News


రీకవరీ బాటలో ఐటీ షేర్లు

Thursday 22nd November 2018
Markets_main1542872930.png-22307

గత ట్రేడింగ్‌లో సూచీల పతనానికి కారణమైన ఐటీ షేర్లు గురువారం ర్యాలీ చేస్తున్నాయి. ముఖ్యంగా టెక్‌ మహీంద్రా ర్యాలీ ఐటీ షేర్ల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించింది. బ్రోకరేజ్‌ సంస్థల రేటింగ్‌ పెంపుతో ఇంట్రాడేలో టెక్‌మహీంద్రా షేరు​3శాతం లాభపడిన సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ దాదాపు 2శాతం పెరిగింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(13,879.15)తో పోలిస్తే 1.20శాతం లాభంతో 14070ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన మొత్తం 10 షేర్లలో 8 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 2 షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సూచీలో అత్యధికంగా టెక్‌ మహీంద్రా 3శాతం ర్యాలీ చేయగా, టీసీఎస్‌ షేరు 2శాతం లాభపడింది. మైండ్‌ ట్రీ, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ షేర్లు 1శాతం ర్యాలీ చేశాయి. అలాగే ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ అరశాతం లాభపపడ్డాయి. మరోవైపు విప్రో, ఎన్‌ఐఐటీ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన సూచీ నిఫ్టీ -50లో టీసీఎస్‌ షేరు టాప్‌ - 5 గెయినర్లలో చోటు దక్కించుకుంది.

 



You may be interested

ఐడీఎఫ్‌సీ గ్రూప్‌ షేర్ల ర్యాలీ..

Thursday 22nd November 2018

7 శాతానికిపైగా అప్‌ ఐడీఎఫ్‌సీ గ్రూప్‌ షేర్లు గురువారం ర్యాలీ చేస్తున్నాయి. ఐడీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, క్యాపిటల్‌ ఫస్ట్‌ షేర్లు నిఫ్టీ ఎఫ్‌అండ్‌వో సెక్యూరిటీస్‌ విభాగంలో టాప్‌ గెయినర్లుగా ఉన్నాయి. మధ్యాహ్నం 1:22 సమయంలో క్యాపిటల్‌ ఫస్ట్‌ షేరు 7.4 శాతం పెరుగుదలతో రూ.533 వద్ద, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 7.01 శాతం వృద్ధితో రూ.39 వద్ద, ఐడీఎఫ్‌సీ షేరు 4.25 శాతం పెరుగుదలతో రూ.40 వద్ద ట్రేడవుతున్నాయి.  ఎందుకీ ర్యాలీ? ఐడీఎఫ్‌సీకి చెందిన బ్రోకరేజ్‌

స్వల్పకాలానికి 3 టెక్నికల్‌ సిఫార్సులు

Thursday 22nd November 2018

బొనాంజా పోర్ట్‌ఫోలియో టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ రూపక్‌ సమీప కాలంలో లాభాలందించే మూడు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం..  ఫెడరల్‌ బ్యాంక్‌ కొన్ని రోజుల కన్సాలిడేషన్‌ తర్వాత స్టాక్‌ గరిష్ట స్థాయిలో క్లోజయ్యింది. లైన్‌ చార్ట్‌లో స్టాక్‌ ప్రైస్‌.. తన మునపటి కీలక స్థాయి పైకి కదలింది. అలాగే వీక్లి ఆర్‌ఎస్‌ఐ బుల్లిష్‌ క్రాసోవర్‌లో ఉంది. అలాగే పెరుగుతోంది. ట్రేడర్లు రూ.92 టార్గెట్‌ ప్రైస్‌తో రూ.79 స్టాప్‌ లాస్‌తో 82-83.5

Most from this category