STOCKS

News


10800 దిగువన నిఫ్టీ ముగింపు

Friday 11th January 2019
Markets_main1547201761.png-23536

ఐటీ, అటో రంగ షేర్ల క్షీణతతో మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. నిఫ్టీ 10800 మార్కును కోల్పోయింది. ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో నేడు సూచీలు లాభాలతో ప్రారంభయ్యాయి. అయితే ఇంట్రాడేలో ఐటీ, అటో, ఇన్ఫ్రా, షేర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు నష్టాల బాట పట్టాయి. అలాగే మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ రంగాలకు చెందిన షేర్లలో సైతం అమ్మకాలు సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపాయి. . సెన్సెక్స్‌ 96 పాయింట్లు క్షీణించి 36,010 వద్ద, నిఫ్టీ 26పాయింట్లు నష్టపోయి 10,795 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 74పాయింట్లను కోల్పోయి 27,454 వద్ద ముగిసింది. ప్రభుత్వరంగబ్యాంక్‌ ఇండెక్స్‌, అటో ఇండెక్స్‌ దాదాపు 1శాతం క్షీణించాయి. మరోవైపు ఐటీసీ అండతో నిఫ్టీ ఎఫ్‌ఎంజీసీ ఇండెక్స్‌ అరశాతానికిపైగా లాభపడగా, ఫైనాన్స్‌ సర్వీస్‌ ఇండెక్స్‌ సైతం 0.10శాతం నష్టపోయింది.
యస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఇన్ఫ్రాటెల్‌, టాటామోటర్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం నష్టపోగా, హిందాల్కో, ఐఓసీ, విప్రో, యూపీఎల్‌, ఐటీసీ షేర్లు 1శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి.



You may be interested

ఈ ఏడాది చిన్నస్టాకులదే రాజ్యం!

Friday 11th January 2019

అనలిస్టుల అంచనా గతేడాది పలువురు ఇన్వెస్టర్లకు చుక‍్కలు చూపిన స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఈ సంవత్సరం కోలుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత గణాంకాల ఆధారంగా చూస్తే ఒక ఏడాది పేలవ ప్రదర్శన అనంతరం తరువాత సంవత్సరం మంచి రాబడులను చిన్న స్టాకులు అందించినట్లు తెలుస్తోందన్నారు. ఉదాహరణకు 2013లో మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ సూచీలు వరుసగా 6, 11 శాతం మేర నష్టపోయాయి. ఆ ఏడాది ప్రధాన సూచీలు 9 శాతం లాభపడ్డాయి.

ఎంపిక చేసిన మిడ్‌క్యాప్స్‌ కొనొచ్చు!

Friday 11th January 2019

సీఎల్‌ఎస్‌ఏ సిఫార్సు గతేడాది పతనానంతరం కోలుకుంటున్న మిడ్‌క్యాప్స్‌ విభాగంలో నాణ్యమైన స్టాకులను లాంగ్‌టర్మ్‌ కోసం కొనుగోలు చేయవచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ సూచించింది. తను సూచించిన స్టాక్స్‌పై ఎంతమంది అనలిస్టులు పాజిటివ్‌గా ఉన్నారో సైతం సీఎల్‌ఎస్‌ఏ వెల్లడించింది. 1. ఆదిత్య బిర్లా ఫాషన్‌ అండ్‌ రిటైల్‌: టార్గెట్‌ రూ. 240. దేశంలో టాప్‌ 4 అపెరల్‌ బ్రాండ్స్‌ ఉన్న కంపెనీ. రాబోయే రెండేళ్లలో ఈపీఎస్‌లో దాదాపు 30 శాతం వృద్ది ఉండొచ్చు.

Most from this category