STOCKS

News


ఫైనాన్షియల్‌ సర్వీసుల షేర్లు...నిలువునా పతనం

Monday 8th July 2019
Markets_main1562580180.png-26901

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం ఫైనాన్షియల్‌ సర్వీసుల షేర్లు తీవ్ర స్థాయిలో నష్టపోయాయి. బడ్జెట్లో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సాహించే దిశగా రూ. కోటికి మించి నగదు తీసుకుంటే 2శాతం పన్ను విధించారు. అలాగే  కంపెనీలు ప్రకటించే బై బ్యాక్‌లపై 20శాతం పన్ను చెల్లించాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ రెండు అంశాలతో నేడు ఈ షేర్లు తీవ్రంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సూచి 3శాతం మేర నష్టపోయింది. ఇండెక్స్‌లో ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ 10.50శాతం పతనమయ్యింది. బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌ 10శాతం పతనమైంది. బజాజ్‌ ఫైనాన్స్‌ 8శాతం, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ 5శాతం, చోళమండలం ఫైనాన్స్‌, ఐసీఐసీఐ ప్రిడెన్షియల్‌, ఎస్‌బీఐ ఇన్సూరెన్స్‌, ఎడెల్వీజ్‌ సర్వీసెస్‌, ఐసీఐసీసీ జనరల్‌ ఇన్సూరెన్స్‌, పీఎఫ్‌సీ షేర్లు 4శాతం నష్టపోయాయి. అలాగే ఈ సూచీలో భాగమైన కోటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ హోల్లింగ్ష్‌, ఐసీసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ షేర్లు 3శాతం నుంచి 2శాతం వరకూ క్షీణించాయి. .  మధ్యాహ్నం గం.3:15ని.లకు నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసుల సూచి 3శాతం నష్టంతో 13,416 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

ఈక్విటీ పెట్టుబడులు పాపం కాదు: విజయ్‌ కేడియా

Monday 8th July 2019

చిన్న వయుసులోనే మల్టీబ్యాగర్‌గా దలాల్‌ స్ట్రీట్‌లో గుర్తింపు పోందారు విజయ్‌ కేడియా. విలువైన పెట్టుబడిదారుగా గుర్తింపు పొందిన కేడియా ప్రభుత్వం బడ్జెట్‌లో మార్కెట్‌లపై పన్నులను విధించి పేద, మధ్య తరహ ఇన్వెస్టర్లు నష్టపోవడానికి కారణం అయ్యిందని ఆరోపించారు. మిగిలిన విషయాలు ఆయన మాటల్లోనే..... ‘‘స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడం సిగరెట్‌ తాగడం, మద్యం సేవించడం వంటి పాపాలుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. లేకపోతే ఈక్విటీలపై పన్నులను విధించేందుకు ఎందుకు మార్గాలను వెతుకుతోందో అర్ధం కావడం లేదు. ఈ

పోస్ట్‌బడ్జెట్‌ సిఫార్సులు!

Monday 8th July 2019

కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అనంతరం పాజిటివ్‌గా ప్రభావితమయ్యే 21 షేర్లను అనలిస్టులు సిఫార్సు చేస్తున్నారు. సామ్‌కో సెక్యూరిటీస్‌: 1. కొచ్చిన్‌ షిప్‌ యార్డ్‌, అదానీ పోర్ట్స్‌: అంతర్గత జలరవాణాపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ఇందులో భాగంగా కార్గొ టెర్మినల్స్‌ సంఖ్యను పెంచనుంది. ఇవన్నీ జలరవాణా విభాగ రంగానికి చెందిన కంపెనీలకు మేలు చేసే అంశాలు. ఈ రెండు కంపెనీలకు కొత్త నౌకలు, పడవలు నిర్మించే ఆర్డర్లు పెరుగుతాయి. దీంతో పాటు

Most from this category