారు. నిబంధనల వెనుక భావాన్ని

ఎకానమీ వృద్ధికి మరిన్ని చర్యలు అవసరం

Friday 30th November 2018

బెంగళూరు: ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బయోఫార్మా సంస్థ బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా అభిప్రాయపడ్డారు. ప్రస్తుత, గత ప్రభుత్వాలు కొన్ని మంచి చర్యలు తీసుకున్నాయని, కానీ ఎకానమీని మెరుగు పరిచేందుకు అవసరమైన స్థాయిలో ప్రయత్నాలు జరగలేదని ఆమె పేర్కొన్నారు. బెంగళూరు టెక్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వస్తు, సేవల

Most from this category