STOCKS

News


11700 దిగువకు నిఫ్టీ

Wednesday 29th August 2018
Markets_main1535538222.png-19767

  • రెండు రోజుల రికార్డు ర్యాలీకి బ్రేక్‌

మార్కెట్‌ రెండు రోజుల రికార్డు ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడింది. గురువారం(30న) ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు ముగియున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతో పాటు చివర అరగంటలో అమ్మకాల వెల్లువతో సూచీలు నష్టాలతో ముగిశాయి. వీటికి తోడు రూపాయి జీవితకాల గరిష్టానికి చేరుకోవడం, అంతర్జాతీయంగా చమురు పెరుగుదల, సూచీల గరిష్టస్థాయిల వద్ద ఇన్వెస్టర్ల స్వల్ప లాభాల స్వీకరణ తదితరకారణాలు కూడా సూచీల నష్టాల కారణమయ్యాయి. ఫలితంగా మార్కెట్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 174 నష్టపోయి 38,723 వద్ద ముగిసింది. నిఫ్టీ 47 పాయింట్ల నష్టంతో 11,692 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ సూచి 200 పాయింట్లు నష్టపోయి 38989.65 - 38679.57 స్థాయిలో ట్రేడైంది. మరో సూచీ నిఫ్టీ సూచి తనకు సాంకేతికంగా కీలకమైన 11,700 స్థాయిని కోల్పోయింది. ఇంట్రాడేలో 62 పాయింట్ల నష్టపోయి 11,678.85 - 11,753.20 రేంజ్‌లో కదలాడింది. చివరకు 47 పాయింట్ల నష్టంతో 11,692 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలోని ఫార్మా, ఐటీ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఎఫ్‌ఎంజీసీ రంగాలకు చెందిన సూచీలు నష్టపోగా, ప్రభుత్వరంగ బ్యాంకు, మెటల్‌, అటో, ఫైనాన్స్‌రంగాలకు చెందిన సూచీలు లాభాలతో ముగిశాయి. కీలకమైన నిఫ్టీ బ్యాంకు 45 పాయింట్ల నష్టంతో 28,224 వద్ద ముగిసింది.
ఇంట్రాడే ట్రేడింగ్‌ సాగిందిలా..!
అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో నేడు మార్కెట్‌ ఫ్లాట్‌ ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 93 పాయింట్ల లాభంతో 38,990 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 11,745 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రూపాయి జీవితకాల కనిష్టానికి పతనం కావడంతో సెన్సెక్స్‌ ఆరంభలాభాలను కోల్పోగా, నిఫ్టీ ఇండెక్స్‌ నష్టాల్లో వెళ్లింది. అనంతరం రేపు ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు ముగుస్తుండంతో పాటు అంతర్జాతీయంగా చమురు పెరుగుదల తదితర కారణాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా సూచీలు మిడ్‌ సెషన్‌ వరుకు పరిమిత శ్రేణిలో ట్రేడయ్యాయి. మిడ్‌సెషన్‌ అనంతరం  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఇన్ఫోసిస్‌ షేర్ల నష్టాల ట్రేడింగ్‌ కారణంగా సూచీలు మరింత నష్టపోయాయి. మిడ్‌ సెషన్‌ అనంతరం యూరప్‌ మార్కెట్ల మిశ్రమ ప్రారంభం ఇన్వెస్టర్లలలో మరింత ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే మొగ్గు చూపడంతో చివరి గంటలో అమ్మకాలు తీవ్రతరమయ్యాయి. ఫలితంగా సూచీల రెండురోజుల రికార్డు ర్యాలీ ముగింపు  పలుకుతూ సూచీలు నష్టాల్లో ముగిశాయి.
ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, లుపిన్‌, పవర్‌ గ్రిడ్‌, కోల్‌ ఇండియా షేర్లు 1.50శాతం నుంచి 3శాతం నష్టపోగా, గెయిల్‌, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, బజాజ్‌ఫిన్‌సర్వీసెన్‌, యూపీఎల్‌షేర్లు 1నుంచి 5శాతం లాభపడ్డాయి.



You may be interested

ఈఎల్‌ఎస్‌ఎస్‌, యులిప్‌లో పన్ను ఆదాకు ఏది ఉత్తమం?

Thursday 30th August 2018

పన్ను ఆదా చేసే పెట్టుబడి సాధనాల విషయంలో చాలా మందిలో సందేహాలు ఉంటుంటాయి. ఈక్విటీల్లో పెట్టుబడులకు వీలు కల్పించే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌), యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ (యులిప్‌) వీటిలో ఏది మెరుగు? అన్న ప్రశ్న ఎదురైతే... అందుకు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ రెండు పథకాలకు కొన్ని సారూప్యాలు, కొన్ని విభేదాలూ ఉన్నాయి. ఈ రెండూ పన్ను ఆదాకు అర్హమైనవే. రెండింటికీ లాకిన్‌

త్వరలో మరోదఫా బ్యాంకుల విలీనం?!

Wednesday 29th August 2018

లిస్టు ప్రిపరేషన్‌కు ఆర్‌బీఐని ఆదేశించిన ప్రభుత్వం బ్యాంకింగ్‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రస్తుతమున్న 21 పీఎస్‌యూ బ్యాంకుల్లో విలీనానికి అనుకూలమైన బ్యాంకుల జాబితా తయారు చేయమని ఆర్‌బీఐని కేంద్రం ఆదేశించింది. మొండిపద్దులతో కుంగిపోతున్న పీఎస్‌యూబ్యాంకింగ్‌ రంగానికి జవసత్వాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత‍్వ శాఖ ఇటీవలే ఆర్‌బీఐకి లేఖ రాసినట్లు చెప్పారు. విలీనం చేయాల్సిన బ్యాంకుల జాబితా తయారీతో పాటు

Most from this category