STOCKS

News


నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ డౌన్‌..

Thursday 11th October 2018
Markets_main1539231316.png-21027

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో గురువారం నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ కూడా మినహాయింపేమీ దక్కలేదు. మిగతా సెక్టోరల్‌ ఇండెక్స్‌ల బాటలోనే నిఫ్టీ ఐటీ కూడా పతనమైంది. దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్‌ క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడి కానుండటం, రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయిలకు పతనం కావడం వంటి అంశాలు కూడా సానుకూల ప్రభావం చూపలేకపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ గురువారం ఉదయం 9:42 సమయంలో 2.56 శాతంమేర పతనమైంది. 14,755 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 
నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో ఇన్ఫీబీమ్‌, ఎన్‌ఐఐటీ టెక్‌ షేర్లు ఏకంగా 5 శాతానికిపైగా పతనమయ్యాయి. ఇక ఇన్ఫోసిస్‌ 4 శాతానికిపైగా పడిపోయింది. హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా ఎలెక్సీ, మైండ్‌ట్రీ, టీసీఎస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా షేర్లు 2-3 శాతం శ్రేణిలో నష్టపోయాయి. 



You may be interested

సిండికేట్‌ బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ పెంపు

Thursday 11th October 2018

న్యూఢిల్లీ: మూడు నెలల కాలపరిమితికి సంబంధించి ఎంసీఎల్‌ఆర్‌ (నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు)ను సిండికేట్ బ్యాంక్‌ స్వల్పంగా 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెంచింది.  దీనితో మూడు నెలల కాలపరిమితి రుణాలపై వడ్డీరేట్ల 8.40 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. అక్టోబర్‌ 10వ తేదీ నుంచీ తాజా రేటు అమల్లో‍కి వస్తుంది. కాగా ఓవరనైట్‌ (8.30), నెల (8.35), ఆరు

నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 4 శాతం డౌన్‌

Thursday 11th October 2018

గ్లోబల్‌ మార్కెట్లను అనుసరిస్తూ ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల సునామీ పోటెత్తింది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు భారీగా పతనమయ్యాయి. సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఏకంగా 4 శాతానికిపైగా పతనమైంది. దాదాపు మిగతా అన్ని ఇండెక్స్‌లు 2 శాతంమేర నష్టపోయాయి. ఉదయం 9:33 సమయంలో ఏ ఏ ఇండెక్స్‌లే ఏ స్థాయిలో పడిపోయాయో చూస్తే.. ఇండెక్స్‌                పతనం (శాతం) నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌    

Most from this category