News


10,520-10,690 రేంజ్‌లో నిఫ్టీ!!

Friday 16th November 2018
Markets_main1542352814.png-22095

ద్రవ్యల్బోణం తగ్గుదల, మార్కెట్‌లో లిక్విడిటీ పెంచేందుకు రూ.12,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను ఆర్‌బీఐ కొనుగోలు చేయడం, క్రూడ్‌ ధరలు భారీగా పతనం కావడం వంటి అంశాల వల్ల సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారిందని 5నాన్స్‌.కామ్‌ ఫౌండర్‌, సీఈవో దినేష్‌ రోహిరా తెలిపారు. ఈ వారాన్ని గమనిస్తే నిఫ్టీ ఇంట్రాడేలో 10,616 స్థాయిని బ్రేక్‌ఔట్‌ చేసిందని, 10,651 స్థాయిని తాకిందని, అయితే ఇండెక్స్‌ మళ్లీ ఆస్థాయిలో నిలదొక్కుకోలేకపోయిందని పేర్కొన్నారు. వారంలో 10,440 పాయింట్ల కనిష్ట స్థాయికి కూడా పడిపోయిందన్నారు. గురువారం 10,616 స్థాయి వద్ద ముగిసిందని, వారంగా చూస్తే 0.29 శాతం లాభపడిందని తెలిపారు. నిఫ్టీ బ్యాంక్‌, వినియోగ విభాగాలు ఈ లాభాలకు కారణమని, వారంగా ఇవి వరుసగా 1.51 శాతం, 1.15 శాతం పెరిగాయని పేర్కొన్నారు. అయితే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా రంగాలు వరుసగా 3.01 శాతం, 2.51 శాతం క్షీణించాయని తెలిపారు. 
వీక్లి ప్రైస్‌ చార్ట్‌లో నిఫ్టీ ఇండెక్స్‌.. హ్యాంగింగ్‌ మ్యాన్‌ రకపు క్యాండిల్‌స్టిక్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచిందని దినేష్‌ రోహిరా తెలిపారు. ఇది మార్కెట్‌ గమనం లోపించిందనే విషయాన్ని తెలియజేస్తోందన్నారు. వీక్లి ఆర్‌ఎస్‌ఐ 46 స్థాయిలో ఉందని, ఎంఏసీడీ కూడా సిగ్నల్‌ లైన్‌కు దిగువునే ట్రేడవుతోందని పేర్కొన్నారు. ఇండెక్స్‌కు 10,650-10,712 శ్రేణిలో బలమైన నిరోధం ఉందన్నారు. 10,440 వద్ద బలమైన మద్దతు లభిస్తోందని తెలిపారు. మార్కెట్‌ గమనం లోపించడం వల్ల నిప్టీ రేంజ్‌బౌండ్‌లో కదలాడవచ్చని పేర్కొన్నారు. స్టాక్‌ ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇండెక్స్‌ 10,520- 10,690 శ్రేణిలో కదలాడవచ్చని అంచనా వేశారు.  

దినేష్‌ రోహిరా సమీప కాలంలో ఆకర్షణీయమైన రిటర్న్స్‌ను అందించే మూడు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం..

వీఐపీ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు
గత నెల కాలంగా అటూ ఇటూ కదలాడుతూ వచ్చిన వీఐపీ ఇండస్ట్రీస్‌ స్టాక్‌లో ఇటీవల బలమైన అప్‌ట్రెండ్‌ కనిపించింది. 100 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ను అధిగమించింది. ఇది రూ.457 స్థాయి వద్ద ఉంది. షేరు 52 వారాల గరిష్ట స్థాయి నుంచి గత మూడు నెలల కాలంలో 42 శాతంమేర పడిపోయింది. అయితే రూ.370 వద్ద బలమైన మద్దతు తీసుకుంది. చార్ట్స్‌లో బుల్లిష్‌ ప్యాట్రన్‌ ఏర్పరచింది. ఆర్‌ఎస్‌ఐ 57 స్థాయిలో ఉంది. ఎంఏసీడీ రానున్న సెషన్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌ను ఏర్పరచవచ్చు. రూ.450 స్టాప్‌లాస్‌తో రూ.492 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

పెడిలైట్‌ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు
రూ.900కు పడిపోయిన తర్వాత స్టాక్‌ గత నెల కాలంగా పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతూ వస్తూ 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ను అధిగమించింది. ఇది రూ.1,030 వద్ద ఉంది. వీక్లి ప్రైస్‌ చార్ట్‌లో బుల్లిష్‌ క్యాండిల్‌స్టిక్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. ఆర్‌ఎస్‌ఐ 65 స్థాయిలో ఉంది. ఎంఏసీడీ.. సిగ్నల్‌ లైన్‌కు పైన ట్రేడవుతోంది. రూ.1,030 స్టాప్‌లాస్‌తో రూ.1,150 టార్గెట్‌ ప్రైస్‌తో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. 

మదర్‌సన్‌ సుమి సిస్టమ్స్‌: విక్రయించొచ్చు
మదర్‌సన్‌ సుమిపై తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొంది. 52 వారాల కనిష్ట స్థాయికి సమీపంలో ట్రేడవుతోంది. వారంగా చూస్తే రూ.170 స్థాయి నుంచి రూ147 స్థాయికి పడిపోయింది. గత నెల కాలంలో చూస్తే రూ.242 స్థాయి వద్ద ఉన్న 200 మూవింగ్‌ యావరేజ్‌ స్థాయిని కోల్పోయింది. డైలీ, వీక్లి చార్ట్స్‌లో బేరిష్‌ క్యాండిల్‌స్టిక్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. రూ.137 వద్ద బలమైన మద్దతు ఉంది. ఆర్‌ఎస్‌ఐ 28 స్థాయిలో ఉంది. ఎంఏసీడీ.. సిగ్నల్‌లైన్‌కు దిగువున ట్రేడ్‌ అవుతోంది. అందువల్ల ఈ స్టాక్‌ను విక్రయించవచ్చు. 


 You may be interested

ఏవియేషన్‌ షేర్లు ట్రేడర్లకే .. ఇన్వెస్టర్లకు కాదు..

Friday 16th November 2018

ఏవియేషన్‌ రంగాన్ని కఠినమైనదిగా భావించొచ్చు. ఇందులో కంపెనీలకు ప్రైసింగ్‌ పవర్‌ ఉండదు. భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అలాగే ఆయిల్‌ ధరలతో ఎల్లప్పుడూ రిస్క్‌ పొంచి ఉంటుంది. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏస్‌ప్రో అడ్వైజర్స్‌ సీఐవో కుంజ్‌ బన్సాల్‌ ఈ విషయాలను వెల్లడించారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ స్టాక్‌ ర్యాలీ విషయానికి వస్తే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉందని తెలిపారు. ఇటీవల కాలంలో

నెలన్నర గరిష్టానికి ఎయిర్‌టెల్‌

Friday 16th November 2018

ప్రముఖ టెలికాం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ షేరు శుక్రవారం నెలన్నర గరిష్టాన్ని తాకింది.  నేడు భారతీ ఎయిర్‌టెల్‌ షేరు బీఎస్‌ఈలో రూ.303.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తెలియని కారణాలతో షేరు 8శాతం లాభపడి రూ.328.80ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర షేరు నెలన్నర గరిష్టస్థాయి. అక్టోబర్‌ 01వ తేది తరువాత ఇంత స్థాయిలో ధరను తాకడం ఇదే తొలిసారి. మధ్యాహ్నం గం.12:25ని.లకు షేరు గత ముగింపు

Most from this category