STOCKS

News


ఈ ఏడాది గరిష్టానికి నిఫ్టీ

Monday 11th March 2019
Markets_main1552283127.png-24528

దేశవ్యాప్తంగా మొదలైన ఎన్నికల సందడి స్టాక్‌ మార్కెట్‌లోనూ నెలకొంది. ఫలితంగా ప్రపంచమార్కెట్లలో బలహీన సంకేతాలున్నప్పటికీ, సూచీలు పరుగులు పెడుతున్నాయి. కేంద్రంలో తిరిగి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 325 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ ఈ ఏడాది(2019) గరిష్టస్థాయిని అధిరోహించింది. అన్ని రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రభుత్వరంగబ్యాంక్‌, మెటల్‌, అటో రంగ షేర్లకు అత్యధికంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. అయితే ఐటీ సెక్టార్లు షేర్లు మాత్రం అక్కడక్కడే ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం‍ గం.10:45ని.లకు సెన్సెక్స్‌ 324 పాయింట్లు లాభపడి 36,995 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు లాభపడి 11,139 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం లాభపడి 28,000పైన 28,013.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

టాప్‌ బ్రోకరేజ్‌ల డాషింగ్‌ డజన్‌ రికమండేషన్లు

Monday 11th March 2019

వచ్చే రెండు, మూడు వారాల్లో మంచి రాబడిని అందించే సత్తా ఉన్న 12 స్టాకులను ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి. యస్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు: 1. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2250. స్టాప్‌లాస్‌ రూ. 2060. వీక్లీ చార్టుల్లో 50 శాతం ఫిబోనాక్కి రిట్రేస్‌మెంట్‌ స్థాయి వద్ద మద్దతు తీసుకొని పాజిటివ్‌గా మారినట్లు కనిపిస్తోంది. రూ.2160 వద్ద త్రిభుజాకార నిరోధ పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించేందుకు తయారుగా ఉంది.

ఈ మిడ్‌క్యాప్స్‌పై బ్రోకరేజ్‌లు పాజిటివ్‌!

Monday 11th March 2019

తాజా ర్యాలీలో భాగంగా మిడ్‌క్యాప్‌ స్టాకులు క్రమంగా కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌పై బ్రోకరేజ్‌ సంస్థలు ప్రత్యేక మక్కువ చూపుతున్నాయి. అలాంటి స్టాకుల వివరాలు... సీఎల్‌ఎస్‌ఏ: 1. సద్భావ్‌ ఇంజనీరింగ్‌: గతేడాది ఇదే సమయంతో పోలిస్తే దాదాపు 42 శాతం పతనమైంది. ప్రస్తుతం వాల్యూషన్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ఈ స్టాకును తన మోడల్‌ పోర్టుఫోలియోలో చేరుస్తున్నట్లు తెలిపింది. 2. శోభా: గతేడాది ఇదే సమయంతో పోలిస్తే దాదాపు

Most from this category