STOCKS

News


నిఫ్టీకి 10730- 10650 వద్ద బలమైన మద్దతు!

Monday 14th January 2019
Markets_main1547439423.png-23562

నిఫ్టీ గత కొన్ని వారాలుగా స్వల్ప రేంజ్‌లో ట్రేడవుతోంది. కొన్ని స్టాకులు మాత్రమే సూచీల్లో చురుగ్గా ఉంటున్నాయి. సోమవారం నిఫ్టీ నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టీ  10800 పాయింట్ల దిగువన, సెన్సెక్స్‌ 35900 పాయింట్ల దిగువన ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 10730- 10650 పాయింట్ల జోన్‌లో బలమైన మద్దతు లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ స్థాయిలను కాపాడుకోలేకపోతే 10300 పాయింట్లకు పతనమయ్యే ఛాన్సులున్నాయని అంచనా. పైస్థాయిలో 10870- 10940 పాయింట్ల రేంజ్‌లో బలమైన నిరోధం ఎదురవుతోంది. ఈ మద్దతు, నిరోధ స్థాయిలను దాటితే తప్ప సూచీల్లో బలమైన కదలికలుండవు. గతవారం క్యు3 సీజన్‌ ఆరంభమైంది. టీసీఎస్‌, ఇన్ఫీ, ఇండస్‌ఇండ్‌ తదితర కంపెనీలు ఫలితాలు వెల్లడించాయి. ఇవేవీ అంచనాలకు అనుగుణంగా లేవు. ఇక మీదట దిగ్గజ కంపెనీల ఫలితాలు ఎలాఉంటాయనేది ట్రెండ్‌ను ప్రభావితం చేయనుంది. మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్స్‌లో రికవరీ కనిపిస్తోంది. ఎంపిక చేసిన చిన్న స్టాకులను పరిశీలింవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 



You may be interested

ఇన్ఫీ షేరును ఏం చేద్దాం?

Monday 14th January 2019

గత వారం చివర్లో ఇన్ఫోసిస్‌ క్యు3 ఫలితాలు ప్రకటించింది. ఫలితాలు మిశ్రమంగా ఉన్నా, బైబ్యాక్‌ ఆఫర్‌ కారణంగా షేరులో కొనుగోళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫీ షేరును ఎలా డీల్‌ చేయాలనే విషయమై బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి.. 1. క్రెడిట్‌ సూసీ: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 680. మార్జిన్‌ అంచనాలు తక్కువగా ఉన్నాయి. రెవెన్యూ వృద్ధి పాజిటివ్‌ అంశమే కానీ మార్జిన్‌ కోత కారణంగా అంచనాలు తగ్గించుకోవాల్సి

మూడో రోజూ నష్టాల ప్రారంభమే..!

Monday 14th January 2019

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సూచీలకు ఇది వరుసగా మూడో రోజు నష్టాల ప్రాంరంభం కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరగుదలతో డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌ ప్రారంభం, కంపెనీల క్యూ3 ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత తదితర కారణాలు సైతం సూచీలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 167 పాయింట్ల నష్టంతో 35,842 వద్ద, నిఫ్టీ 61 పాయింట్ల

Most from this category