10,956 దాటితే.. 11,150కి నిఫ్టీ
By Sakshi

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత నిఫ్టీ జోరు చూపిస్తోందని యస్ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ ఆదిత్య అగర్వాల్ తెలిపారు. ఫలితాల రోజు నాటి 10,333 కనిష్ట స్థాయి నుంచి 10,950 స్థాయి పైకి ఎగసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండెక్స్ తన 100 రోజుల సింపుల్ మూవింగ్ యావరేజ్ 10,956కు పైన ట్రేడ్ అవుతోందని తెలిపారు. నిఫ్టీ ఈ స్థాయికి పైన స్థిరంగా కొనసాగితే అప్పుడు 11,100- 11,150 శ్రేణిలోకి చేరొచ్చని పేర్కొన్నారు. అలాగే ఇండెక్స్ 10,755 దిగువున ట్రేడ్ అయితే.. ప్రాఫిట్ బుకింగ్ కారణంగా 10,560- 10,460 శ్రేణికి పడిపోవచ్చని తెలిపారు. అలాగే ఆర్ఎస్ఐ కూడా నిరోధ శ్రేణి 60- 65కి చేరువవుతోందన్నారు. దీన్ని దాటలేకపోతే ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందని తెలిపారు. ఆయన భవిష్యత్‌లో మంచి రాబడులను అందించగల మూడు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం.. మైండ్‌ట్రీ: డైలీ చార్ట్‌లో ఈ స్టాక్.. చానల్ సపోర్ట్ లైన్ (రూ.856) నుంచి కిందకు పడిపోయింది. ఇది కొత్త డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తోంది. రూ.840 దిగువున స్థిరమైన ట్రేడింగ్ ఉంటే అప్పుడు స్టాక్ ధర రూ.800- 750 స్థాయికి పడిపోవచ్చు. వీక్లి చార్ట్‌లో ఈ స్టాక్ 50 రోజలు మూవింగ్ యావరేజ్‌ను (రూ.908) అధిగమించలేకపోయింది. ఇది అప్‌ట్రెండ్ బలహీనంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తోంది. అలాగే ఆర్ఎస్ఐ కూడా క్షీణిస్తోంది. రానున్న రోజుల్లో స్టాక్ ధర తగ్గొచ్చు. ఈ స్టాక్‌ను రూ.849- 845 శ్రేణిలో విక్రయించొచ్చు. టార్గెట్ ప్రైస్ రూ.800-750. స్టాప్ లాస్ రూ.880. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్: వీక్లి చార్ట్‌లో ఈ స్టాక్.. ట్రైయాంగిల్ ప్యాట్రన్ నుంచి బ్రేక్ఔట్ అయ్యింది. ఇది బుల్ ట్రెండ్‌ను సూచిస్తోంది. రూ.205కి పైన స్థిరమైన ట్రేడింగ్ జరిగితే అప్పుడు స్టాక్ ధర రూ.225- 240 స్థాయికి పెరగొచ్చు. డైలీ చార్ట్‌లో ఈ స్టాక్ ఫ్లాగ్ ప్యాట్రన్ నుంచి బ్రేక్‌ఔట్‌కు సిద్ధంగా ఉంది. ఇది బుల్లిష్ ట్రెండ్‌ను సూచిస్తోంది. ఆర్ఎస్ఐ పైకి కదులుతోంది. 40 స్థాయి వల్ల మద్దతు తీసుకుంది. రానున్న రోజుల్లో స్టాక్ ధరలో పెరుగుదల ఉంటుంది. రూ.200- 204 శ్రేణిలో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. రూ.225- 240 టార్గెట్ ప్రైస్. స్టాప్ లాస్ రూ.185. రామ్‌కో సిమెంట్స్: వీక్లి చార్ట్‌లో రామ్‌కో సిమెంట్స్.. బుల్లిష్ వెడ్జ్ ప్యాట్రన్ నుంచి బ్రేక్ఔట్ అయ్యింది. ఇది మళ్లీ అప్‌ట్రెండ్‌ను సూచిస్తోంది. ఈ స్టాక్‌ను రూ.640- 645 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. టార్గెట్ ప్రైస్ రూ.695- 725. స్టాప్ లాస్ రూ.600.
You may be interested
బ్యాంక్ నిఫ్టీ జంప్
Wednesday 19th December 2018ద్రవ్యత్వ సంక్షోభం నుంచి గట్టేందుకు ఆర్బీఐ చేసిన బాండ్ల బైబ్యాక్ ఇష్యూ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌కు కలిసొస్తుంది. ఫలితంగా బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ బుధవారం ట్రేడింగ్‌లో 1శాతం ర్యాలీ చేసింది. వచ్చే నెలలో బాండ్ల బైబ్యాక్ ద్వారా రూ.50వేల కోట్ల నిధులను ఆర్థిక వ్యవస్థలోకి విడుదల చేస్తామని మంగళవారం ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 27,229.05ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ప్రభుత్వరంగ బ్యాంక్
రియల్టీ షేర్ల ర్యాలీ
Wednesday 19th December 2018ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్, డీఎల్ఎఫ్ షేర్ల ర్యాలీ అండతో బుధవారం రియల్లీ రంగ షేర్లు లాభాల బాట పట్టాయి. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలకు చెందిన సూచీలోకెల్లా రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ 2.50శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.2:50ని.లకు ఇండెక్స్ గత ముగింపు(237.15)తో పోలిస్తే 2.50శాతం లాభంతో 243ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్ షేర్లు 8.50శాతం లాభపడగా డీఎల్ఎఫ్ 7శాతం లాభపడింది. సన్‌టెక్