STOCKS

News


స్వల్పకాలానికి షేర్‌ఖాన్‌ సిఫార్సులు

Tuesday 31st July 2018
Markets_main1533032689.png-18815

షార్ట్‌టర్మ్‌లో 18 శాతం వరకు రాబడినిచ్చే మూడు స్టాకులను షేర్‌ఖాన్‌ రికమండ్‌ చేస్తోంది.
1. వేదాంత: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 250. స్టాప్‌లాస్‌ రూ. 215. కొన్ని వారాలు తీరైన కరెక‌్షన్‌ చూసింది. తాజాగా వీక్లీ చార్టుల్లో డౌన్‌ సైడ్‌ కదలికలు ముగిసిన సంకేతాలు ఇస్తోంది. ప్రస్తుతం పుల్‌బ్యాక్‌ మూడ్‌లోకి ఎంటరయింది. ఇండికేటర్లు కూడా బుల్లిష్‌గా మారాయి.
2. ఐడీఎఫ్‌సీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 57. స్టాప్‌లాస్‌ రూ. 45.50. చాలా వారాలుగా చతురస్రాకార ధోరణిని ఏర్పరిచి గత వారం అప్‌సైడ్‌ బ్రేకవుట్‌ సాధించింది. వీక్లీ చార్టుల్లో పెద్ద బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. త్వరలో బోలింగర్‌ బ్యాండ్‌ పై అవధిని తాకే అవకాశం ఉంది.
3. అమర్‌రాజా బ్యాటరీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 870. స్టాప్‌లాస్‌ రూ. 778. జూన్‌ కనిష్ఠాల నుంచి అప్‌మూవ్‌ చూపింది. డైలీ చార్టుల్లో పాజిటివ్‌నెస్‌ కనబరుస్తోంది. ఇండికేటర్లు ర్యాలీకి అనుకూలంగా ఉన్నాయి. 
నిఫ్టీపై అంచనా...
ప్రస్తు నిఫ్టీ జోరు ఇకముందు కూడా కొనసాగుతుందని క్రమంగా 11450 వరకు ఎగబాకుతుందని షేర్‌ఖాన్‌ పేర్కొంది. గతవారం సూచీలు రికవరీ చూపాయి. చార్టుల్లో పెద్ద బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచాయి. నిఫ్టీ 11185- 11210పాయింట్ల కిందకు వచ్చే వరకు పాజిటివ్‌గా ఉన్నట్లే భావించవచ్చని తెలిపింది. దీనికన్నా దిగువన 10925 పాయింట్ల వద్ద కీలక మద్దతు కనిపిస్తోంది. ఆల్‌టైమ్‌ హైకి చేరే వేళ గ్యాప్‌ అప్‌ వచ్చినందున ఆ గ్యాప్‌ను ఫిల్‌ చేసేందుకు ఒకమారు యత్నించే అవకాశాలు కూడా ఉన్నాయని మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి టెక్నికల్‌గా నిఫ్టీ పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించిందని షేర్‌ఖాన్‌ పేర్కొంది.
ఆప్షన్‌డేటా
నిఫ్టీ ఆప్షన్స్‌ గణాంకాలు పరిశీలిస్తే 11000, 11200 పాయింట్ల వద్ద పుట్స్‌ భారీగా పోగుపడ్డాయి. పైస్థాయిలో 11500, 11400 పాయింట్ల వద్ద కాల్స్‌ ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి ట్రేడింగ్‌ రేంజ్‌ ఈ సీరిస్‌కు 11100- 11500 పాయింట్లుగా ఉండే అవకాశాలున్నాయి. ఒకవేళ నిఫ్టీ 1120 పాయింట్లను సైతం కోల్పోతే బుల్స్‌ పట్టు కోల్పోయినట్లు భావించవచ్చు. ఇదే జరిగితే నిఫ్టీ 10880- 10930 పాయింట్ల వరకు దిగజారవచ్చు. You may be interested

రేట్లు పెంచితే పెద్ద తప్పు చేసినట్లే!

Tuesday 31st July 2018

వడ్డీరేట్లపై మార్క్‌మొబియస్‌ అభిప్రాయం ఈ వారం జరిగే పరపతి సమీక్షా సమావేశంలో రేట్లు పెంచడం జరిగితే ఆది ఆర్‌బీఐ చేసే ‘అతిపెద్ద తప్పు’ అవుతుందని ప్రముఖ ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ అభివర్ణించారు. ఒకపక్క ఎక్కువ మంది అనలిస్టులు ఆర్‌బీఐ ఈ దఫా రేట్లు పెంచుతుందని అంచనాలు వేస్తున్నారు. కానీ మొబియస్‌ మాత్రం భిన్నంగా స్పందించారు. బ్లూమ్‌బర్గ్‌ సర్వేలో దాదాపు అందరు ఎకనమిస్టులు ఈ దఫా ఆర్‌బీఐ పావు శాతం మేర రేట్లు

ముగింపులో మరో కొత్త హై ..!

Tuesday 31st July 2018

వరసగా 4వరోజూ రికార్డు ముగింపు రాణించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ముంబై:- అంతర్జాతీయ మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నప్పటికీ, భారత్‌ మార్కెట్‌ మంగళవారం మరో రికార్డు ముగింపు సాధించింది. ఐటీ, ఇంధన, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు అండతో సూచీలు వరుసగా నాలుగో రోజూ సరికొత్త రికార్డు వద్ద ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 112 పాయింట్ల లాభంతో 37,606.58 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 11,356 వద్ద ముగిశాయి. ఆరంభంలో నష్టాల్లో బాట పట్టిన

Most from this category