STOCKS

News


లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 31st December 2018
Markets_main1546228236.png-23319

ప్రపంచ‌మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనడంతో సోమవారం  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం ఉదయం 9.00 గంటల సమయానికి 39 పాయింట్ల పెరుగుదలతో 10,960 పాయింట్ల వద్ద ట్రేడవుతుంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10921.50 పాయింట్లతో పోలిస్తే 39 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు నేడు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక గతవారం ట్రేడింగ్ చివరి రోజైన శుక్రవారం తీవ్ర లాభనష్టాల మధ్య ఊగిసలాడిన అమెరికా సూచీలు చివరకు మిశ్రమంగా ముగిశాయి.
లాభాల్లో ఆసియా మార్కెటు:-
నేడు ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌, సింగపూర్‌ మార్కెట్లు మాత్రమే ట్రేడ్‌ అవుతుండగా, మిగిలిన మార్కెట్లు సెలవుల్లో కొనసాగుతున్నాయి. అమెరికా- చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు సజావుగానే సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గత శనివారం ట్వీట్‌ చేయడంతో ప్రపంచమార్కెట్లో సానుకూల ట్రెండ్‌ ఏర్పడింది. దీంతో దేశాల మధ్య వాణిజ్య చర్చలు విజయవంతమవ్వచ్చనే ఆశావహంతో హాంకాంగ్‌ 1.50 శాతం, సింగపూర్‌ సూచీ 0.50శాతం(అరశాతం) చొప్పున లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

10900పైన ప్రారంభమైన నిఫ్టీ

Monday 31st December 2018

ప్రపంచ‌మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనడంతో దేశీయ మార్కెట్‌ సోమవారం భారీ లాభాల్లో ట్రేడ్‌ అయ్యింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం సైతం సూచీల లాభాల ప్రారంభానికి దోహదపడింది. ప్రధాన సూచీలైన ప్రధాన సూచీలైన నిఫ్టీ సూచీ 63 పాయింట్ల లాభంతో 10900లపై 10,923.55 వద్ద సెన్సెక్స్‌ 163 పాయింట్ల లాభంతో 36,239.19 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సూచీలకు ఇది వరుసగా నాలుగోరోజూ లాభాల ప్రారంభం కావడం విశేషం. అయితే

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 31st December 2018

వివిధ వార్త‌ల‌కు అనుగుణంగా సోమ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు ఇవి:- రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌:-  త‌న అనుబంధ సంస్థ రిల‌య‌న్స్ ఇండస్ట్రీయ‌ల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్ లిమిటెడ్(ఆర్ఐఐహెచ్ఎల్‌) రూ.75 కోట్ల‌కు మించకుండా ఈక్విటీ వాటాల కొనుగోలుకు పున‌రుత్పాద‌క కంపెనీ కనోడా ఎన‌ర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్(కేఈఎస్ఎల్‌) కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ఈ ఒప్పందం త‌ర్వాత కేఈఎస్ఎల్‌లో 88శాతం వాటా ఆర్ఐఐహెచ్ఎల్ సొంతమవుతుంది. కేడిలా హెల్త్‌కేర్‌:- మెటిమెల నివార‌ణ చికిత్సలో వినియోగించే క్లైండమిసిన్ ఫాస్ఫేట్, బెంజోయిల్

Most from this category