STOCKS

News


ఆరునెలల కనిష్టానికి ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌

Tuesday 11th September 2018
Markets_main1536647022.png-20163

  • 3శాతం నష్టపోయిన ఐటీసీ

ముంబై:- పలు ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో మంగళవారం ఎన్‌ఎస్‌ఈలోని ఫాస్ట్‌ మూవింగ్‌ కన్సూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) సూచి ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 30,845.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఎఫ్‌ఎంసీజీ షేర్లలోని ప్రధాన షేర్లైన ఐటీసీ, గోద్రేజ్‌ కన్జూ‍్యమర్‌ ప్రోడెక్ట్స్‌, కాల్గేట్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌(హెచ్‌యుఎల్‌), మారికో, జుబిలెంట్‌ ఫుడ్స్‌ వర్క్స్‌ షేర్లు 1నుంచి 3శాతం నష్టపోయాయి. ఫలితంగా నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 2.10 శాతం(658 పాయింట్లు) వరకూ నష్టపోయి 30164 వద్దకు క్షీణించింది. ఇది ఈ సూచికి ఆరు నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం. ఉదయం గం.11:41ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(30,812)తో పోలిస్తే దాదాపు 1.50శాతం నష్టపోయి 30,236.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సూచీలోని మొత్తం 15 షేర్లకు గానూ 12 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 3 షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా గోద్రేజ్‌ కన్జ్యూమర్‌, ఐటీసీ 3శాతం నష్టపోగా, అదేబాటలో గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌, కొల్గేట్‌, మారికో, డాబర్‌, జుబిలెంట్‌ ఫుడ్స్‌ షేర్లు 2నుంచి 1శాతం నష్టపోయాయి. వాటితో పాటు బ్రిటానియా, మెక్‌డొనాల్డ్స్‌, గ్లాక్సోస్మిత్‌లైన్‌ కన్జూ‍్యయర్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌, మెక్‌డొనాల్డ్స్‌, షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు టాటాగ్లోబల్‌బేవరీజెస్‌, యూబీఎల్‌, పీజీహెచ్‌హెచ్‌ షేర్లు 1నుంచి అరశాతం లాభపడ్డాయి. ఇదే సమయానికి ఐటీసీ 2.76శాతం నష్టపోయి నిఫ్టీ-50 టాప్‌లూజర్లలో చోటు దక్కించుకుంది.



You may be interested

ర్యాలీలో వైదొలగండి..

Tuesday 11th September 2018

ఆరు వారాలుగా లాభాల్లో ముగుస్తూ వచ్చిన మార్కెట్‌ సోమవారం ఒక శాతంమేర పడిపోయింది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేస్తున్నారు. దేశీ గణాంకాలు ప్రోత్సాహకరంగా లేకపోవడం, అంతర్జాతీయ పరిస్థితులు ఇందుకు కారణం. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనమౌతునే ఉండటం సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లతోపాటు సెక్టోరల్‌ ఇండెక్స్‌లు కూడా పడిపోతున్నాయి. మొత్తం మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. రెలిగేర్‌ సెక్యూరిటీస్‌ రిటైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మంగ్లిక్‌ ఒక ఆంగ్ల చానల్‌కు

పెమెంట్స్‌ సేవల విషయంలో నిబంధనలు పాటిస్తాం: గూగుల్‌

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: పేమెంట్‌ సేవలకు సంబంధించిన డేటాను స్థానికంగానే నిల్వ చేయాలన్న ఆర్‌బీఐ నిబంధనలను పాటిస్తామని గూగుల్‌ తెలిపింది. అయితే, ఇందుకు గడువును మరో రెండు నెలలు పొడిగించి, డిసెంబర్‌ వరకు అవకాశం ఇవ్వాలని కోరింది. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌  అమెరికా పర్యటన సమయంలో గూగుల్‌ ఈ విషయాన్ని తెలియజేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గత నెలలో క్యాలిఫోర్నియాలోని గూగుల్‌ ప్రధాన కార్యాలయంలో సీఈవో

Most from this category