ఐటీసీ అండతో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ అప్
By Sakshi

ఐటీసీ షేరు ర్యాలీ అండతో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ బుధవారం పరుగులు పెడుతోంది. ఎన్ఎస్ఈలో ఎఫ్ఎంసీజీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇంట్రాడేలో 2శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.1:30లకు ఇండెక్స్ 1.50శాతం లాభపడి 28,700ల వద్ద ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా ఐటీసీ షేరు ఇండెక్సను పరుగులు పెట్టిస్తోంది. ఐటీసీ నేటి ట్రేడింగ్‌లో 3శాతం లాభపడింది. వాటితో ఇదే సూచీలోని యూనిటెడ్ స్పిరిట్స్, యూనిటెడ్ బేవరీజెస్ 3శాతం లాభపడ్డాయి. డాబర్ ఇండియా, మారికో షేర్లు 2శాతం లాభపడ్డాయి. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రాడెక్ట్స్, ఇమామి, కాల్గోట్, గోద్రేజ్ ఇండస్ట్రీస్ 1శాతం లాభపడ్డాయి. హిందూస్థాన్ యూనిలివర్, టాటా గ్లోబరీస్, జుబిలెండ్ ఫుడ్స్ షేర్లు 1శాతం లాభపడ్డాయి. మరోవైపు గోద్రేజ్ ఇండియా 3శాతం నష్టపోగా బ్రిటానియా 1శాతం క్షీణించింది.
You may be interested
మార్కెట్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు
Wednesday 17th October 2018మార్కెట్ పంచాగకర్తలపై హోవార్డ్ మార్క్స్ విసుర్లు ఆరునెలల టార్గెట్ ఇంత, సంవత్సరం టార్గెట్ అంత.. అంటూ మార్కెట్లో అంచనాలు చెప్పడంపై ప్రముఖ మార్కెట్ గురు హోవార్డ్ మార్క్స్ విసుర్లు గుప్పించారు. మార్కెట్ చక్రీయ వలయంలో మనమెక్కడున్నామో చెప్పవచ్చుకానీ, రేపేం జరుగుతుందో చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు. మార్కెట్లో ఇలా అంచనాలు చెప్పే వాళ్లు రెండురకాలని, ఒకరకం వ్యక్తులకు ఏమీ తెలీదని, రెండో రకం వ్యక్తులకు తమకేమీ తెలీదన్న సంగతి కూడా తెలీదని చమత్కరించారు. తాజాగా
ఐటీ, ఫార్మా.. మార్కెట్‌ను నడిపించలేవు!!
Wednesday 17th October 2018టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ రంగానికి చెందిన షేర్లు ఎక్కువ కాలం బుల్ మార్కెట్‌ను నడిపించలేవని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సభ్యుడు దీపన్ మెహ్తా తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వారంలో చాలా కంపెనీలు వాటి ఎర్నింగ్స్‌ను ప్రకటించనున్నాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు వాటి ఆర్థిక ఫలితాలను వెల్లడించాయని పేర్కొన్నారు. మార్కెట్ ఇప్పటికే బాటమ్‌కు వచ్చేసిందని, అయితే ఇక్కడ ఏ స్థాయిల్లో స్థిరపడుతుందో