News


11,700పైన... 12,000 స్థాయికి నిఫ్టీ

Wednesday 17th April 2019
Markets_main1555483083.png-25181

గత 8 ట్రేడింగ్‌ సెషన్లుగా 11,550–11,760 పాయింట్ల శ్రేణి మధ్య కన్సాలిడేట్‌ అయిన నిఫ్టీ ఎట్టకేలకు బ్రేక్‌అవుట్‌ను సాధించగలగడం పాజిటివ్‌గా పరిణామంగా టెక్నికల్‌ అనలిస్టులు పేర్కొంటున్నారు. మంగళవారం నిఫ్టీ 11,810 పాయింట్ల గరిష్టస్థాయి వద్ద కొత్త రికార్డును నెలకొల్పి 97 పాయింట్ల లాభంతో 11,787 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ క్రమంలో డెయిలీ టెక్నికల్‌ చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పర్చినందున, తదుపరి అప్‌ట్రెండ్‌ సాధ్యపడుతుందని అనలిస్టులు వివరిస్తున్నారు. మంగళవారంనాటి గ్యాప్‌అప్‌ ఏరియా 11,704–11,731 పాయింట్ల శ్రేణిపై నిఫ్టీ స్థిరపడితే, కొద్ది ట్రేడింగ్‌ సెషన్లలోనూ 12,000 పాయింట్ల సమీపాన్ని అందుకోవచ్చని చార్ట్స్‌వ్యూ ఇండియా చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజార్‌ మహ్మద్‌ అంచనావేశారు. అయితే నిఫ్టీ 11,700 పాయింట్ల దిగువన ముగిస్తే బుల్లిష్‌ మూమెంటెమ్‌కు తెరపడుతుందని ఆయన అన్నారు. 11,700 పాయింట్ల స్టాప్‌లాస్‌తో 12,000 టార్గెట్‌ కోసం పొజిషన్లు తీసుకోవచ్చని ట్రేడర్లకు ఆయన సూచించారు. 
 



You may be interested

నాలుగునెలల కనిష్టానికి పసిడి

Wednesday 17th April 2019

ప్రపంచమార్కెట్లో డాలరు బలోపేతం అయిన నేపథ్యంలో పసిడి ధర మంగళవారం రాత్రి అమెరికా మార్కెట్లో 4నెలల కనిష్టం 1,273 డాలర్ల వద్దకు పడిపోయింది. అయితే బుధవారం ఈ స్థాయి నుంచి స్వల్పంగా కోలుకునే ప్రయత్నాలు చేస్తున్నది. ఆసియాలో ఉదయం గం.11:15ని.లకు గత రాత్రి ధరతో పోలిస్తే ఔన్స్‌ పసిడి ధర స్వల్పంగా లాభపడి 1,281.55 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. దేశీయంగా రూ.308 క్షీణత:-  అంతర్జాతీయంగా పసిడి 4నెలల కనిష్టానికి పతనమైన నేపథ్యంలో దేశీయంగా పసిడి ఫ్యూచర్లపై ఈ ప్రభావం కన్పించింది.

రిలయన్స్‌ రిఫైనింగ్‌లో రూ.లక్ష కోట్ల వాటా విక్రయం?

Wednesday 17th April 2019

25 శాతం వాటా కొనుగోలుకు సౌదీ అరామ్‌కో చర్చలు మార్కెట్‌క్యాప్‌లో దేశంలో నంబర్‌వన్‌ కంపెనీ, రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికాం వ్యాపారాల దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్‌ వ్యాపారంలో 25 శాతం వాటాను  కొనుగోలు చేసేందుకు ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పాదక కంపెనీల్లో ఒకటైన సౌదీ అరామ్‌కో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడతున్నాయి. ఈ వ్యాపారంలో 25 శాతం మైనారిటీ వాటా విక్రయం ద్వారా 10 నుంచి 15

Most from this category