STOCKS

News


11600 పాయింట్ల వద్ద కన్సాలిడేషన్‌!

Thursday 21st March 2019
Markets_main1553150307.png-24723

నిఫ్టీ గతేడాది నవంబర్‌ తర్వాత వీక్లీ చార్టుల్లో బలమైన బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. ఈ వారం 11556 పాయింట్ల వరకు చేరింది. ఇదే ధోరణి మరింత కొనసాగవచ్చని నిపుణుల అంచనా. చార్టుల్లో హయ్యర్‌ లో ఫార్మేషన్‌ జరిగినంతవరకు ఇదే జోరు ఉంటుంది. నాలుగువారాల్లో నిఫ్టీ దాదాపు వెయ్యి పాయింట్లు పైకి ఎగిసింది. ప్రస్తుతం స్టోకాస్టిక్‌ ఇండికేటర్‌ ఓవర్‌బాట్‌లో ఉంది. అందువల్ల కొంత మేర వెనుకంజ ఉండొచ్చని అంచనా. ఈ వెనుకంజలో భాగంగా నిఫ్టీ 11400- 11600 పాయింట్ల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చు. స్టాక్స్ అన్నీ ర్యాలీ మూడ్‌లో ఉన్నందున 11400 పాయింట్లకు వచ్చిన సందర్భాన్ని కొనుగోళ్లకు అవకాశంగా పరిగణించాలి. నిఫ్టీ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో వేగవంతమైన బుల్లిష్‌మార్పు కనిపిస్తోంది. ఆరు సెషన్ల పాటు ర్యాలీ మూడ్‌లో ఉన్న సూచీలు చిన్నపాటి కన్సాలిడేషన్‌ అనంతరం తిరిగి పరుగులు మొదలెడతాయి. అందువల్ల రాబోయే అప్‌మూవ్‌ను అందుకునేందుకు చిన్నపాటి కరెక‌్షన్స్‌ను, కన్సాలిడేషన్లను పోర్టుఫోలియో నిర్మాణానికి వినియోగించాలి. సూచీలు ప్రతి పతనానంతరం 14 నెలలకు రీబౌండ్‌ అవుతున్నాయి. ఇదే ధోరణిని ఈ సారికూడా కొనసాగించే పరిస్థితులే కనిపిస్తున్నాయి. 
పైవన్నీ నిపుణుల అంచనాలు. పెట్టుబడులకు సొంత అధ్యయనం తప్పనిసరి.

 



You may be interested

3వారాల గరిష్టానికి పసిడి

Thursday 21st March 2019

ఈ ఏడాది వడ్డీరేట్ల పెంపు ఉండదనే ఫెడ్‌ రిజర్వ్‌ సంకేతాలతో గురువారం పసిడి ధర పరుగులు పెడుతోంది. ఆసియాలో ఏకంగా ఔన్స్‌ పసిడి ధర ఏకంగా 17డాలర్లు ర్యాలీ చేసి 3వారాల గరిష్టాన్ని తాకింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లపై యధాతధ పాలసీ విధానానికే కట్టబడి ఉన్నట్లు బుధవారం ప్రకటించింది. అలాగే ఈ ఏడాది(2019)లో కూడా వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చనే సంకేతాలనిచ్చింది. ఫెడ్‌ రిజర్వ్‌ అంతర్జాతీయ ఆర్థికవృద్ధి

ఈ ఏడాది ఇక రేట్ల పెంపు వుండదు-ఫెడ్‌ సంకేతాలు

Thursday 21st March 2019

వాషింగ్టన్‌:- అందరి అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఫెడ్‌ వడ్డీ రేట్లు  2.25  శాతం నుంచి 2.5 శాతంగా కొనసాగనున్నాయి. రెండు రోజుల సమావేశాల అనంతరం బుధవారం రాత్రి ఫెడరల్‌ రిజర్వు ద్రవ్య పరపతి నిర్ణయాలను ప్రకటించింది. అలాగే ఈ ఏడాది వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చని సంకేతాలతో పాటు అమెరికా వృద్ధి అంచనా, ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించింది. మరోవైపు

Most from this category