News


నిఫ్టీ చార్టులో బుల్లిష్‌ క్యాండిల్‌..!

Saturday 3rd November 2018
Markets_main1541229228.png-21677

  • 10,700–10,850 స్థాయికి చేరువలో నిఫ్టీ 50

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. గురువారం నాడు 10,380 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ వారాంతం రోజున 10,462 పాయిం‍ట్ల వద్ద గ్యాప్‌ అప్‌తో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 10,606.95 పాయింట్ల గరిష్టస్థాయికి చేరుకునప్పటికీ.. ట్రేడింగ్‌ చివరిలో ఎదురైన అమ్మకాల ఒత్తిడితో 10,553 వద్ద ముగిసింది. 173 పాయింట్ల(1.66 శాతం) లాభపడింది. ఫండమెంటల్‌గా చూస్తే.. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముగియనుందన్న అంచనాలు సూచీలకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చాయి. అర్జెంటీనాలో జరగనున్న జీ-20 సమావేశం ద్వారా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీ కానున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. ఈ విషయంపై చర్చించనున్నారనే అంశం సూచీలను లాంగ్‌ జంప్‌ చేయించింది. అటో, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, మెటల్‌ రంగాల షేర్ల ర్యాలీ సూచీల భారీ లాభాలకు కారణంగా నిలిచాయి. ఇక గతవారంలో జరిగిన ట్రేడింగ్‌ ఆధారంగా 10,700 వరకు నిఫ్టీ చేరుకునే అవకాశం ఉందని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహ్మద్‌ అన్నారు. ప్రధాన నిరోధమైన 10,450 పాయింట్లను నిఫ్టీ దాటిందని, ఆ తరువాత కీలక నిరోధం 10,700 వద్ద ఉందని ఆయన విశ్లేషించారు. శుక్రవారం నాటి ట్రేడింగ్‌ పరిణామం ఆధారంగా చూస్తే నిఫ్టీ చార్టులో బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పాటైందని వివరించిన ఆయన 10,700–10,850 స్థాయికి నిఫ్టీ సమీపిస్తుందన్నారు. అయితే, ఈస్థాయిని దాటడం బుల్స్‌కు ఏమంత సులభం కాదని వ్యాఖ్యానించారు. ఆసక్తికరంగా 200-రోజుల సగటు కదలికల స్థాయి కూడా 10,765 వద్దనే ఉందన్నారు. సాధారణంగా పుల్‌బ్యాక్‌ మూవ్స్‌లో ఇది మొదటి టార్గెట్‌గా ఉంటుందని విశ్లేషించారు. 10,700 స్థాయి వద్ద ట్రేడర్లు ప్రాఫిట్‌ బుక్‌ చేసుకోవడం మంచిదని సూచించారు. తక్షణ మద్దతు స్థాయి 10,440 వద్ద ఉందని పేర్కొన్నారు.

ఇండియా వోలటలిటీ ఇండెక్స్ 5.01 శాతం పడిపోయి, 18.23 వద్దకు చేరుకుందని మజర్‌ మహ్మద్‌ వివరించారు. స్వల్పకాలిక ట్రెండ్‌ రివర్స్‌, బౌన్స్‌ బ్యాక్‌కు ఈ ఇండెక్స్‌ 17-16 మధ్యలో ఉండాల్సి ఉంటుందన్నారు. ఆప్షన్స్‌ విభాగంలో అత్యధిక పుట్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ (ఓఐ) 10,000 వద్ద.. ఆ తరువాత 10,200 వద్ద ఉన్నట్లు వెల్లడయ్యింది. అత్యధిక కాల్స్‌ ఓఐ 10700 వద్ద ఉండగా.. ఆ తరువాత స్ట్రైక్స్‌ 10,800గా ఉన్నట్లు వెల్లడయ్యింది. గణనీయమైన పుట్‌ రైటింగ్‌ 10,500 ఆ తరువాత 10,600 వద్ద ఉండగా.. అన్ని తక్షణ స్ట్రైక్స్‌ వద్ద కాల్‌ అన్‌వైండింగ్‌ చూస్తుంటే, మార్కెట్‌ మరింత ముందుకు వెళ్లవచ్చనే దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 10450–10650 స్థాయిలో నిఫ్టీ కదలికలు ఉండవచ్చని ఆప్షన్స్‌ బ్యాండ్‌ సూచిస్తుందని మోడిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ డెరవేటివ్స్, టెక్నికల్ అనలిస్ట్ చందాన్ తపరియా అన్నారు. వీక్లీ చార్టు ఆధారంగా చూస్తే.. నిఫ్టీ ప్రధాన నిరోధమైన 10,450 పాయింట్లను నిఫ్టీ అధిగమించిందని, 10,650-10,750 స్థాయికి సమీంచిందని అన్నారు. ఒకవేళ మార్కెట్‌ కిందకు పడిపోతే.. తక్షణ మద్దతు స్థాయి 10,450 వద్ద, ఆ తరువాత మద్దతు స్థాయి 10,380 వద్ద ఉందన్నారు. బ్యాంక్‌ నిఫ్టీ ప్రధాన నిరోధ స్థాయి 25,500-25,650 పాయింట్లను అధిగమించినందున శుక్రవారం ఇంట్రాడే హై అయిన 25,850 స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు.

ఇవి కేవలం మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.


 You may be interested

పసిడి 4వారాల ర్యాలీకి బ్రేక్‌..!

Saturday 3rd November 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్వల్ప నష్టంతో ముగిసింది. ఈ ఆక్టోబర్‌ నెల ఉద్యోగ గణాంకాలను అమెరికా వెల్లడించింది. మార్కెట్‌ వర్గాల అంచనాలను మించి ఆర్థికవ్యవస్థలో నూతనంగా 2.5లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్లు గణాంకాలు తెలిపాయి. అధిక ఉద్యోగకల్పనతో రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెరుగుతాయి. తద్వారా ట్రెజరరీ ఈల్డ్‌తో పాటు డాలర్‌ విలువ కూడా పెరుగుతుంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 96.59స్థాయిని తాకింది. మరోవైపు చైనాతో నెలకొన్న వాణిజ్య

ఇన్ఫో ఎడ్జ్‌ టార్గెట్‌ రూ.1,628

Saturday 3rd November 2018

కంపెనీ: ఇన్ఫో ఎడ్జ్‌ (ఇండియా) లిమిటెడ్‌ సిఫార్సు: సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ధర: రూ.1,467 (నవంబర్‌ 3, 2018న) టార్గెట్‌ ధర: రూ.1,628 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.1,697 /1,126 ఇన్ఫో ఎడ్జ్‌ (ఇండియా) లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక(క్యూ2) ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగా ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు సెంట్రమ్‌ వెల్లడించింది. సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రూపొందించిన రీసెర్చ్‌

Most from this category