STOCKS

News


నిఫ్టీ అప్‌ట్రెండ్‌ ర్యాలీకి ఈ షేర్ల ర్యాలీ కీలకం

Friday 9th August 2019
Markets_main1565342304.png-27668

నిఫ్టీ అప్‌ట్రెండ్‌ ర్యాలీకి రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ కీలకమని యస్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రీతీష్‌ మెహతా అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌ పయనంపై మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...

గురువారం మార్కెట్‌ టర్న్‌ అరౌండ్‌లో భాగంగా నిఫ్టీ సూచీ 10,800 వద్ద విరామస్థాయిని ఏర్పరుచుకుందని మెహతా తెలిపారు. బేరిష్‌ కారణాలతో మార్కెట్‌ ఒక పతనదిశలో వెళ్లినప్పుడు కొంతదూరం తర్వాత ఒక సగటు స్థాయికి తిరిగి వస్తుంది. నిఫ్టీ ఇండెక్స్‌ దీర్ఘకాలిక కరెక‌్షన్‌ 10,750-10,800 స్థాయి మధ్యలో విరామం తీసుకొన్నట్లు తెలుస్తోంది. గురువారం లాభాల ముగింపునకు ముందు... చివరి మూడు సెషన్‌లో ఇండెక్స్‌ 10800ల వద్ద స్థాయి వద్ద తీవ్రఒడిదుడుకులకు లోనైంది. నిన్నటి ట్రేడింగ్‌ను మినహాయిస్తే... ఇంట్రాడే రివకరీలను సాధించడానికి చాలా కష్టపడింది. ఏదిఏమైనప్పటికి, ఈ మూడు సెషన్‌లో 10800 వద్ద స్థాయి వద్ద నిఫ్టీ మద్దతు దొరికందనే విషయం మనకు అవగతమవుతోంది. గురువారం మార్కెట్‌ టర్న్‌ అరౌండ్‌ కావడానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు కీలక పాత్ర పోషించాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గరిష్టస్థాయి రూ.1,418నుంచి దాదాపు 20శాతం దిద్దుబాటుకు లోనైన తరువాత బ్యాట్ హార్మోనిక్ నమూనా యొక్క పీఆర్‌జ్‌(పొటెన్షియల్‌ రివర్సల్‌ జోన్‌) నుండి వెనక్కు మరలింది. ఈ స్థానం 2 ఏళ్ల సగటు వద్ద ఉండటంతో సుదీర్ఘ దిద్దుబాటు ముగిసిందని సూచిస్తుంది. అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు సైతం మద్దతు స్థాయి నుంచి తిరిగి వచ్చింది. నిఫ్టీ మరింత ర్యాలీ చేసేందుకు ఈ రెండు హెవీవెయిట్‌లను ఇ‍ప్పుడు ఏర్పచుకున్న స్థాయిల నుంచి మరింత ముందుకు ర్యాలీకి చేయడమనేది చాలా అవసరమని మెహతా అభిప్రాయపడ్డారు. 



You may be interested

నిరాశ ఫలితాలు..14% పతనమైన ఎన్‌బీసీసీ

Friday 9th August 2019

నేషనల్‌ బుల్డింగ్‌ కనస్ట్రక్షన్‌ కార్పోరేషన్‌ (ఎన్‌బీసీసీ) ఇండియా క్యూ1 ఫలితాలు మార్కెట్లను నిరాశపరచడంతో ఈ కంపెనీ షేరు బీఎస్‌ఈలో శుక్రవారం మధ్యాహ్నం 2.25 సమయానికి 14.09 శాతం నష్టపోయి ఐదేళ్ల కనిష్టానికి సమీపంలో (రూ. 34.15 వద్ద) ట్రేడవుతోంది. రియల్‌ ఎస్టేట్‌ విభాగంలో మందగమనం వలన, ఆర్థిక సంవత్సరం 2019 క్యూ1 త్రైమాసికంలో ఎన్‌బీసీసీ నికర లాభం 38 శాతం తగ్గి, రూ. 51 కోట్లుగా నమోదైంది. కాగా గత

బేర్‌ గుప్పిట్లో చిన్నషేర్లు!

Friday 9th August 2019

స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ బేర్‌మార్కెట్లోకి ప్రవేశించాయని టెక్నికల్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన సూచీలు సైతం బేర్‌మార్కెట్లో ప్రవేశించడానికి దగ్గర్లో ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఏడాది గరిష్ఠస్థాయిల నుంచి బిఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ ఇప్పటివరకు 39 శాతం పతనం కాగా, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ 20 శాతం క్షీణించింది. దీంతో టెక్నికల్‌గా ఈ రెండు సూచీలు బేర్‌మార్కెట్లోకి ప్రవేశించినట్లయింది. సెన్సెక్స్‌ తన ఏడాది గరిష్ఠం నుంచి ఇప్పటికి 9 శాతం క్షీణించింది. సాధారణంగా

Most from this category