STOCKS

News


నిఫ్టీలో షార్ప్‌ రికవరీకి ఛాన్స్‌!

Wednesday 26th September 2018
Markets_main1537957573.png-20605

నిఫ్టీ ఈ నెలలో ఇప్పటి దాకా 5 శాతానికిపైగా కరెక‌్షన్‌కు గురైంది. ప్రస్తుతం ఇది బ్రాడెనింగ్‌ వెడ్జ్‌ ప్యాట్రన్‌ సపోర్ట్‌ లైన్‌కు దగ్గరిలో ట్రేడ్‌ అవుతోంది. ఇది 10,880-10,855 జోన్‌ వద్ద ఉందని యస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ ఆదిత్య అగర్వాల్‌ తెలిపారు. ఈ మద్దతు స్థాయికి పైన స్థిరపడితే.. 11,205-11,410 వరకు షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీ జరగొచ్చని పేర్కొన్నారు. అదేసమయంలో ఈ జోన్‌ దిగువకు పడిపోతే.. అంటే 10,855 కిందకు వస్తే.. అప్పుడు ఇండెక్స్‌ 10,640-10,550 స్థాయికి పతనమౌతుందని తెలిపారు. అలాగే టెక్నికల్‌ ఇండికేటర్‌ ఆర్‌ఎస్‌ఐ కూడా ఓవర్‌సోల్డ్‌ సపోర్ట్‌ జోన్‌ 30 వద్దకు వచ్చిందని పేర్కొన్నారు. 2016 డిసెంబర్‌ నుంచి వచ్చి ప్రతి కరెక‌్షన్‌లోనూ, ఆర్‌ఎస్‌ఐ 30 జోన్‌కు వచ్చినప్పుడు ఇండెక్స్‌ పెరుగుతూ వచ్చిందన్నారు. ఇప్పుడు కూడా ఇండెక్స్‌ బాటమ్‌కు వచ్చిందని, రానున్న ట్రేడింగ్‌ సెషన్లలో షార్ప్‌ రికవరీ ఉండొచ్చని అంచనా వేశారు. ఇక వచ్చే 3-4 వారాల కాలానికి ఇంద్రప్రస్థ గ్యాస్‌, మదర్‌సన్‌ సుమీ సిస్టమ్స్‌, ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. ఎందుకో చూద్దాం.. 

ఇంద్రప్రస్థ గ్యాస్‌
వీక్లి చార్ట్‌లో ఈ స్టాక్‌ రూ.230 లోయర్‌ ఎండ్‌ వద్ద సపోర్ట్‌ తీసుకొని అప్‌సైడ్‌ టర్న్‌ తీసుకుంది. రూ.268కి పైన ట్రేడ్‌ అయితే అప్పుడు స్టాక్‌ ట్రెండ్‌లైన్‌ రెసిస్టెన్స్‌ నుంచి బ్రేక్‌ఔట్‌ అయ్యి రూ.290-310 స్థాయికి వెళ్లొచ్చు. డైలీ చార్ట్‌లో కప్‌అండ్‌ హ్యాండిల్‌ ప్యాట్రన్‌ నెక్‌లైన్‌ నుంచి బ్రేక్‌ఔట్‌కు సిద్ధంగా ఉంది. ఇది బుల్లిష్‌నెస్‌ను సూచిస్తోంది. అలాగే ఆర్‌ఎస్‌ఐ కూడా అప్‌ట్రెండ్‌ను సూచిస్తోంది. రూ.248 స్టాప్‌లాస్‌తో రూ.263-265 రేంజ్‌లో రూ.290-310 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. 

మదర్‌సన్‌ సుమీ సిస్టమ్స్‌
వీక్లి చార్ట్‌లో ఈ స్టాక్‌ బుల్లిష్‌ వెడ్జ్‌ ప్యాట్రన్‌ లోయర్‌ ఎండ్‌ రూ.250 వద్ద సపోర్ట్‌ తీసుకుంది. గత పతనంలో కరెక్టివ్‌ వేవ్‌ ఏ,బీ,సీని పూర్తి చేసింది. ఇది ప్రస్తుత స్థాయి నుంచి అప్‌ట్రెండ్‌ను సూచిస్తోంది. డైలీ చార్ట్‌లో స్టాక్‌ అప్‌సైడ్‌ కదులుతోంది. ఆర్‌ఎస్‌ఐ కూడా అప్‌ట్రెండ్‌ను సూచిస్తోంది. రానున్న రోజుల్లో బుల్లిష్‌నెస్‌ ఉండొచ్చు. రూ.246 స్టాప్‌లాస్‌తో రూ.263-265 రేంజ్‌లో రూ.295-325 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌
డైలీ చార్ట్‌లో ఈ స్టాక్‌ రూ.780 వద్ద ఉన్న చానెల్‌ ప్యాట్రన్‌ నెక్‌లైన్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇదే జరిగితే అప్‌సైడ్‌ ఉంటుంది. రూ.725 స్టాప్‌లాస్‌తో రూ.763-766 రేంజ్‌లో రూ.815-850 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

 
 



You may be interested

లాభాలు ఒక్కరోజుకే పరిమితం.

Wednesday 26th September 2018

మళ్లీ నష్టాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు ఆరంభ లాభాలను నిలుపుకోవడంలో విఫలవడంతో మార్కెట్‌ లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. ఈ నెల డెరివేటివ్‌ కాంట్రాక్టులు రేపటితో ముగియనుండటం, అమెరికాలో నిన్న, నేడు ఫెడ్‌రిజర్వ్‌ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశాల నేఫథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా ప్రభుత్వరంగబ్యాంకు, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, అటో రంగ షేర్లలో అమ్మకాల కారణంగా బుధవారం మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 109 పాయింట్లు నష్టపోయి 36,542 వద్ద,

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ విలువెంత?

Wednesday 26th September 2018

మార్కెట్లో కుదుపులు సృష్టించిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. ఇదే బాటలో మరిన్ని ఎన్‌బీఎఫ్‌సీలు డిఫాల్ట్‌ అయ్యే ప్రమాదాలున్నాయన్న భయాలు మార్కెట​‍్లను కుంగదీస్తున్నాయి. ఈ పరిస్థితికి కారణమైన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ తాజాగా నిధులు సమీకరించి రుణాలు తీర్చాలని భావిస్తోంది. ఇందుకోసం షేర్‌హోల్డర్ల అనుమతిని ఆశిస్తోంది. తాజాగా 4,500 కోట్ల రూపాయలు సమీకరించేందుకు సరిపడ షేర్లు విక్రయానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీలో అతిపెద్ద వాటాదారులైన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐల

Most from this category