STOCKS

News


నష్టాల్లో బాటలో ఐటీ షేర్లు

Tuesday 23rd October 2018
Markets_main1540271779.png-21400

మార్కెట్‌ పతనంలో భాగంగా మంగళవారం ఐటీ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని ఇండెక్స్‌ల్లో కెల్లా నిఫ్టీ ఇటీ ఇండెక్స్‌ అత్యధికంగా నష్టపోయింది. నేటి ఉదయం ప్రారంభ సెషన్స్‌లోనే ఐటీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇటీ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. ఉదయం గం.10:20ని.లకు ఇండెక్స్‌ 1.50శాతం నష్టంతో 14,218.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 10 షేర్లకు గానూ 8 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. విప్రో, ఇన్ఫీభీమ్‌, టాటా ఎలాక్సీ షేర్లు 3శాతం క్షీణించాయి. అత్యధిక వెయిటేజీ కలిగిన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 2శాతం పతనయ్యాయి. నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించనున్న హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 1శాతం నష్టపోగా, ఎన్‌ఐఐటీటెక్‌, ఓఓఫ్‌ఎస్‌ఎస్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మైండ్‌ ట్రీ, టెక్‌ మహీంద్రా షేర్లు మాత్రం అరశాతం స్వల్ప లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇదే సమయానికి ఐటీ రంగానికే చెందిన విప్రో(3శాతం నష్టం) నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 లూజర్లలో చోటు దక్కించుకోవడం గమనార్హం.



You may be interested

‘సెల్‌’ సిఫార్సులు

Tuesday 23rd October 2018

ఈక్విటీ మార్కెట్‌ నిపుణులు కొన్ని స్టాక్స్‌కు స్వల్ప కాలానికి సంబంధించి బై, సెల్‌ సూచనలు ఇచ్చారు. అవేంటో చూద్దాం.. సీకే నారాయణ్‌ (చార్ట్‌ అడ్వైజ్‌) ► ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను రూ.218 టార్గెట్‌ ప్రైస్‌తో విక్రయించొచ్చు. స్టాప్‌ లాస్‌ రూ.230.   ► కెనరా బ్యాంక్‌ను కూడా రూ.205 టార్గెట్‌ ప్రైస్‌తో విక్రయించొచ్చు. దీనికి స్టాప్‌ లాస్‌ రూ.216. మానస్‌ జైశ్వాల్‌ (మానస్‌జైశ్వాల్‌.కామ్‌) ► కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ను రూ.1,080 టార్గెట్‌ ప్రైస్‌తో విక్రయించొచ్చు.దీనికి స్టాప్‌ లాస్‌ రూ.1,206. ► ఏసియన్‌ పెయింట్స్‌ను కూడా

హెచ్‌పీఈ ప్లాట్‌ఫామ్‌పైకి బ్యాంకుల స్టోరేజీ!

Tuesday 23rd October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ (ఏపీసీవోబీ), తెలంగాణ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ (టీఎస్‌సీఏబీ)లకు చెందిన సంప్రదాయ స్టోరేజీ మౌలిక సదుపాయాలను హెచ్‌పీఈ 3పీఏఆర్‌ వేదికకు విజయవంతంగా మార్చినట్లు హ్యులెట్‌ ప్యాకర్డ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (హెచ్‌పీఈ) ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో బ్యాంక్‌ ఇంటర్నెట్, మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు వేగవంతమవటమే కాకుండా నిరంతరంగా జరిపే వీలుంటుందని పేర్కొంది.  

Most from this category