STOCKS

News


నాలుగురోజుల లాభాలకు బ్రేక్‌

Friday 8th March 2019
Markets_main1552041491.png-24497

  • 11050 మార్కును కోల్పోయి నిఫ్టీ

ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 54 పాయింట్లను కోల్పోయి 36,671 వద్ద, నిఫ్టీ 10500 మార్కును చేజార్చుకుని 23 పాయింట్లు నష్టపోయి 11,035 వద్ద ముగిసింది. దీంతో  నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్‌పడినట్లైంది.  అటో, బ్యాంక్‌, మెటల్‌, ఫార్మా, ఐటీ షేర్ల అమ్మకాలు జరగ్గా, ఎఫ్‌ఎంజీసీ, ఇన్ఫ్రా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 27,762 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఆసక్తి చూపడంతో మార్కెట్లు ఆద్యంతం నష్టాలకే పరిమితమయ్యాయి. ఇంట్రాడేలో నిఫ్టీ ఇండెక్స్‌ 11,009 - 11,049 రేంజ్‌లో కదలాడగా, సెన్సెక్స్‌ 36,593-36,753 స్థాయిలో కదలాడింది. 
ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, టాటాస్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టాటామోటర్స్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం నష్టపోగా, యూపీఎల్‌, బజాజ్‌అటో, ఐషర్‌ మోటర్స్‌, గెయిల్‌, ఎన్‌టీపీసీ షేర్లు 1.50శాతం నుంచి 4శాతం లాభపడ్డాయి. 



You may be interested

మిడ్‌క్యాప్స్‌లో మోర్గాన్‌ స్టాన్లీ నచ్చిన స్టాక్స్‌!

Saturday 9th March 2019

దాదాపు రెండేళ్ల కనిష్ట ధరలకు కొన్ని, 52 వారాల కనిష్ట ధరలకు ఎక్కువ శాతం మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఇటీవల పడిపోయాయి. ఎక్కువ మంది విశ్లేషకులు స్టాక్స్‌ కొనుగోలుకు ఇది సరైన తరుణంగా భావిస్తున్నారు. ‘‘చమురు ధరలు పెరగకపోవచ్చు. గత ఎనిమిది వారాల్లో రాజకీయంగా పరిణామాలను పరిశీలిస్తే... ఎన్నికల ముందస్తు ఎన్నో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం, రైతులకు నగదు బదిలీ, సరిహద్దుల్లో సైనిక చర్యతో ప్రజల్లో ఏకీకరణ జరిగి రానున్న ఎన్నికల

ఈ ఆరు షేర్లూ కొనొచ్చు-కొటక్‌

Friday 8th March 2019

లోక్‌సభ ఎన్నికలు, అమెరికా–చైనా వాణిజ్య భయాలు, బ్రెగ్జిట్‌ తదితర అంశాల కారణంగా ఈ ఏడాది అంతా ఒడుదుడుకులమయంగా మార్కెట్‌ వుంటుందని, ఈ తరుణంలో... గత ఏడాదికాలంగా పతనమైన షేర్ల నుంచి ఆయా రంగాల్లో నాణ్యతగలిగిన వాటిలో ఇన్వెస్ట్‌ చేయవచ్చని కొటక్‌ సెక్యూరిటీస్‌ సూచించింది. లార్జ్‌క్యాప్స్‌ నుంచి మంచి వృద్ధి కనపరుస్తున్నవాటిని, మిడ్‌క్యాప్స్‌ నుంచి మంచి యాజమాన్యం కలిగి, సబబైన విలువలతో ట్రేడవుతున్నవాటిని కొనవచ్చని కొటక్‌ విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది.

Most from this category