STOCKS

News


రూపీ పతనంతో అదరగొడుతున్న ఐటీ షేర్లు

Wednesday 31st October 2018
Markets_main1540970186.png-21603

ఆటుపోటు మార్కెట్‌ ట్రేడింగ్‌ రూపాయి పతనంతో ఐటీ షేర్లు పండుగ చేసుకుంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ బుధవారం 2.62శాతం లాభపడింది. డాలరు ఇండెక్స్‌ పటిష్ట ర్యాలీకి తోడు, కేంద్రం, ఆర్‌బీఐకి తీవ్ర విభేదాలు తలెత్తిన నేపథ్యంలో డాలరు మారకంలో రూపాయి విలువ నేడు 74.13 స్థాయికి క్షీణించిన సంగతి తెలిసిందే. రూపాయి పతనంతో ఐటీ షేర్లలో నేడు కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 2.65 శాతం పెరిగి 14,724.70 స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు (14,355.85)తో పోలిస్తే 2.50శాతం లాభంతో 14,724.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఇదే సమయానికి ఈ సూచీలోని టెక్‌ మహీంద్రా అత్యధికంగా 7శాతం ర్యాలీ చేసింది. హెచ్‌సీఎస్‌ 6శాతం, ఇన్ఫోసిస్‌ 3.50శాతం, ఇన్ఫీభీమ్‌ 3శాతం, టాటాఎలాక్సీ 2శాతం, నీట్‌ టెక్‌ 1.50శాతం, టీసీఎస్‌, విప్రో, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ షేర్లు అరశాతం వరకు లాభపడ్డాయి. ఇదే సమయానికి నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 గెయినర్లలో టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు చోటు దక్కించుకున్నాయి.



You may be interested

తొలి ‘‘హ్యారియర్‌’’ విడుదల

Wednesday 31st October 2018

వచ్చే ఏడాదిలో డెలివరీలు న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన ప్రీమియం ఎస్‌యూవీ ‘హ్యారియర్‌’ తొలి కారు మంగళవారం విడుదలైంది. పుణే యూనిట్‌లో ఈ ఎస్‌యూవీ ఉత్పత్తి అయ్యిందని, వచ్చే ఏడాది తొలి అర్థభాగంలోనే దేశవ్యాప్తంగా విడుదలకానుందని కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ప్యాసింజర్‌ వాహన వ్యాపార యూనిట్‌ ప్రెసిడెంట్‌ మయాంక్ పరీక్‌ మాట్లాడుతూ.. ‘జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) సహకారంతో కేవలం ఆరు నెలల్లోనే ఈ ఎస్‌యూవీ రూపుదిద్దుకుంది. వచ్చే ఏడాదిలో

టాటాస్టీల్‌ షేరు ఈయూ షాక్‌..!

Wednesday 31st October 2018

టాటా స్టీల్‌కు యూరోపియన్‌ యూనియన్‌ షాక్‌నిచ్చింది. యూరప్‌లో ఏర్పాటయ్యే టాటా స్టీల్, జర్మనీ స్టీల్ కంపెనీ థిసేన్‌క్రుప్‌ల భాగస్వామ్య కంపెనీతో ఏర్పడే జాయింట్‌ వెంచర్‌పై దర్యాప్తుకు కమీషన్‌ను ఏర్పాటు చేయడంతో​ టాటాస్టీల్‌ కంపెనీ షేరు బుధవారం బీఎస్‌ఈలో 6శాతం పతమనమైంది. నేడు షేరు రూ.556.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈయూ కమీషన్‌ ఏర్పాటు వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలు మొగ్గుచూపారు. ఫలితంగా ఇంట్రాడేలో షేరు  6శాతం నష్టపోయి రూ. 530.10ల

Most from this category