STOCKS

News


నిఫ్టీ చార్టుల్లో హైవేవ్‌ క్యాండిల్‌

Saturday 2nd February 2019
Markets_main1549099684.png-23965

శుక్రవారం ఒకదశలో 11వేల పాయింట్లను దాటేందుకు యత్నించిన నిఫ్టీ చివరకు 10900 పాయింట్ల వద్ద సెటిలైంది. డైలీ చార్టుల్లో నిఫ్టీ హైవేవ్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. క్యాండిల్‌కు ఉన్న పొడవైన అప్పర్‌విక్‌ సూచీల్లో అమ్మకాల ఒత్తిడిని తెలియజేస్తోంది. గరిష్ఠాలకు చేరగానే అమ్మకాలు వెల్లువెత్తుతున్న సంగతిని ఈ క్యాండిల్‌ చూపుతోంది. దీన్నిబట్టి చూస్తే నిఫ్టీకి 1085-10990 రేంజ్‌ ఇంకా బలమైన నిరోధంగానే పనిచేయబోతుందని అంచనా. దిగువన 10820 స్థాయి కొంత మద్దతునిచ్చే ఛాన్సులున్నాయి. హైవేవ్‌ క్యాండిల్‌ ఏర్పడితే బుల్స్‌, బేర్స్‌ సమానబలంతో  పోరాడుతున్నట్లు భావించాలని మోతీలాల్‌ఓస్వాల్‌ ప్రతినిధి చందన్‌ తపారియా చెప్పారు. 11వేల పాయింట్లకు పైన బలంగా కొనసాగితేనే బుల్స్‌కు పట్టు చిక్కుతుందన్నారు. నిఫ్టీ చార్టులు చూస్తుంటే రాబోయే రోజుల్లో మరింత ఒడిదుడుకులుంటాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ భావిస్తోంది. ఈ వారానికి 11000 పాయింట్లను చేరగానే అమ్మడం, దిగువన కొనడం మంచిదని తెలిపింది. రాబోయే ఒకటిరెండు సెషన్లలో నిఫ్టీ 10987 పాయింట్లను దాటకుంటే మరోమారు 10600 వరకు పడిపోయే ఛాన్సులున్నాయని చార్ట్‌వ్యూఇండియా ప్రతినిధి మజార్‌ మహ్మద్‌ చెప్పారు. నిఫ్టీ 10950 పాయింట్లను చేరినప్పుడు హైరిస్కు ట్రేడర్లు షార్టు పొజిషన్లు తీసుకోవచ్చని, అయితే 10980 పాయింట్ల స్టాప్‌లాస్‌ను ఖచ్ఛితంగా పాటించాలని సూచించారు. 
 



You may be interested

డిజినెన్వస్ట్‌మెంట్‌తో రూ.90వేల కోట్లు

Saturday 2nd February 2019

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా రూ. 90,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. 2018-19లో ఈ లక్ష్యం రూ. 80,000 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ. 36,000 కోట్లు సమీకరించిన కేంద్రం మరో రెండు నెలల్లో ఇంకో రూ. 44,000 కోట్లు సేకరణపై కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా ప్రభుత్వం చర్యలు

బడ్జెట్‌ అనంతరం పెట్టుబడుల ప్లానింగ్‌

Saturday 2nd February 2019

మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సాగు ఆదాయం పెంచేందుకు పలు చర్యలు ప్రకటించారు. మధ్యతరగతిపై పన్ను భారం తగ్గించే యత్నాలు చేశారు. బడ్జెట్‌లో కురిపించిన వరాలు తమ ప్రభుత్వాన్ని మరోమారు గద్దెనెక్కిస్తాయని బీజేపీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో కీలకాంశాలకు అనుగుణంగా లాంగ్‌టర్మ్‌ పెట్టుబడులను ఎలా ప్లాన్‌ చేసుకోవచ్చనే అంశంపై  నిపుణుల సూచనలు, సలహాలు ఇలా ఉన్నాయి... - రూరల్‌ ఇండియా: గ్రామీణ భారతానికి బడ్జెట్లో 1.35 లక్షల కోట్ల ఉద్దీపనలు

Most from this category