STOCKS

News


రికార్డ్‌ల ర్యాలీకి బ్రేక్‌

Friday 24th August 2018
Markets_main1535106928.png-19607

  • నాలుగు రోజుల రికార్డ్‌ల ర్యాలీకి విరామం

మార్కెట్‌ రికార్డు ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌ పడింది. చైనా-అమెరికా దేశాల మధ్య జరుగుతున్న ట్రేడ్‌వార్‌ చర్చల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ప్రపంచమార్కెట్లు పతనం కావడం... సూచీల గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం... డాలర్‌ మారకంలో రూపాయి వరుసగా రెండో రోజూ 70 స్థాయిపై చేరుకోవడం... ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగంపై ఇన్వెస్టర్ల ఎదురుచూపులు తదితర కారణాలతో బ్యాంకింగ్‌, ఎంఫ్‌సీజీ, అటో రంగ షేర్లు క్షీణించాయి. ఫలితంగా స్టాక్‌ సూచీలు నష్టపోయాయి. ఈ ప్రతికూలాంశాలతో 4 రోజుల రికార్డ్‌ల ర్యాలీకి బ్రేక్‌ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 85 పాయింట్ల నష్టపోయి 38252 వద్ద ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26 పాయింట్ల నష్టపోయి 11557.10 వద్ద ముగిశాయి. ఇంట్రాడే నిఫ్టీ 11,550 కీలకస్థాయిని విశేషం. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ సూచి అత్యధికంగా 2శాతం లాభపడింది. ఇక అన్ని ప్రధాన రంగాలకు చెందిన సూచీలన్నీ నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా ప్రభుత్వ రంగ బ్యాంకు షేరు 1శాతం వరకూ నష్టపోయింది. కీలకమైన బ్యాంకు నిఫ్టీ 193.20 పాయింట్లు నష్టపోయి 27,834 వద్ద ముగిసింది.
ఐసీఐసీఐ బ్యాంకు, హీరోమోటోకార్ప్‌, అదానీ​పోర్ట్స్‌, టైటాన్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 2నుంచి 4శాతం నష్టపోగా, జీ లిమిటెడ్‌, యాక్సిస్‌ బ్యాంకు, గ్రాసీం, ఓఎన్జీసీ, వేదాంత లిమిటెడ్‌ షేర్లు 1నుంచి 4శాతం లాభపడ్డాయి.



You may be interested

పావెల్‌ ప్రసంగంలో రేట్ల పెంపు సంకేతాలు

Friday 24th August 2018

సెప్టెంబర్‌ నెలలో జరిగే ఫెడ్‌ కమిటీ సమీక్షా సమావేశంలో మరోదఫా రేట్ల పెంపు వుంటుందా, లేదా....ఈ సంకేతాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు జాక్సన్‌హోల్‌వైపు చూస్తున్నారు.  శుక్రవారం జాక్సన్‌ హోల్‌లో జరుగుతున్న ధనిక దేశాల కేంద్ర బ్యాంకుల పాలసీ నిర్ణేతల వార్షిక సమావేశంలో ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చేయబోయే ప్రసంగంలో ఈ సంకేతాలు వెలువడతాయని మార్కెట్లు భావిస్తున్నాయి. అయితే ఈ సమావేశానికి యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ చైర్మన్లు డుమ్మా కొట్టారు.

ఇండియా బాండ్లతో హెడ్జింగ్‌

Friday 24th August 2018

చైనా మందగమనం తట్టుకొనేందుకు జేపీ మోర్గాన్‌ సూచన వర్ధమాన మార్కెట్ల బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసేవాళ్లు చైనా మందగమన ప్రభావాన్ని తట్టుకునేందుకు భారత ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ డాలర్‌ బాండ్స్‌ను ఆశ్రయించాలని జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ సూచించింది. వర్ధమాన మార్కెట్‌ ఇన్వెస్టర్లకు ఇండియా ఐజీ బాండ్లు చైనా హెడ్జింగ్‌లాగా ఉపయోగపడతాయని తెలిపింది. చైనాలో మందగమన భయాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కమోడిటీలు నేల చూపులు చూస్తున్నాయి. ఈ పరిణామాలు వర్ధమాన మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. అయితే

Most from this category