News


కొనసాగిన ఐటీ షేర్ల పతనం

Wednesday 21st November 2018
Markets_main1542793557.png-22268

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ర్యాలీతో ఐటీ షేర్లు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాయి. బుధవారం రాత్రి రూపాయి ఫారెక్స్‌ మార్కెట్‌లో ముగిసే సమయానికి 21పైసలు బలపడి రెండు నెలల గరిష్ట స్థాయి 71.46 వద్ద ముగిసింది. నేడు ఈద్‌-ఈ-మిలద్‌ పండుగ సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్‌కు సెలవు. ఇప్పటికే వరుసగా ఆరు రోజుల పాటు ర్యాలీ చేసిన రూపాయి ఈ 6రోజుల్లో డాలర్‌ మారకంలో ఏకంగా 143 పైసలు బలపడింది. ఈ నవంబర్‌లో 250 పైసలు(3.3శాతం) బలపడటం విశేషం. రూపాయి బలపడటం ఇతర షేర్లపై​సానుకూలంగా ఉన్నప్పటికి డాలర్ల రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ, ఫార్మా షేర్లకు మాత్రం తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. నేడు మార్కెట్‌ నష్టాల పతనంలో భాగంగా ఐటీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ముఖ్యంగా ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 3.30శాతం నష్టపోయింది. మధ్యాహ్నం‍ గం.3:15ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(14,285.05)తో పోలిస్తే 3శాతం నష్టంతో 13,881.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎక్చ్సేంజీలల్లో అధిక వెయిటేజీ కలిగిన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ అత్యధికంగా షేర్లు 3.50శాతం నష్టపోయాయి. అలాగే టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌, టాటా ఎలాక్సీ, విప్రో షేర్లు 2శాతం క్షీణించాయి. మైండ్‌ ట్రీ, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ షేర్లు 1.50శాతం నుంచి 50శాతం నష్టపోయాయి. ఒక్క ఇన్ఫీభీమ్‌ షేరు మాత్రం 1.50శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని మరోప్రధాన సూచీ నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 లూజర్లలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 3.50శాతం నష్టంతో మొదటి రెండు స్థానాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ లాభం 53% జంప్‌

Wednesday 21st November 2018

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికం (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ లాభం వార్షిక ప్రాతిపదికన 53 శాతం మేర ఎగసింది. రూ.438 కోట్లుగా నమోదయ్యింది. లిక్విడిటీ సంక్షోభం, అధిక కేటాయింపుల నేపథ్యంలోనూ కంపెనీ ఈ స్థాయి లాభాన్ని అర్జించడం గమనార్హం. కాగా కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.287 కోట్ల లాభాన్ని ప్రకటించింది. కంపెనీ

ఎన్‌బీఎస్‌సీ వృద్ధి అంతంతమాత్రమే: సీఎల్‌ఎస్‌ఏ

Wednesday 21st November 2018

మొండి బకాయిలను పరిష్కరించుకునేందుకు బ్యాంకులు 60-70 శాతం వదులుకోవాల్సిన(హెయిర్‌ కట్‌) అవసరం ఉందని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)ల వృద్ధిరేటు నెమ్మదిస్తుందని అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అంచనావేసింది. వచ్చే 6-12 నెలలకాలం వరకు ఇదే పరిస్థితి కొనసాగేందుకు అవకాశం ఉందని విశ్లేషించిన ఈ సంస్థ.. నాలుగవ త్రైమాసికంలో ఎన్‌బీఎఫ్‌సీలు రోలోవర్‌ సమస్యను ఎదుర్కోనున్నట్లు తెలిపింది. బ్యాంక్‌ రుణాలు, కామర్షియల్‌ పేపర్ల అమ్మకాల ద్వారా ఈ

Most from this category