STOCKS

News


నిఫ్టీ ఫార్వార్డ్‌ పీఈ@20... ఇప్పుడిక కొనొచ్చా?

Thursday 4th October 2018
Markets_main1538677215.png-20864

తాజా మార్కెట్‌ పతనంతో అంతర్జాతీయ మార్కెట్‌ క్యాప్‌లో భారత వాటా పదేళ్ల చారిత్రక సగటు 2.5 శాతానికి దిగొచ్చిందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తన నివేదికలో పేర్కొంది. ఆగస్ట్‌లో 3 శాతం, జూలైలో 6 శాతం పెరిగిన సూచీలు, సెప్టెంబర్‌ నుంచి చూస్తే ఇప్పటికి 10 శాతం మేర పతనం అయ్యాయి. దీంతో ఈ ఏడాది జూలైలో ఉన్న స్థాయికి సూచీలు తిరిగొచ్చేశాయి. దీర్ఘకాలం పాటు వేచి ఉండే వారు విలువ కలిగిన షేర్లను కొనుగోలు చేసే స్థాయికి మార్కెట్‌ వచ్చిందా? ఇక కొనుగోళ్లు మొదలు పెట్టవచ్చా? అన్న సందేహాలు ఇన్వెస్టర్లకు సహజంగానే వస్తాయి. కానీ, ఇందుకు ఇంకా సమయం ఆసన్నం కాలేదంటోంది మోతీలాల్‌ ఓస్వాల్‌. నిఫ్టీ 2019 ఆర్థిక సంవత్సరం ఈపీఎస్‌ ఆధారంగా 20 రెట్ల వద్ద ట్రేడ్‌ అవుతోందని, ఇది ఇప్పటికీ అధిక స్థాయి అన్నది బ్రోకరేజీ సంస్థ అభిప్రాయం. ‘‘మా ప్రాధాన్యం ఇప్పటికీ లార్జ్‌క్యాప్స్‌నకే. స్థూల ఆర్థిక సవాళ్లు, దేశీయంగా ఈక్విటీ పెట్టుబడులు తగ్గడం, రానున్న ఎన్నికల నేపథ్యంలో మిడ్‌క్యాప్స్‌ కంటే లార్జ్‌క్యాప్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాం’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. 

 

అయితే, విలువలు అంతగా పెరగని నాణ్యమైన కంపెనీల వైపు చూడొచ్చన్నది షేర్‌ఖాన్‌ సూచన. ‘‘రానున్న నెలల్లో వినియోగ ఆధారిత కంపెనీలకు కలిసొస్తుంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో గ్రామీణ, అర్బన్‌ ప్రాంతాల్లో వినియోగం ఊపందుకుంటుంది. ఈ విభాగంలో మారికో, హెచ్‌యూఎల్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం’’ అని షేర్‌ఖాన్‌ అడ్వైజరీ హెడ్‌ హేమంగ్‌జానీ తెలిపారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్స్‌ స్వల్ప కాలంలో ఒత్తిళ్లను ఎదుర్కొంటాయని, అధిక నిధుల సమీకరణ వ్యయాల ప్రభావం పడుతుందని అంచనా వ్యక్తం చేశారు. ‘‘ఆటో రంగంలో ప్రస్తుత కరెక్షన్‌, మధ్య నుంచి దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టుకునేందుకు అవకాశం. ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ కఠినంగా మారుతున్న వాతావరణంలో అధిక కాసా నిధులు కలిగిన ప్రైవేటు బ్యాంకులకు అవకాశంగా మారుతుంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, టైటాన్‌, మారుతి, హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, ఆర్‌బీఎల్‌, అశోక్‌ లేలాండ్‌, మైండ్‌ట్రీ, టాటా కెమికల్స్‌, టీమ్‌లీజ్‌, ఇమామి కంపెనీల పట్ల మోతీలాల్‌ సానుకూలంగా ఉంది.
 You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు..

Friday 5th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:38 సమయంలో 53 పాయింట్ల నష్టంతో 10,551 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ గురువారం ముగింపు స్థాయి 10,631 పాయింట్లతో పోలిస్తే 80 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ శుక్రవారం నెగటివ్‌గా లేదా గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే

చెక్కు చెదరని టాటా గ్రూపు మార్కెట్‌ క్యాప్‌!

Thursday 4th October 2018

టాటా గ్రూపుకు సంబంధించి తాజా మార్కెట్‌ క్రాష్‌లో ఒక ఆశ్చర్యకర పరిణామం ఉంది. అదేమిటంటే గ్రూపు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (గ్రూపు మార్కెట్‌ విలువ) పెద్దగా పతనం కాకుండా స్థిరంగా ఉంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఆగస్ట్‌ 29న నమోదు చేసిన రికార్డు గరిష్ట స్థాయి రూ.38,989 నుంచి పది శాతం పడిపోయింది. కానీ, ఇదే కాలంలో టాటా గ్రూపు స్టాక్స్‌ను ట్రాక్‌ చేసే నిఫ్టీ టాటా గ్రూపు ఇండెక్స్‌ ఆగస్ట్‌ 29న

Most from this category