News


మార్కెట్‌ గమనం ఎటు?

Tuesday 30th October 2018
Markets_main1540839592.png-21568

నిఫ్టీ 200 పాయింట్ల ర్యాలీతో కనిష్ట స్థాయిని నమోదు చేసిందా? లేక ఇంకా పడిపోతుందా? అన్న సందేహం చాలా మందికి ఉంది. మరి సమీప కాలంలో సూచీల కదలికలు ఎలా ఉంటాయన్న దానిపై నిపుణుల అభిప్రాయాలు చూద్దాం. 

 

నిఫ్టీ రోజువారీ చార్ట్‌ 2018లో రెండు టాప్‌లను సూచిస్తోంది. ఈ ఏడాది జనవరి 29న 11,130 ఒకటి కాగా, ఆగస్ట్‌ 28న 11,738 మరొకటి. ఇక ఈ ఏడాది ఆరంభంలో మార్కెట్‌ 38 రోజుల పాటు కరెక్షన్‌ చవిచూసింది. తాజాగా కూడా 38 రోజల పాటు కరెక్షన్‌కు గురైనందున కొంత రివర్సల్‌ ఉంటుందంటున్నారు నిపుణులు. ‘‘అక్టోబర్‌ 27న నిఫ్టీ 10,000 స్థాయిని నిలబెట్టుకుంది. స్వల్పకాలిక బోటమ్‌కు చాలా సమీపంలోనే ఉన్నాం. తొలి దశ డౌన్‌ ట్రెండ్‌ ముగింపులో ఉన్నాం’’ అని ఆనంద్‌రాఠీ షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆనంద్‌ ఠక్కర్‌ పేర్కొన్నారు. 

 

‘‘మొత్తం మీద మార్కెట్లు అధిక విక్రయాల స్థాయిలో ఉన్నాయి. 10,000 స్థాయిని నిఫ్టీ బ్రేక్‌ చేస్తే తదుపరి కీలక మద్దతు స్థాయిని పరీక్షిస్తుంది. మరోసారి భారీ అమ్మకాలు వెల్లువెత్తుతాయి. బోటమ్‌ ఎక్కడన్నది తెలియడం లేదు. ప్రస్తుతానికైతే పరిస్థితులు మంచిగా అయితే లేవు’’ అని మార్కెట్‌ నిపుణుడు అజయ్‌ బగ్గా తెలిపారు. స్థూల ఆర్థిక పరిస్థితులు బోటమ్‌కు సానుకూలంగా లేవంటున్నారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలతో చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నవంబర్‌ 5 నుంచి ఇరాన్‌పై పూర్తి స్థాయిలో ఆంక్షలు మొదలవుతాయని ట్రంప్‌ గత వారమే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆగస్ట్‌ చివరి నుంచి మొదలైన కరెక్షన్‌ చాలా తీవ్ర స్థాయిలోనే ఉండడాన్ని చూశాం. ఈ ఏడాది మార్చి 23న నిఫ్టీ 9,998ని టచ్‌ చేసి ఆ తర్వాత ఆగస్ట్‌ 28 నాటికి 17 శాతం పెరిగింది. కానీ, అక్కడి నుంచి మొదలైన కరెక్షన్‌లో 15 శాతం నష్టపోయింది. 

‘‘పలు స్థూల ఆర్థిక సమస్యల నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లు స్థిరీకరణలో ఉన్నాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగాల్లో వ్యాల్యూషన్లు గణనీయంగా దిగొచ్చాయి. బ్లూచిప్‌ స్టాక్స్‌కు సమాన స్థాయిలో ఉన్నాయి’’ అని బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీఐవో సంపత్‌రెడ్డి పేర్కొ‍న్నారు. ‘‘రిస్క్‌-రాబడుల కోణంలో మేం ఇప్పటికీ లార్జ్‌క్యాప్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాం. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగాల్లో భారీ కరెక్షన్‌ నేపథ్యంలో నాణ్యమైన, విలువ కలిగిన స్టాక్స్‌ను దీర్ఘకాలం కోసం ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు’’ అని సంపత్‌రెడ్డి సూచించారు. తయారీ, ఇన్‌ఫ్రా, యుటిలిటీ విభాగాలను ఓల్డ్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ వ్యవస్థాపకుడు కెన్నెత్‌ ఆండ్రేడ్‌ సూచించారు. 
 You may be interested

ఎస్‌బీఐ ‘ఏటీఎం’ ఆంక్షలు రేపటి నుంచే అమల్లోకి

Tuesday 30th October 2018

ప్రభుత్వరంగ ఎస్‌బీఐ ఏటీఎం కార్డులపై విధించిన సరికొత్త నియంత్రణలు 31 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. క్లాసిక్‌, మ్యాస్ట్రో డెబిట్‌ కార్డులు కలిగిన వారు ఇక నుంచి రోజులో ఏటీఎంల నుంచి రూ.20,000వరకే విత్‌డ్రా చేసుకోగలరు. ఎస్‌బీఐ ఈ ఏడాది మార్చి నాటికి 39.50 కోట్ల డెబిట్‌ కార్డులను జారీ చేసి ఉంది. ఇందులో 26 కోట్ల కార్డులు తరచుగా వినియోగిస్తున్నవి. దీంతో ఎస్‌బీఐ ఆంక్షలు చాలా మందిపై ప్రభావం చూపించనున్నాయి.    ప్రస్తుతం

సెన్సెక్స్‌ లాభం 718 పాయింట్లు

Monday 29th October 2018

34 వేల పైకి సెన్సెక్స్‌ 10250 మార్కును అందుకున్న నిప్టీ ముంబై:- ప్రభుత్వరంగ బ్యాంకు, ఫార్మా షేర్ల ర్యాలీ అండతో సూచీలు సోమవారం భారీగా లాభపడ్డాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి సాగిన కొనుగోళ్లకు అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు తోడవ్వడంతో సెన్సెక్స్‌ 34 వేల మార్కును, నిఫ్టీ 10250 మార్కును అందుకున్నాయి.  చివరకు సెన్సెక్స్‌ 718 పాయింట్ల లాభంతో 34067 వద్ద నిఫ్టీ 221 పాయింట్లు పెరిగి 10250 వద్ద ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు

Most from this category