STOCKS

News


రూపీ రికవరీ: నష్టాల్లో ఐటీ షేర్లు

Friday 26th October 2018
Markets_main1540539293.png-21493

ఐటీ, బ్యాకింగ్‌ రంగ షేర్ల పతనంతో మార్కెట్‌ శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి రీవకరీ కారణంగా ఐటీ షేర్లు నేటి ట్రేడింగ్‌లో భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిప్టీ ఐటీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో అన్ని ఇండెక్స్‌ల్లో కెల్లా అత్యధికంగా 2శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపుతో ముగింపు (14071)తో పోలిస్తే 1.50శాతం నష్టపోయి 13,856ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 10 షేర్లులో 7షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, మరో 3షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా ఇన్ఫీభీమ్‌ షేరు 4శాతం పతనమైంది. హెచ్‌సీఎల్‌టెక్‌ 3శాతం, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. అలాగే మైండ్‌ ట్రీ 1శాతం, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌, విప్రో షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు ఎన్‌ఐఐటీటెక్‌ షేర్లు 3శాతం లాభపడింది. టాటా ఎలాక్సీ 1శాతం, టెక్‌ మహీంద్రా షేర్లు అరశాతం పెరిగింది.
ఇక మార్కెట్‌ విషయానికొస్తే...
మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి అటో, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్ల రీకవరీ కారణంగా ఆరంభ నష్టాలను పరిమితం చేసుకుంది. అయితే  ఐటీ, బ్యాకింగ్‌ రంగ షేర్ల పతనంతో స్వల్ప నష్టాలు మార్కెట్‌ వెంటాడుతున్నాయి. మధ్యాహ్నం గం.12:45ని.లకు ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 100పాయింట్లు నష్టపోయి 33,589 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ సూచీ 25 పాయింట్ల నష్టంతో 10100ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఫలితాల తర్వాత ఈ షేర్లపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Friday 26th October 2018

తాజా సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల్ని వెల్లడించిన వివిధ కంపెనీలకు చెందిన షేర్లను మధ్య, దీర్ఘకాలానికి కొని, హోల్డ్‌చేయదగ్గ షేర్లను బ్రోకింగ్‌ సంస్థలు సిఫార్సుచేసాయి. అవి... కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ బ్రోకరేజ్‌: సీఎల్‌ఎస్‌ఏ. రేటింగ్‌: బై. టార్గెట్‌: రూ. 1420 ఫలితాల అనంతరం కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ రేటింగ్‌ను సీఎల్‌ఎస్‌ఏ ‘అవుట్‌పెర్ఫార్మ్‌’ నుంచి ‘బై’కి రేటింగ్‌ను సవరించింది. అయితే ఏడాది కాలానికి టార్గెట్‌ ధరను రూ. 1480 నుంచి రూ. 1420కి తగ్గించింది. ఈ బ్యాంకు

బ్యాంక్‌ నిప్టీ 1శాతం డౌన్‌..!

Friday 26th October 2018

యస్‌బ్యాంక్‌ భారీ పతనం కారణంగా నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ శుక్రవారం దాదాపు 1శాతం నష్టపోయింది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(24,817.45)తో పోలిస్తే అరశాతం నష్టంతో 24,673ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమాయనికి ఇండెక్స్‌లో భాగమైన మొత్తం 12 షేర్లలో 7 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 4 షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా యస్‌ బ్యాంక్‌ 6శాతం నష్టపోయి నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 లూజర్లలో

Most from this category