News


10650-10700 పాయింట్ల వద్ద నిరోధం

Wednesday 17th October 2018
Markets_main1539758869.png-21238

మంగళవారం బ్యాంకు నిఫ్టీ అండతో నిఫ్టీ బలంగా క్లోజయింది. పదిరోజుల డిఎంఏ స్థాయికి పైన ముగిసింది. దీనికితోడు మంగళవారం రాత్రి యూఎస్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. దీంతో బుధవారం నిఫ్టీ గ్యాప్‌ అప్‌తో ఆరంభమైంది. కానీ వెనువెంటనే ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా నష్టాల్లోకి జారింది. నిఫ్టీకి 10650-10700 పాయింట్ల వద్ద బలమైన నిరోధం ఉందని ఎపిక్‌ రిసెర్చ్‌ తెలిపింది. ఈ స్థాయిలో‍్ల ప్రాఫిట్‌ బుకింగ్‌ వస్తుందని తెలిపింది. మదుపరులు ఈ స్థాయిల వద్ద ఆచితూచి వ్యవహరించాలని సూచించింది. అయితే టెక్నికల్‌గా నిఫ్టీ బలంగా ఉన్నందున క్రమంగా ఈ స్థాయిని స్వల్పకాలంలో అధిగమించవచ్చని అంచనా వేసింది. నిఫ్టీ 200 రోజుల డీఎంఏ వరకు ఎగిసే ఛాన్సులున్నాయని తెలిపింది. అయితే పైస్థాయిల వద్ద పట్టు నిలుపుకునేందుకు బేర్స్‌ చురుగ్గా వ్యవహరిస్తారని, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బ్లుచిప్‌ కంపెనీల షేర్లు బలంగా ఉన్నాయని అందువల్ల మార్కెట్లో మరికొంత అప్‌సైడ్‌ ఉండవచ్చని తెలిపింది.



You may be interested

200 రోజుల డీఎంఏ స్థాయికి దిగువన మెజార్టీ షేర్లు

Wednesday 17th October 2018

సూచీల్లో బలహీనతకు చిహ్నం అంటున్న నిపుణులు నిఫ్టీలో మూడింట రెండొంతుల స్టాకులు ప్రస్తుతం తమతమ 200 రోజుల డీఎంఏ స్థాయిలకు దిగువన ట్రేడవుతున్నాయి. మార్కెట్లో బేరిష్‌ ట్రెండ్‌ కొనసాగతుందనేందుకు ఇది నిదర్శనమని మోతీలాల్‌ఓస్వాల్‌ అనలిస్టు చందన్‌ తపారియా చెబుతున్నారు. మార్కెట్లు దిగువనుంచి పుల్‌బ్యాక్‌ చూపుతున్నా తిరిగి బలహీనపడే అవకాశాలే ఎక్కువన్నారు. మంగళవారానికి నిఫ్టీ వరుసగా మూడు రోజులు లాభాల్లో ముగిసింది. నిఫ్టీ50లోని కంపెనీల్లో ఎల్‌అండ్‌టీ, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, కోటక్‌బ్యాంక్‌,

మార్కెట్‌ రివర్స్‌.. నష్టాల్లో నిఫ్టీ

Wednesday 17th October 2018

అమెరికా మార్కెట్లు మంగళవారం 2 శాతానికి పైగా ర్యాలీ చేయడం, ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండటం, రూపాయి బలపడటం వంటి పలు సానుకూల అంశాల కారణంగా గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ తర్వాత ఆ లాభాలన్నింటికీ కోల్పోయింది. నిఫ్టీ ఇండెక్స్‌ నష్టాల్లోకి జారుకుంటే, సెన్సెక్స్‌ కూడా అదే దారిలో పయనిస్తోంది. ఉదయం 11:46 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్‌ 28 పాయింట్ల లాభంతో 35,190 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల

Most from this category