STOCKS

News


నిఫ్టీ చార్టులో డోజీ..!

Saturday 1st December 2018
Markets_main1543654428.png-22567

శుక్రవారం నిఫ్టీ 10,876.75 వద్ద ముగిసింది. 10,892 వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో 10,922 పాయింట్ల గరిష్టస్థాయిని, 10,835 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. వరుసగా 5వ రోజు లాభపడిన ఈ సూచీ.. డిసెంబర్‌ సిరీస్‌లో తొలిసారిగా 'డోజీ క్యాండిల్' నమోదుచేసిందని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహమద్‌ అన్నారు. 10,850 స్థాయిని నిలబెట్టుకున్న నిఫ్టీ.. డైలీ చార్టులో డోజీ తరహా క్యాండిల్‌ను ఏర్పాటుచేసిందని, అయితే వీక్లీ చార్టులో బలమైన బుల్లిష్‌ క్యాండిల్‌ను నమోదుచేసిందన్నారు. ఈ నేపథ్యంలో ట్రేడర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించడం మంచిదని సూచించారు. నిఫ్టీ 10,782–10757 స్థాయిలో ఉన్నంత వరకు బుల్లిష్‌గా ఉంటుందని విశ్లేషించిన ఆయన ఈసూచీ 200-రోజుల సగటు కదలికల స్థాయి 10,744 వద్ద ఉందన్నారు. శుక్రవారం గరిష్టస్థాయి అయిన 10,922 పాయింట్ల పైన కొనసాగితే 11,069 వరకు చేరేందుకు అవకాశం ఉందని వివరించారు. జీ-20 సమావేశాలు, అమెరికా-చైనా చర్చలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల వంటి కీలక పరిణామాల మధ్య షార్ట్‌ కవరింగ్‌తో నిఫ్టీ రికవరీ సాధిస్తోందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. నవంబర్‌ సిరీస్‌ ప్రారంభసమయంలో ఉన్నటువంటి నిఫ్టీ ఫ్యూచర్స్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ (ఓఐ) కంటే డిసెంబర్‌ ఓఐ 10 శాతం తక్కువగా ఉందని తెలిసింది. ఇది షార్ట్‌ పొజిషన్ల ముగింపు ట్రెండ్‌ను సూచిస్తుందని వివరించింది. కాల్‌ రైటింగ్‌ పొజిషన్లు పెరగకుండా, 10,500 పుట్‌ ఆప్షన్స్‌ బిల్డ్‌అప్‌ డిసెంబర్‌ సిరీస్‌లో అధికంగా ఉండడం అనేది మార్కెట్‌లో రెసిలియన్స్‌కు సంకేతంగా ఉందని విశ్లేషించింది. 



You may be interested

మెటల్స్‌లో షార్ట్‌ కవరింగ్‌కు ఛాన్స్‌!!

Saturday 1st December 2018

మెటల్‌ స్టాక్స్‌లో షార్ట్‌ కవరింగ్‌కు ఛాన్స్‌ ఉందని మోనార్క్‌ నెట్‌వర్క్‌ క్యాపిటల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అర్పన్‌ షా తెలిపారు. గత కొన్ని రోజులుగా వీటిల్లో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉంటూ వస్తోందని పేర్కొన్నారు. లాంగ్‌ పొజిషన్లకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌ వంటి స్టాక్స్‌కు ప్రాధాన్యమివ్వొచ్చని పేర్కొన్నారు. అలాగే ఆయన 6-15 శాతం రాబడిని అందించే ఐదు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం.. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఈ స్టాక్‌కు తన 50,

సెబీకి పెనాల్టీ చెల్లించిన ఝున్‌ఝన్‌వాలా

Saturday 1st December 2018

ముంబై:- ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ఝున్‌ఝున్‌వాలా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ ఆరోపణల వివాదాన్ని పరిష్కరించుకున్నట్లు శుక్రవారం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. గతేడాదిలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అనుబంధ సంస్థ జీయోమెట్రిక్‌ షేర్ల ట్రేడింగ్‌లో ఝున్‌ఝున్‌వాలా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు గుర్తించి న్యాయపరమైన చర్యలకు పూనుకుంది. ఈ వివాదాన్ని ఝున్‌ఝున్‌వాలా రూ.2.48లక్షల పెనాల్టీ చెల్లింపు ద్వారా సెటిల్‌మెంట్‌ చేసుకున్నట్లు సెబి తెలిపింది. కుదర్చుకున్న సెటిల్‌మెంట్‌లో భాగంగా ఇకపై ఎలాంటి

Most from this category