STOCKS

News


రెండో రోజూ నష్టాల్లో ఎంఎఫ్‌సీజీ షేర్లు

Tuesday 4th September 2018
Markets_main1536054744.png-19949

వరుసగా రెండో రోజూ ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ సూచిలకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఎంఎఫ్‌జీసీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 3శాతం వరకూ పతనమైంది. ఈ సూచిలోని భాగమైన 15షేర్లలో అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(32,109.55)తో పోలిస్తే 2.20శాతం నష్టంతో 31,413.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలో టాటాగ్లోబల్‌ బేవరేజెస్‌, జుబిలెంట్‌ ఫుడ్స్‌, యూబీఎల్‌, డాబర్‌ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్‌ షేర్లు 5నుంచి 3శాతం నష్టపోయాయి. హిందూస్థాన్‌ యూనిలివర్‌, కోల్గేట్‌, గోద్రేజ్‌ జిందాల్‌, మారికో, జీఎస్‌కే హెల్త్‌కేర్‌, ఐటీసీ, యూనైటెడ్‌ స్పిరిట్‌ లిమిటెడ్స్‌ షేర్లు 2నుంచి 1శాతం వరకూ నష్టపోయాయి. ఇమామి, ప్రోక్టర్ అండ్ గాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్ లిమిటెడ్ అరశాతం వరకు నష్టపోయాయి. ఈ సూచీలోని హెవీవెయిట్‌ షేర్లైన హెచ్‌యూఎల్‌, ఐటీసీ షేర్లు పతనం నిఫ్టీ ఇండెక్స్‌ను బాగా దెబ్బతీసింది. హెచ్‌యూఎల్‌ వరుస రెండు రోజుల్లో 9శాతం మేర నష్టపోయింది.



You may be interested

ఈ రంగాలు మినహా.. మిగతా లార్జ్‌క్యాప్స్‌తో జాగ్రత్త!!

Tuesday 4th September 2018

లార్జ్‌క్యాప్‌ విభాగంలో చాలా వాటిల్లో అధిక వ్యాల్యుయేషన్స్‌ చోటుచేసుకున్నాయి. అందువల్ల వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎక్స్‌పోర్ట్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌, పీఎస్‌యూ రంగాలకు మినహాయింపు ఇవ్వొచ్చు. ఒక ఆంగ్ల చానల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ సీఐవో ఎస్‌.నరేన్‌ ఈ విషయాలు వెల్లడించారు. వచ్చే మూడేళ్ల కాలంలో ఈక్విటీ మార్కెట్‌ కన్నా డెట్‌ మార్కెట్‌లో ఒడిదుడుకులు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.  మార్కెట్లు ఎండ్‌ సైకిల్‌కు చేరుకున్నప్పుడు బాగా పెరుగుతాయని

మరింత తగ్గిన పసిడి

Tuesday 4th September 2018

డాలర్‌ వారం రోజుల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర వరుసగా రెండోరోజూ నష్టాల బాట పట్టింది. ఆసియా మార్కెట్లో మంగళవారం ఔన్స్‌ పసిడి 1,206.7 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టర్కీ, అర్జెంటీనా దేశాల్లో ఆర్థిక సంక్షోభం తెరపైకి రావడంతో వర్థమాన దేశాల్లో కరెన్సీ పతనమైంది. మరోవైపు అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధభయాలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. ఫలితంగా ఈ మధ్యకాలంలో సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక ధోరణిగా అవలంభించే

Most from this category