STOCKS

News


10400 పాయింట్లకు అటు ఇటుగా నిరోధం?!

Wednesday 10th October 2018
Markets_main1539154719.png-21012

నిఫ్టీపై గిన్నిస్‌ సెక్యూరిటీస్‌ అంచనా
దేశీయ మార్కెట్లు బుధవారం రిలీఫ్‌ ర్యాలీ చూపుతున్నాయి. మంగళవారం పాజిటివ్‌ జోరును కొనసాగించలేక సూచీలు నెగిటివ్‌గా క్లోజయ్యాయి. బుధవారం ఆరంభం నుంచే సూచీలు లాభాల్లో కొనసాగడం ఆరంభించాయి. సాంకేతికంగా చూస్తే నిఫ్టీకి 10400 పాయింట్ల వద్ద  తక్షణ నిరోధం ఎదురుకావచ్చు. ఒక వేళ ఈ స్థాయిని దాటితే 10550 పాయింట్ల వద్ద మరో గట్టి నిరోధం ఎదురుకానుంది. ఈ స్థాయిని కూడా దాటి బలంగా క్లోజయితే బేర్‌ జోరుకు తాత్కాలిక ఫుల్‌స్టాప్‌ పడినట్లు భావించవచ్చు. దిగువన నిఫ్టీకి 10200, 9950, 9300, 7900, 6800 పాయింట్ల వద్ద మద్దతు దొరుకుతుంది. ప్రస్తుతం నిఫ్టీ చార్టుల్లో ఇండికేటర్లు ఓవర్‌సోల్డ్‌ స్థితిని చూపుతున్నాయి. ఈ స్థితి సర్దుబాటు చేసుకునేందుకు సూచీలు యత్నిస్తాయి. ఆప్షన్‌ డేటా సైతం ఇదే సూచిస్తోంది. ఆప్షన్లలో 11,000, 10800 పాయింట్ల వద్ద కాల్స్‌, 10,000, 10,500 పాయింట్ల వద్ద పుట్స్‌ ఎక్కువగా పోగయ్యాయి. ఈ సీరిస్‌ మొత్తానికి నిఫ్టీ 10000- 10500 పాయింట్ల రేంజ్‌లో కదలాడే ఛాన్సులున్నాయి. 
పైవన్నీ గిన్నిస్‌సెక్యూరిటీస్‌ అంచనాలు మాత్రమే!



You may be interested

మెప్పించని గార్డెన్‌ రీచ్‌ లిస్టింగ్‌

Wednesday 10th October 2018

12శాతం డిస్కౌంట్‌తో లిస్టింగ్‌ ముంబై:- ఇటీవల ఐపీఓ ప్రక్రియను పూర్తి చేసుకున్న గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ లిస్టింగ్‌లో మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోయింది. ఇష్యూ ధర రూ.118తో పోలిస్తే బీఎస్‌ఈలో 12శాతం(రూ.16లు) డిస్కౌంట్‌తో రూ.104.00ల వద్ద లిస్టైంది. ఇష్యూలో ఐపీఓకు అంతం స్పందన రావడంతో ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపలేదు. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 19శాతం నష్టపోయి రూ.95.35ల స్థాయికి చేరుకుంది. ఉదయం గం.11:45ని.లకు షేరు బీఎస్‌ఈలో 15శాతం నష్టంతో రూ.99.85ల

మెటల్‌ షేర్ల వెలుగులు

Wednesday 10th October 2018

9శాతం లాభపడి నాల్కో షేరు మెటల్‌ షేర్లు ర్యాలీ రెండోరోజూ కొనసాగుతోంది. క్రితం ట్రేడింగ్‌లో 1.50శాతం నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 2.25శాతం లాభపడింది. ఉదయం గం.11:15నిల.కు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ గతముగింపు(3,373.75)తో పోలిస్తే 1.75శాతం పెరిగి 3,433.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి  ఈ సూచీలో భాగమైన 15 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సూచీలో అత్యధికంగా నాల్కో 9శాతం లాభపడింది. జేఎస్‌ఎల్‌ హిస్సాఆర్‌ స్టీల్‌

Most from this category