STOCKS

News


ఏడాది చివరకు 12వేలకు నిఫ్టీ!

Friday 13th July 2018
Markets_main1531475919.png-18283

జేఎం ఫైనాన్షియల్స్‌ అంచనా
చాలా రోజుల తర్వాత నిఫ్టీ మరోమారు 11వేల పాయింట్లను దాటింది. రికార్డు గరిష్ఠాలకు చేరిన తర్వాత కన్సాలిడేషన్‌ ఉంటుందని, ఆ సమయంలో మద్దతు కూడగట్టుకొని సూచీలు మరలా పరుగులు ఆరంభిస్తాయని, నిఫ్టీ ఇదే రకంగా 10500-10600 పాయింట్ల వద్ద మద్దతు కూడగట్టుకుందని జేఎం ఫైనాన్షియల్స్‌ అనలిస్టు గౌతమ్‌ షా వివరించారు. నిఫ్టీ గత జనవరి స్థాయిల నుంచి దాదాపు పది శాతం పతనమై తిరిగి 9 శాతం మేర ర్యాలీ జరిపిందన్నారు. ప్రధాన సూచీలతో పోలిస్తే భారీగా పతనమైన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌​సూచీలు క్రమంగా కోలుకుంటున్నాయని చెప్పారు. ఎఫ్‌ఐఐల అమ్మకాలు, క్రూడాయిల్‌ ధర పెరగడం, రూపాయి క్షీణత, మిడ్‌క్యాప్స్‌లో భయాలు ఇటీవల పతనానికి కారణాలని విశ్లేషించారు. ఇవన్నీ తట్టుకొని సూచీలు రికవరీ బాట పట్టాయని, క్రమంగా లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీల మధ్య అంతరం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే నిఫ్టీ పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించిందని, త్వరలో 11300- 11400 పాయింట్లను తాకుతుందని అంచనా వేశారు. సూచీల పరుగులు ఇలాగే కొనసాగి ఏడాది చివరకు నిఫ్టీ 12వేల పాయింట్లను చేరవచ్చని అంచనా వేశారు. మిడ్‌క్యాప్‌ రికవరీకి మరికొంత కాలం పట్టవచ్చన్నారు. మిడ్‌క్యాప్‌ సూచీకి 18700 పాయింట్లు కీలకమని, ఇది దాటితే రికవరీ వేగంగా ఉంటుందని తెలిపారు. ఈ సూచీకి 17800- 18000 పాయింట్ల వద్ద బాటమ్‌ అవుట్‌ అయి మద్దతు లభించిందని చెప్పారు. నిఫ్టీ 11వేల పాయింట్లకు చేరిన ఈ తరుణంలో లార్జ్‌క్యాప్స్‌ కన్నా మిడ్‌క్యాప్స్‌ను నమ్ముకోవడం బెటరని సూచించారు. 
ఇతర అంచనాలు, అభిప్రాయాలు..
- క్రూడాయిల్‌ ధర 74- 75 డాలర్ల వద్ద టాప్‌అవుట్‌ అయింది. ఇకమీదట 62-75 డాలర్ల రేంజ్‌లోనే కదలాడవచ్చు. 
- ఐటీ స్టాకుల్లో మంచి ర్యాలీలు వచ్చినందున ఇప్పుడు లాంగ్స్‌ జోలికి పోవపోవడం మంచిది. అయితే ఆకర్షణీయ వాల్యూషన్ల వద్ద ఉన్న మిడ్‌క్యాప్‌ ఐటీ షేర్లను పరిశీలించవచ్చు.
- ఇకమీదట మార్కెట్లను బ్యాంకింగ్‌ రంగం ముందుకు నడిపించవచ్చు. బ్యాంకు నిఫ్టీకి 27500 పాయింట్ల వద్ద నిరోధం ఉంది. ఇది దాటితే 30 వేల పాయింట్లకు చేరవచ్చు. 26000 పాయింట్ల వద్ద బ్యాంకు నిఫ్టీకి మద్దతు ఉంది. పీఎస్‌బీలతో పోలిస్తే ప్రైవేట్‌ బ్యాంకులను ఎంచుకోవడం మంచిది.
- రూపాయి 69-  69.5 వద్ద టాప్‌ అవుట్‌ అయింది. ఇకమీదట స్థిరత్వం వస్తుంది. డాలర్‌ ఇకపై నిర్ణీత రేంజ్‌లోనే ఉంటుంది. 


 You may be interested

మరో రెండేళ్లు ఐటీ రంగం జోరు

Friday 13th July 2018

ముంబై: ప్రస్తుతం మార్కెట్‌ చాలా ఆసక్తికర దశలో ఉన్నట్లు వ్యాఖ్యానించిన ఎడెల్వీస్‌ సెక్యూరిటీస్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ వికాస్‌ ఖేమానీ.. బ్రెడ్త్‌ పరంగా బలహీనంగా ఉన్నప్పటికీ, నూతన గరిష్టస్థాయిలను నమోదుచేసే అవకాశం కనిపిస్తుందన్నారు. మార్కెట్‌ రికార్డ్‌ ర్యాలీతో కొనసాగడానికి కేవలం 10-12 షేర్లు మాత్రమే కారణం తప్పించి ఇది పూర్తి మార్కెట్‌ ర్యాలీ కాదని వ్యాఖ్యానించారు. గడిచిన ఏడాదికాలంగా ఈ షేర్లతోనే నిఫ్టీ 800-900 పాయింట్ల వరకు లాభపడిందన్నారు. వీటిలోని పలు కంపెనీలు గతకొద్ది

పీఎస్‌యూ బ్యాంకు షేర్లు పతనం

Friday 13th July 2018

 గత వరుస ట్రేడింగ్‌ సెషన్ల నుంచీ లాభాలు ఆర్జించిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ (పీఎస్‌యూ) షేర్లు  నాటి ట్రేడింగ్‌లో భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి.  ఎన్‌ఎస్‌ఈలో ఆ రంగషేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2.65శాతం నష్టపోయింది. నేడు ఈ సూచిలోని ఒక్క ఐడీబీఐ బ్యాంకు షేరు తప్ప, మిగతా అన్ని షేర్లు నష్టాల బాట పట్టాయి. అత్యధికంగా కెనరా బ్యాంకు 4శాతం నష్టపోగా,  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాదాబాద్‌ బ్యాంకు,

Most from this category