STOCKS

News


ఏడాది చివరకు నిఫ్టీ@11400!

Wednesday 11th July 2018
Markets_main1531305999.png-18208

డాయిష్‌ బ్యాంక్‌ అంచనా
దేశీయ మార్కెట్లు ఈ ఏడాది సైతం బుల్‌ రన్‌ కొనసాగిస్తాయని ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం డాయిష్‌ బ్యాంక్‌ అభిప్రాయపడింది. ఈ ఏడాది చివరకు నిఫ్టీ 11400 పాయింట్లకు, సెన్సెక్స్‌ 37వేల పాయింట్లకు చేరతాయని బ్యాంకు ప్రతినిధి ప్రతీక్‌ గుప్తా అంచనా వేశారు. అయితే మార్కెట్లో ఒడిదుడుకులు మాత్రం మరికొంత కాలం కొనసాగుతాయన్నారు. వచ్చే 3- 5ఏళ్ల పాటు కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌లో వృద్ధి కారణంగా భారత ఎకానమీలో నిర్మాణాత్మక వృద్ధి కనిపిస్తుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఎర్నింగ్స్‌ వృద్ధి 20 శాతం ఉండొచ్చని, దీంతో సూచీల్లో పరుగులు కొనసాగుతాయని వివరించారు. భారత్‌లో బలమైన నిర్మాణాత్మక ఎకానమీ కారణంగా డౌన్‌సైడ్‌ను అంచనా వేయలేమని ఆయన చెప్పారు. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌ ఉన్నా అది పరిమితంగానే ఉండొచ్చన్నారు. ఒకవేళ యూఎస్‌ డాలర్‌ మరింత బలపడి, క్రూడాయిల్‌ ధర మరింత మండితే సూచీల్లో మరో 5 శాతం పతనం ఉండొచ్చని ఊహించారు. దేశీయ సూచీల్లో ఏదైనా పతనం వచ్చిందంటే అది కేవలం అంతర్జాతీయ కారణాలతోనే తప్ప దేశీయ కారణాలతో రాదని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివరకు బ్రెంట్‌ క్రూడ్‌ ధర 80 డాలర్లకు అటుఇటుగా ఉండొచ్చని, ఇది భారత్‌కు పెద్ద సమస్య కాకపోవచ్చని చెప్పారు. దేశీయ లిక్విడిటీ ప్రవాహంతో పోలిస్తే ఎఫ్‌పీఐల నిధుల ఉపసంహరణ పెద్ద విషయం కాదని చెప్పారు. అయితే ఈ ఉపసంహరణ మరికొంతకాలం కొనసాగవచ్చని అంచనా వేశారు. 
వివిధ రంగాలపై సిఫార్సులు..
- ఐటీ రంగంలో ప్రధానంగా యూఎస్‌లో కార్యకలాపాలు అధికంగా ఉన్నవి, బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో ఉన్నటువంటి లార్జ్‌క్యాప్స్‌ను ఎంచుకోవచ్చు. మిడ్‌క్యాప్‌ ఐటీ కంపెనీలు బాగున్నా, వాల్యూషన్ల పరంగా కాస్త అధికంగా ఉన్నందున కొంచెం వేచిచూడొచ్చు. లార్జ్‌క్యాప్‌ ఐటీ షేర్లలో ఏదైనా డౌన్‌ట్రెండ్‌ ఉన్నా బైబ్యాక్స్‌, డివిడెండ్లు అడ్డుకుంటాయి.
- బ్యాంకుల్లో కొన్ని ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగంలో అధిక కాసా, తక్కువ కార్పొరేట్‌రుణాలు, అధికంగా రిటైల్‌పై ఫోకస్‌ ఉన్న బ్యాంకులను ఎంచుకోవచ్చు.
- సిమెంట్‌ రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువైన అవకాశాలున్నాయి. ఇన్‌ఫ్రా పుంజుకోవడం ఈ రంగానికి కలిసిరానుంది. అయితే మరో ఏడాది పాటు ధరల తలనొప్పులు సిమెంట్‌ కంపెనీలకు తప్పకపోవచ్చు.
- ఎన్నికల ముందు ఏడాది వినియోగరంగం అత్యద్భుత ప్రదర్శన ఇస్తుందని గత గణాంకాలు చెబుతున్నాయి. ఈ దఫా కూడా ఇదే ధోరణి ఉండొచ్చు. రూరల్‌, కన్జూమర్‌ థీమ్స్‌పై బుల్లిష్‌గా ఉన్నట్లు తెలిపింది. 



You may be interested

కన్సూమర్‌ షేర్లపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషణ

Wednesday 11th July 2018

ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ కంపెనీల ఫలితాలు ఆకర్షణీయంగా ఉండేందుకు అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషించింది. దేశీయ అమ్మకాలు బలంగా ఉన్నాయని, అంతర్జాతీయంగా కూడా మెరుగుదల నమోదవుతుందని వివరించింది. హెచ్‌యూఎల్‌, బ్రిటానియా అవుట్‌పెర్ఫార్మ్‌ చేసేందుకు అవకాశం ఉందని విశ్లేషించింది. ఐటీసీ క్యూ1 ఫలితాలుపై యావరేజ్‌ అవుట్‌లుక్‌ ఇచ్చిన బ్రోకింగ్‌ సంస్థ.. సిగరెట్‌ అమ్మకాలు, ఎఫ్‌ఎమ్‌సీజీ ఎబిటా మార్జిన్లతో పాటు అగ్రి, హోటల్‌ వ్యాపారం ప్రధాన అంశాలుగా

ఈ రంగాలలో ఎర్నింగ్స్‌ జోరు..!

Wednesday 11th July 2018

ముంబై: వచ్చే త్రైమాసికాలలో ఐటీ రంగానికి చెందిన పలు కంపెనీలు, ఫార్మా రంగంలో ఎర్నింగ్స్‌ వృద్ధి ఆకర్షణీయంగా ఉండనుందని విశ్లేషించిన ఏంజెల్ బ్రోకింగ్ ఫండ్ మేనేజర్ మౌరేష్ జోషి.. వినియోగం ఎక్కువగా ఉండే రంగాల కంపెనీలలో ఎఫ్‌ఎమ్‌సీజీ, స్టెపుల్స్‌, పలు రంగుల తయారీ కంపెనీల ఫలితాలు ఆకట్టుకునే విధంగా ఉండేందుకు అవకాశం మెండుగా ఉందని అంచనావేశారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆటో విడిభాగాల కంపెనీలు సరిపోతాయని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన

Most from this category