STOCKS

News


మూడు స్టాక్స్‌ నిఫ్టీని నిలబెట్టాయి...

Tuesday 7th August 2018
Markets_main1533636500.png-19018

ప్రస్తుత ఏడాది ప్రథమార్ధంలోని మార్కెట్‌ పతనాలు నిజం కాదనే విషయాన్ని ప్రస్తుత ఎర్నింగ్స్‌ సీజన్‌ నిరూపించాయని టీసీజీ ఏఎంసీ ఎండీ చక్రి లోకప్రియ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. నిఫ్టీని గమనిస్తే.. ఇందులోని పెరుగుదలకు ప్రధానంగా మూడు స్టాక్సే కారణమని పేర్కొన్నారు. రిలయన్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఇందులో ఉన్నాయన్నారు. నిఫ్టీలోని చాలా కంపెనీలు 52 వారాల కనిష్ట స్థాయిలో ట్రేడ్‌ అవుతున్నాయని తెలిపారు. ఇండెక్స్‌ కొత్త గరిష్ట స్థాయిల్లో కదలాడుతోందని, దీన్ని కేవలం మూడు స్టాక్సే పైకి తీసుకెళ్లాయని పేర్కొన్నారు. జనవరిలోని సెల్‌ఆఫ్‌ భయాలు నిజం కాదనే విషయాన్ని ప్రస్తుత ఎర్నింగ్స్‌ సీజన్‌ తెలియజేస్తోందని తెలిపారు. నిఫ్టీ లేదా దాదాపు 70 శాతం కంపెనీలు ఎర్నింగ్స్‌ను అధిగమించాయని, కేవలం 20 శాతం మాత్రమే ఎర్నింగ్స్‌ను అందుకోలేకపోయాయని వివరించారు. ఎర్నింగ్స్‌ పెరుగుదల మార్కెట్లకు సానుకూల అంశమని పేర్కొన్నారు.  
టాటా మోటార్స్‌ గురించి చక్రి లోకప్రియ మాట్లాడుతూ.. నానో ఒక లాస్‌ వెంచరన్నారు. జేఎల్‌ఆర్‌ వృద్ధికి దోహదపడుతూ వస్తోందని, అయితే ప్రస్తుతం ఇది కూడా బ్రెగ్జిట్‌ కారణంగా సమస్యలను ఎదుర్కొంటోందని తెలిపారు. కరెన్సీ అస్థిరత మరో సమస్యని పేర్కొన్నారు. వాణిజ్య వాహనాల డిమాండ్‌ ఒకవేళ రికవరీ అయినా కూడా టాటా మోటార్స్‌ వ్యాల్యుయేషన్స్‌ జేఎల్‌ఆర్‌ ఆధారంగానే ఉంటాయని వివరించారు. భారత్‌లో వాణిజ్య వాహన విక్రయాలు పుంజుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుత స్థాయిల్లో టాటా మోటార్స్‌ స్టాక్స్‌లో అధిక విక్రయాలు ఉంటాయని భావించడం లేదన్నారు. స్టాక్‌లో ఎలాంటి రికవరీ ఉండకపోవచ్చని అంచనా వేశారు. బ్రెగ్జిట్‌ భయాలు ఇంకా ఉన్నాయని, యూకేలోని ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో టాటా మోటార్స్‌ స్టాక్‌కు దూరంగా ఉండటమే ఉత్తమమని సూచించారు.  
బెర్జర్‌, ఏసియన్‌ పెయింట్స్‌ వంటి సంస్థలకు వచ్చే రెండు, మూడు నెలలు కీలకమని తెలిపారు. ఈ సమయంలో పండుగ సీజన్‌ ప్రారంభమౌతుందని పేర్కొన్నారు. అందువల్ల ఈ స్టాక్స్‌ను అలాగే అట్టిపెట్టుకోవడం మంచిదని పేర్కొన్నారు. బెర్జర్‌, కన్సాయ్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సూచించారు. ఏసియన్‌ పెయింట్స్‌ కూడా పర్వాలేదన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ స్టాక్‌పై స్పందిస్తూ లిస్టింగ్‌ అనంతరం కొన్ని రోజులు వెచి చూసిన తర్వాత కొనుగోలు చేయడం మంచిదని తెలిపారు. 



You may be interested

టీవీఎస్‌ మోటార్‌ లాభం రూ.146 కోట్లు

Tuesday 7th August 2018

దేశీ నాలుగో అతిపెద్ద టూవీలర్‌ కంపెనీ టీవీఎస్‌ మోటార్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌, క్యూ1) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ.146.6 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో కంపెనీ లాభం రూ.129.5 కోట్లుగా ఉంది. ఈ క్యూ1లో కంపెనీ టూవీలర్‌ విక్రయాలు 14 శాతం వృద్ధితో 8,92,754 యూనిట్లకు పెరిగాయి.

అవంతీ ఫీడ్స్‌కు ఫలితాలకు షాక్‌..!

Tuesday 7th August 2018

ముంబై:- అవంతీ ఫీడ్స్‌ షేర్లకు తొలి త్రైమాసిక ఫలితాలు షాకిచ్చాయి. జూన్‌ త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు నమోదుకావడంతో ఆ కంపెనీ షేర్లు మంగళవారం 12శాతం నష్టపోయాయి. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లోఅవంతీ ఫీడ్స్‌ నికర లాభం 42 శాతం క్షీణించి‍ంది. ఈ గతేడాది ఇదే క్యూ1లో రూ.149 కోట్లను ఆర్జించగా, ఆ క్యూ1లో రూ. 90 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం రూ. 998 కోట్ల నుంచి రూ. 1040 కోట్లకు పెరిగింది. నిర్వహణ

Most from this category