STOCKS

News


10290 పాయింట్ల వద్ద బలమైన మద్దతు

Monday 15th October 2018
Markets_main1539582779.png-21156

నిఫ్టీపై నార్నోలియా అంచనా
చాలారోజుల అమ్మకాల తర్వాత గత వారం స్టాకులు రిలీఫ్‌ ర్యాలీ చూశాయి. చార్టుల్లో బలమైన పాటర్న్‌ కనిపిస్తోంది. బ్యాంకు నిఫ్టీ చార్టుల్లో బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ పాటర్న్‌ కనిపించడంతో పాటు ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ బ్రేకవుట్‌ ఇచ్చింది. నిఫ్టీలో సైతం ఆర్‌ఎస్‌ఐ డబుల్‌ బాటమ్‌ను ఖరారు చేసింది. ఇండియా వీఐఎక్స్‌ 18.62కు దిగివచ్చింది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు కచ్ఛితమైన స్టాప్‌లాస్‌తో లాంగ్స్‌ను తీసుకోవచ్చు. ఇకపై నిఫ్టీకి అడుగడుగునా నిరోధాలు కనిపిస్తాయి. ముందుగా నిఫ్టీ 10500- 550 పాయింట్ల వద్ద నిరోధం చూడనుంది. దీన్ని దాటితే 10700- 10800 వరకు ర్యాలీ ఉండొచ్చు. దిగువన 10290 పాయింట్ల వద్ద బలమైన మద్దతు లభిస్తుంది. దీన్ని కాపాడుకోలేకుంటే అమ్మకాలు ఉధృతమవుతాయి. నిఫ్టీ ప్రస్తుతానికి స్వల్పకాలిక డీఎంఏలకు పైన ఉన్నందున మరికొంత కాలం బలాన్ని చూపవచ్చు. మధ్యకాలంలో గత డౌన్‌ట్రెండ్‌లో పూడ్చవలిసిన 107470-10822 పాయింట్ల అగాధాన్ని తాకవచ్చని అంచనా. మదుపరులు జాగ్రత్తతో వ్యవహరించాలి. 



You may be interested

ఫండ్స్‌కు స్టాప్‌-లాస్‌ వర్తిస్తుందా ?

Monday 15th October 2018

ప్ర: స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే ఫలితాలు బాగా ఉంటాయని పలు పర్సనల్‌ ఫైనాన్స్‌ వెబ్‌సైట్‌లు పేర్కొంటున్నాయి.  స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ చాలా రిస్క్‌ అని తెలుసు. అయినప్పటికీ ఈ ఫండ్స్‌లో పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు నేను తీసుకోవలసిన జాగ్రత్తలేంటి ?  -శ్రీధర్‌, కాకినాడ  జ: స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం

ఖాతాదారులకు ఎస్‌బీఐ పండగ ఆఫర్లు

Monday 15th October 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పండుగ సీజన్ సందర్భంగా తమ ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. తమ యోనో (యూ ఓన్లీ నీడ్‌ వన్‌) యాప్ ద్వారా షాపింగ్ చేసినవారికి అదనంగా డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాంక్ అందిస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 16-21 మధ్యలో ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో యోనో యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 10 శాతం దాకా

Most from this category