STOCKS

News


ఈ సీరిస్‌లో 11300 వరకు పతనం!

Monday 25th March 2019
Markets_main1553495974.png-24779

నిఫ్టీ మార్చి సీరిస్‌లో 11300- 11350 పాయింట్ల వరకు పతనమవుతుందని సామ్‌కో సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ ఉమేశ్‌ మెహతా అంచనా వేశారు. నిఫ్టీ పరుగులకు విరామం వచ్చే సమయమిదన్నారు. ఇప్పటివరకు సూచీల్లో కనిపించిన ఉత్సాహం సన్నగిల్లిందన్నారు. అందువల్ల నిఫ్టీ ఈ సీరిస్‌ చివరకు 11300-11350 పాయింట్ల వరకు క్షీణించే అవకాశాలున్నాయన్నారు. ప్రధాన ఇండికేటర్లన్నీ ఓవర్‌బాట్‌ స్థితిని సూచిస్తున్నాయని, అందువల్ల గరిష్ఠాల నుంచి పుల్‌బ్యాక్‌ తప్పకపోవచ్చని చెప్పారు. బ్యాంకు నిఫ్టీ సైతం వెనుకంజ వేయవచ్చని, ఈ సీరిస్‌లో 28400- 28779 పాయింట్ల వరకు దిగిరావచ్చని అబిప్రాయపడ్డారు. ఎన్‌బీఎఫ్‌సీ షేర్ల నుంచి ప్రైవేట్‌ బ్యాంకు షేర్ల వైపు మదుపరుల మొగ్గు మారుతోందన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం అన్ని స్టాకులు ఓవర్‌బాట్‌లో ఉన్నాయన్నారు. 
- నిఫ్టీకి 11310- 11370 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉందని, ఎగువన 11550 పాయింట‍్ల వద్ద నిరోధం ఉందని ఈక్విటీ 99 డాట్‌కామ్‌ వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్‌గయాన్‌ చెప్పారు. ప్రస్తుత వెనుకంజ తర్వాత తిరిగి సూచీలు పుంజుకుంటాయని, ఎన్నికల ఫలితాల వరకు బుల్లిష్‌ జోరు కొనసాగుతుందని అంచనా వేశారు. 
- నిఫ్టీ ప్రాఫిట్‌బుకింగ్‌ కారణంగా 11400, 11333 పాయింట్ల వరకు దిగిరావచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ డెరివేటివ్స్‌ అనలిస్టు చందన్‌ తపారియా చెప్పారు. ఎగువన 11550 పాయింట్ల వద్ద నిరోధం ఉందన్నారు. 
- ప్రస్తుతం ఎఫ్‌ఐఐలు నికర కొనుగోలుదారులుగా, డీఐఐలు నికర విక్రేతలుగా మారాయి. దీంతో ఎఫ్‌ఐఐలు మక్కువ చూపే లార్జ్‌క్యాప్స్‌, డీఐఐలు మక్కువ చూపే స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ ప్రదర్శన మధ్య అంతరం పెరిగిపోతోందని షేర్‌ఖాన్‌ మేనేజర్‌ రోహిత్‌ శ్రీవాస్తవ చెప్పారు. దీంతో గత ఏడు సెషన్లలో ఆరింటిలో అడ్వాన్స్‌లు కన్నా డిక్లైన్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. అందువల్ల సూచీల్లో వెనుకంజ తప్పదని అభిప్రాయపడ్డారు. You may be interested

ప్రతి పతనం ఒక అవకాశమే!

Monday 25th March 2019

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ నిఫ్టీ, సెన్సెక్స్‌ పలు రోజుల పరుగుల అనంతరం ప్రాఫిట్‌ బుకింగ్‌ చవిచూస్తున్నాయి. శుక్రవారం కనిపించిన బలహీనత మార్కెట్లో సోమవారం కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి పుల్‌బ్యాక్స్‌ను కొత్త కొనుగోళ్లకు అవకాశంగా భావించాలని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అనలిస్టు నాగరాజ్‌ షెట్టి సూచించారు. ప్రస్తుతం వచ్చిన బలహీనత ఓవర్‌బాట్‌ వల్ల వచ్చిందని, మరికొంత సమయం ఈ బలహీనత కొనసాగవచ్చని అంచనా వేశారు. అయితే ఈ బలహీనత సమయాలను కొనుగోళ్లకు అవకాశంగా

సోమవారం వార్తల్లో షేర్లు

Monday 25th March 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు జెట్‌ ఎయిర్‌వేస్‌:- ఆర్థిక సంక్షోభం కారణంగా అదనంగా మరో ఏడు విమాన సర్వీసులను రద్దు చేసింది.  ఎస్సార్‌ స్టీల్‌:- కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా శైలేంద్ర అగర్వాల్‌ నియమితులయ్యారు ఎస్‌బీఐ:- మార్కెట్‌ నుంచి రూ.20వేల కోట్ల నిధుల సమీకరణకు బోర్డు గడువు కాలాన్ని మార్చి 31 2020వ తేది వరకు పొడిగించింది. అలాగే రూ.1250 కోట్ల విలువైన బాండ్ల ఇష్యూకు రుణదాతలు ఆమోదం తెలిపింది. టాటా స్టీల్‌

Most from this category